MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today's Rasi Phalalu
Pakistan Economic Crisis
Epic First Semester BO Collections
Megastar Chiranjeevi
Bigg Boss Telugu 10
Srikanth Daughter Medha Meka
Asian Games 2026
IMD Weather Update
Today's Rasi Phalalu
Jr NTR Injury Update
OTT Releases This Week
Actress Roja Selvamani
Team India Captain
Dimpu Kallem Asha
Abhishek Sharma
Missing Meghana Movie Review
Getup Srinu Remuneration
Chicken Curry Recipe
  • Home
  • Life
  • Mango Pickle: మామిడి ఊరకాయ ఎక్కువ కాలం తాజాగా నిల్వ ఉండాలంటే ఈ చిట్కాలు పాటించాల్సిందే

Mango Pickle: మామిడి ఊరకాయ ఎక్కువ కాలం తాజాగా నిల్వ ఉండాలంటే ఈ చిట్కాలు పాటించాల్సిందే

Mango Pickle మామిడి కాయలతో పెట్టే ఆవకాయలు, ఊరగాయలు త్వరగా పాడవుతున్నాయా? ఎక్కువ కాలం పాటు పాడవకుండా ఉండాలంటే కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. దాన్ని తయారుచేసేటప్పుడు కొన్ని చిట్కాలు పాటించడం వల్ల ఏడాది దాటినా ఊరగాయ తాజాగా ఉంటుంది.

1 Min read
Author : Haritha Chappa
Published : Jun 29 2026, 10:37 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
13
సరైన మామిడికాయల ఎంపిక
Image Credit : Freepik

సరైన మామిడికాయల ఎంపిక

మామిడి కాయ పచ్చడి పెట్టేటప్పుడు మామిడికాయల ఎంపిక చాలా ముఖ్యం. కొంచెం పండు బారినా లేదా లోపల జీడి ఏర్పడిన కాయలు వాడితే పచ్చడి రుచిగా రాదు.  ఆ పచ్చడి త్వరగా పాడయ్యే ప్రమాదం కూడా ఉంటుంది. కాబట్టి పచ్చడి మామిడికాయలను సరిగా ఎంపిక చేసుకోవాలి. 

మామిడి పచ్చడిలో ఆవనూనె మాత్రమే వాడాలి.  ఆవనూనె సహజ నిల్వకారిగా (ప్రిజర్వేటివ్‌గా) పనిచేస్తుంది. నూనె లేకుండా పొడిగా పచ్చడి పెడితే అది పాడవుతుంది.  మసాలాలు కలిపిన తర్వాత, ముక్కలు సగానికి పైగా మునిగేలా నూనె పోయాలి. ఇలా చేస్తే పచ్చడి ఏళ్ల తరబడి నిల్వ ఉంటుంది.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
23
ఉప్పు కొంచెం ఎక్కువే ఉండాలి
Image Credit : Gemini AI

ఉప్పు కొంచెం ఎక్కువే ఉండాలి

పచ్చడి ఎక్కువ కాలం నిల్వ ఉండాలంటే ఉప్పు కొంచెం ఎక్కువగానే వేయాలి. అయోడిన్ ఉన్న ఉప్పు వాడటం వల్ల రుచి పెరగడమే కాకుండా, పచ్చడికి బూజు పట్టకుండా ఉంటుంది. దీంతో పచ్చడి రుచి రెట్టింపు వస్తుంది.

ఇంగువ, మెంతులు, ఆవాలను దోరగా వేయించి పొడి చేసుకోవాలి. ఈ మసాలా పొడి పచ్చడి రుచిని పెంచడమే కాకుండా, ఎక్కువ కాలం పాడవకుండా కాపాడుతుంది. ఈ మసాలాలు పచ్చడికి మంచి రుచి, సువాసన ఇస్తాయి.

33
పొడి జాడీలోనే నిల్వ చేయాలి
Image Credit : Gemini AI

పొడి జాడీలోనే నిల్వ చేయాలి

పచ్చడిని ఎప్పుడూ పూర్తిగా పొడిగా ఉన్న గాజు లేదా పింగాణీ జాడీలోనే నిల్వ చేయాలి. జాడీ తడిగా లేదా మురికిగా ఉంటే పచ్చడి పాడవుతుంది. పచ్చడి తీసేటప్పుడు కూడా పొడి చెంచానే వాడాలి. పచ్చడికి అస్సలు తేమ తగలనివ్వకూడదు.

పచ్చడి కలిపిన తర్వాత, జాడీ మూతపై పలుచని బట్ట కట్టి 4 నుంచి 7 రోజుల పాటు రోజూ కొన్ని గంటలు ఎండలో పెట్టాలి. పచ్చడి ఎక్కువ కాలం నిల్వ ఉండాలంటే ఎండలో పెట్టడం అస్సలు మర్చిపోవద్దు. ఇలా చేయడం వల్ల తేమ ఆరిపోయి, పచ్చడి ఎక్కువ రోజులు మన్నుతుంది.

About the Author

HC
Haritha Chappa
హరిత ఏసియా నెట్‌లో చీఫ్ సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. జర్నలిజంలో పీజీ పూర్తి చేశారు. ఈనాడు, సమయం, ఆంధ్రజ్యోతి, ఏబీపీ నెట్ వర్క్, హిందూస్థాన్ టైమ్స్ లో పనిచేశారు. ప్రింట్, డిజిటర్ మీడియాలో 18 ఏళ్ల అనుభవం ఉంది. ఏసియా నెట్ లైఫ్ స్టైల్, బిజినెస్, ఓటీటీ మూవీ కంటెంట్, ఆస్ట్రాలజీ కంటెంట్ రాస్తారు.
ఆహారం
జీవనశైలి
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Sprouted Green Gram: 30 రోజులపాటు మొలకెత్తిన పెసలు తింటే ఏమవుతుందో తెలుసా?
Recommended image2
Stubborn Pimples: 7 డేస్ ఛాలెంజ్..జీవితంలో మొటిమలు, యాక్నే రాదు.
Recommended image3
Rice Cooking: కుక్కర్‌లో వండిన అన్నం మంచిదా? లేక వార్చి వండినది ఆరోగ్యకరమా?
Related Stories
Recommended image1
Mutton Paya: కుక్కర్లో మటన్ పాయా సింపుల్ గా ఇలా వండేయండి.. రెసిపీ ఇదిగో
Recommended image2
Brahma Sarovaram: జీవితంలో ఒక్కసారైనా బ్రహ్మసరోవరం చూసి రండి.. ఈ పవిత్ర సరస్సు ఎక్కుడుందంటే?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved