MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today's Rasi Phalalu
Abhishek Sharma
Missing Meghana Movie Review
Getup Srinu Remuneration
Chicken Curry Recipe
UPI Payment Charges
Irumudi Movie BO Collections
Indian Railways New Rule
Ramba Oorvasi Menaka BO Collections
Bethlehem Kudumba Unit OTT Release
Team India Squad for West Indies ODI Series
IMD Weather Update
Jio Free Canva Pro Subscription
Epic Movie BO Collections
Tirumala Srivari Brahmotsavam
Mandaadi Movie BO Collections
Bigg Boss Telugu 10
  • Home
  • Life
  • Mutton Paya: కుక్కర్లో మటన్ పాయా సింపుల్ గా ఇలా వండేయండి.. రెసిపీ ఇదిగో

Mutton Paya: కుక్కర్లో మటన్ పాయా సింపుల్ గా ఇలా వండేయండి.. రెసిపీ ఇదిగో

Mutton Paya: మటన్ పాయా అంటే మేక కాళ్లతో వండే సూప్. ఇది చాలా రుచిగా ఉండడంతో పాటూ రెసిపీ కూడా చాలా సులువుగా ఉంటుంది. కుక్కర్లో సింపుల్ మటన్ పాయా ఎలా చేయాలో ఇక్కడ ఇచ్చాము. 

1 Min read
Author : Haritha Chappa
Published : Jun 28 2026, 08:52 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
13
మటన్ పాయా సూప్
Image Credit : Asma Dhanshe/Youtube

మటన్ పాయా సూప్

మటన్ పాయా సూప్ రుచి మామూలుగా ఉండదు. కుక్కర్‌లో దీన్ని సులభంగా తక్కువ సమయంలో మంచి రుచితో వండేసుకోవచ్చు. ఎముకల సమస్యలు ఉన్న వారికి మటన్ పాయా అద్భుతమైన వంటకం. దీనిలో ఉండే పోషకాలు ఎముకలను బలంగా మారుస్తాయి. ఇక మటన్ పాయా కుక్కర్లో ఎలా వండాలో తెలుసుకోండి.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
23
మటన్ పాయా రెసిపీకి కావాల్సిన పదార్థాలు
Image Credit : mena FN

మటన్ పాయా రెసిపీకి కావాల్సిన పదార్థాలు

మటన్ పాయా (మేక కాళ్ళు): 4 నుండి 6

నూనె లేదా నెయ్యి: 2 టేబుల్ స్పూన్లు

ఉల్లిపాయలు: ఒకటి

పచ్చిమిర్చి: మూడు

అల్లం వెల్లుల్లి పేస్ట్: ఒక టీ స్పూను

పసుపు: ఒక స్పూను

కారం: ఒక స్పూన్

ధనియాల పొడి: ఒక టీస్పూన్

గరం మసాలా: ఒక టీస్పూన్

మిరియాల పొడి : ఒక టీస్పూన్

ఉప్పు: రుచికి సరిపడా

నిమ్మరసం: ఒక స్పూన్

కొత్తిమీర, పుదీనా తరుగు: గుప్పెడు

నీరు: 4 నుండి 5 కప్పులు

33
మటన్ పాయా రెసిపీ
Image Credit : AMINA CREATIONS

మటన్ పాయా రెసిపీ

1. మటన్ పాయాలను వేడి నీటిలో బాగా కడిగి పక్కన పెట్టుకోవాలి.ప్రెషర్ కుక్కర్‌లో నూనె లేదా నెయ్యి వేసి వేడిచేయాలి.

2. సన్నగా తరిగిన ఉల్లిపాయలు, పచ్చిమిర్చి వేసి దోరగా వేయించాలి. తరువాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చి వాసన పోయే వరకు వేయించాలి.

3. ఇందులో పసుపు, కారం, ధనియాల పొడి, ఉప్పు వేసి కలపాలి.

4. శుభ్రం చేసుకున్న పాయా ముక్కలను కుక్కర్‌లో వేసి, 2 నిమిషాలు మసాలా పట్టేలా వేయించాలి.

5. తర్వాత 4 నుండి 5 కప్పుల నీళ్లు పోసి, గరం మసాలా, మిరియాల పొడి వేసి కలపాలి.

6. కుక్కర్ మూత పెట్టి, మీడియం మంటపై 10 నుండి 12 విజిల్స్ వచ్చే వరకు ఉడికించాలి

7. కుక్కర్ ప్రెజర్ మొత్తం తగ్గిపోయాక మూత తీసి, నిమ్మరసం, కొత్తిమీర, పుదీనా చల్లి వేడివేడిగా సర్వ్ చేయాలి.

About the Author

HC
Haritha Chappa
హరిత ఏసియా నెట్‌లో చీఫ్ సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. జర్నలిజంలో పీజీ పూర్తి చేశారు. ఈనాడు, సమయం, ఆంధ్రజ్యోతి, ఏబీపీ నెట్ వర్క్, హిందూస్థాన్ టైమ్స్ లో పనిచేశారు. ప్రింట్, డిజిటర్ మీడియాలో 18 ఏళ్ల అనుభవం ఉంది. ఏసియా నెట్ లైఫ్ స్టైల్, బిజినెస్, ఓటీటీ మూవీ కంటెంట్, ఆస్ట్రాలజీ కంటెంట్ రాస్తారు.
ఆహారం
జీవనశైలి
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Blood Pressure: బీపీ మిష‌న్ ఎలా ప‌నిచేస్తుంది.? దీని వెన‌కాల ఉన్న మెకానిజం ఏంటో తెలుసా?
Recommended image2
Guava: రోజుకి ఒక జామపండు తింటే ఏం జరుగుతుంది?
Recommended image3
Hair Oil: కొబ్బరి నూనె Vs రోజ్ మేరీ ఆయిల్.. ఈ రెండింటిలో ఏ నూనె వాడితే జుట్టు ఫాస్ట్ గా పెరుగుతుంది..!
Related Stories
Recommended image1
Doormat: గుమ్మం ముందు ఉన్న డోర్‌మ్యాట్ కింద ఈ వస్తువు పెట్టారంటే డబ్బు సమస్యలు రావు
Recommended image2
Brahma Sarovaram: జీవితంలో ఒక్కసారైనా బ్రహ్మసరోవరం చూసి రండి.. ఈ పవిత్ర సరస్సు ఎక్కుడుందంటే?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved