- Home
- Life
- Festival Sarees: బతుకమ్మ, దసరా పండగ కోసం స్పెషల్ పట్టు చీరలు.. టాప్ ట్రెండింగ్ కలెక్షన్ ఇదిగో!
Festival Sarees: బతుకమ్మ, దసరా పండగ కోసం స్పెషల్ పట్టు చీరలు.. టాప్ ట్రెండింగ్ కలెక్షన్ ఇదిగో!
Festival Sarees: బతుకమ్మ, దసరా పండగకి పట్టుచీర కొనాలని ప్లాన్ చేస్తున్నారా? ట్రెడిషనల్ లుక్ తో పాటు మోడ్రన్ టచ్ ఇచ్చే టాప్ ట్రెండింగ్ పట్టు చీరలు ఇక్కడ ఉన్నాయి. మరి బతుకమ్మ వేడుకల్లో అందరి చూపు మీపైనే పడాలంటే ఎలాంటి పట్టు చీరలు ఎంచుకోవాలో చూసేయండి.

టాప్ ట్రెండింగ్ పట్టు చీరలు
దసరా, బతుకమ్మ పండగల కోసం ఆడవాళ్లు మంచి పట్టుచీరలు కొనుగోలు చేస్తుంటారు. ఈ పండగ సీజన్‌లో సంప్రదాయ చేనేత పట్టుచీరలకు మళ్లీ మంచి క్రేజ్ ఉందని ఫ్యాషన్ ట్రెండ్స్ చెబుతున్నాయి. ముఖ్యంగా కాంచీపురం, బనారస్, తుస్సార్ లాంటి చీరలు టాప్ ప్లేస్‌లో ఉన్నాయి. అదే సమయంలో, బరువు తక్కువగా ఉండే చీరలు, కొత్త రంగులు, పెద్ద బోర్డర్, పల్లు ఉన్న డిజైన్లను కూడా జనాలు బాగా ఇష్టపడుతున్నారు. ప్రస్తుతం ట్రెండ్ లో ఉన్న పట్టు చీరలు మీకోసం. చూసేయండి.
కాంచీపురం పట్టు - ఎప్పటికీ ఎవర్‌గ్రీన్
దసరా పట్టుచీర అనగానే మనకు ముందుగా గుర్తొచ్చేది కాంచీపురం పట్టు. వెడల్పాటి బోర్డర్, గ్రాండ్ పల్లు, టెంపుల్ డిజైన్లు, నెమలి, పూల లాంటి సంప్రదాయ వర్క్‌తో ఉండే కాంచీపురం పట్టుచీరలు పండగలకు, పెళ్లిళ్లకు ఎప్పటికీ బెస్ట్ ఛాయిస్. దసరాకి ఫ్యామిలీతో కలిసి ట్రెడిషనల్ లుక్‌లో మెరిసిపోవాలి అనుకునేవాళ్లకు ఈ చీరలు తీసుకోవచ్చు. పాస్టెల్, డ్యూయల్ టోన్, లైట్ వెయిట్ కాంచీపురం రకాలను ట్రై చేయవచ్చు.
బనారస్ పట్టు - జరీతో అదిరిపోయే లుక్
నార్త్ ఇండియన్ స్టైల్‌లో కాస్త గ్రాండ్ లుక్ కావాలంటే బనారస్ పట్టు బెస్ట్ ఆప్షన్. బనారస్ చీరల్లో జరీ వర్క్, అల్లిన డిజైన్లు చాలా స్పెషల్. ఈ ఏడాది బనారస్ చీరల్లో ట్రెడిషనల్ లుక్‌తో పాటు, కట్టుకోవడానికి ఈజీగా ఉండే లైట్ వెయిట్ డిజైన్లు కూడా ఆకట్టుకుంటున్నాయి. ఎరుపు, ఆకుపచ్చ, నీలం లాంటి జువెల్ టోన్స్‌తో పాటు, పింక్, మింట్, లైలాక్, ఐవరీ, షాంపైన్ లాంటి సాఫ్ట్ కలర్స్‌లో కూడా బనారస్ రకాలు మార్కెట్లోకి వస్తున్నాయి.
మైసూర్ పట్టు - రాయల్ లుక్
ఎక్కువ వర్క్ లేకుండా, చీర క్వాలిటీ, కలర్ మాత్రమే హైలైట్ అవ్వాలంటే మైసూర్ పట్టు మంచి ఛాయిస్. మైసూర్ పట్టు దాని సాఫ్ట్ నేచర్, షైనీ లుక్, బరువు తక్కువగా ఉండటం వల్ల బాగా ఫేమస్. హెవీ జరీ, ఎక్కువ డిజైన్లకు బదులుగా, సన్నటి జరీ బోర్డర్ ఉన్న మైసూర్ పట్టును ఎంచుకుంటే చాలా క్లాసీ లుక్ వస్తుంది. చీర గ్రాండ్‌గా ఉండాలి, కానీ ఓవర్ డిజైన్ ఉండకూడదు అనుకునేవాళ్లకు ఇది మంచి ఎంపిక.
తుస్సార్ పట్టు - స్టైలిష్ లుక్
ప్రతి పండగకి ఒకేలా మెరిసిపోయే పట్టుచీర కట్టుకోవడం ఇష్టం లేకపోతే, మీరు తుస్సార్ పట్టును ట్రై చేయవచ్చు. తుస్సార్ పట్టు స్పెషాలిటీ ఏంటంటే, దాని సహజమైన దారాల వల్ల వచ్చే కాస్త రఫ్, యూనిక్ టెక్స్చర్. కళ్లు చెదిరే మెరుపు కంటే, న్యాచురల్ టెక్స్చర్, సాఫ్ట్ షైనింగ్ దీని అందం. ప్రస్తుతం ఈ పట్టుచీరలకు మళ్లీ డిమాండ్ పెరుగుతోందని ఫ్యాషన్ ట్రెండ్స్ చెబుతున్నాయి. పసుపు, బ్రిక్ రెడ్, బ్రౌన్, గ్రీన్ లాంటి న్యాచురల్, ఎర్తీ కలర్స్‌లో తుస్సార్ పట్టు చాలా అందంగా ఉంటుంది.
పైథానీ పట్టు - పల్లునే హైలైట్
అందరిలో మీ చీర ప్రత్యేకంగా కనిపించాలంటే పైథానీ పట్టు ఒక డిఫరెంట్ ఛాయిస్. పైథానీ చీరలు డార్క్ కలర్స్, స్పెషల్ పల్లు డిజైన్లకు బాగా ఫేమస్. నెమలి లాంటి సంప్రదాయ డిజైన్లతో ఉండే పల్లు దీనికి మెయిన్ అట్రాక్షన్. ప్రస్తుత పండగ కలెక్షన్లలో కూడా పైథానీ చీరలు పట్టు మెరుపుతో, గ్రాండ్ పల్లు, జరీ వర్క్‌తో ఆకట్టుకుంటున్నాయి.
చందేరీ పట్టు - లైట్‌గా, ఎలిగెంట్‌గా
పండగకి పట్టుచీర కట్టుకోవాలి, కానీ గంటల తరబడి బరువైన చీరను మోయలేము అనుకుంటే చందేరీ పట్టు లాంటి లైట్ వెయిట్ శారీస్ మంచి ఎంపిక. చందేరీ నేతలో పట్టు, కాటన్, పట్టు-కాటన్ లాంటి చాలా రకాలు ఉన్నాయి. అందుకే షాప్‌లో కొనేటప్పుడు ఇది ఏ దారంతో నేసిందో క్లియర్‌గా అడిగి తెలుసుకోవడం ముఖ్యం. దీని లైట్ వెయిట్ లుక్, సాఫ్ట్ డ్రేప్ పగటిపూట ఫంక్షన్లకు, ఎక్కువసేపు కట్టుకోవాల్సిన వేడుకలకు చాలా కంఫర్ట్‌గా ఉంటుంది.
టిష్యూ సిల్క్ - లైట్, షైనీ లుక్
బరువైన పట్టుచీరకు బదులుగా, పండగ లుక్, లైట్ వెయిట్ శారీ కావాలంటే టిష్యూ సిల్క్ రకాలను ట్రై చేయవచ్చు. ప్యూర్ సిల్క్, సిల్క్ బ్లెండ్ లాంటి చాలా దారాల్లో టిష్యూ లాంటి నేత, షైనీ లుక్ ఉన్న చీరలు దొరుకుతాయి. కాబట్టి కొనేటప్పుడు ప్యూర్ సిల్కా, మిక్స్‌డ్ దారమా అనేది చూసి కొనాలి. ఈ రకం చీరలు ఫోటోల్లో చాలా అట్రాక్టివ్‌గా కనిపిస్తాయి. కట్టుకోవడానికి చాలా కంఫర్ట్‌గా ఉంటాయి.

