Diabetes: మధుమేహాన్ని అదుపులో ఉంచే చిట్కాలు.. మీ కోసం..
Diabetes: ఈ రోజుల్లో మధుమేహం సర్వ సాధారణ సమస్యగా మారిపోయింది. అయితే కొన్ని రకాల ఆహారాలను మధుమేహాన్ని అదుపులో ఉంచుతాయి. అవేంటంటే..
ఈ కాలంలో ప్రాణాంతకమైన రోగాలు సైతం సర్వసాధారణంగా మారిపోయాయి. అందులో షుగర్ వ్యాధి ఒకటి. సాధారణంగా ఈ వ్యాధి ఒక్కసారి వచ్చిందంటే.. జీవితాంతం మనతోనే ఉంటుంది. దీన్ని పూర్తిగా తగ్గించలేం కాబట్టి.. అదుపులో ఉంచుకోవాలి. అయితే కొంతమంది మధుమేహులకు ఏవి తినాలో తెలియదు. దీంతో ఏది పడితే అది తింటూ ఆరోగ్యాన్ని దెబ్బతీసుకుంటున్నారు. అయితే కొన్ని రకాల ఆహారాలు షుగర్ వ్యాధిని నియంత్రణలో ఉంచుతాయి. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం..
fiber
ఫైబర్
ఫైబర్ మన ఆరోగ్యానికి చాలా అవసరం. ఇది ఎన్నో రోగాలను తగ్గిస్తుంది. మరెన్నో జబ్బుల ప్రమాదాన్ని తగ్గిస్తుంది. ఫైబర్ ఆరోగ్యంగా బరువు తగ్గేందుకు కూడా సహాయపడుతుంది. పప్పు ధాన్యాలు, పండ్లు, తాజా కూరగాయలు, గింజలు, తృణధాన్యాలు, విత్తనాల్లో ఫైబర్ కంటెంట్ ఎక్కువ మొత్తంలో ఉంటుంది. వీటిని మీ రోజు వారి ఆహారంలో చేర్చుకోవడం వల్ల మధుమేహం నియంత్రణలో ఉంటుంది.
కార్బోహైడ్రేట్లను ఎక్కువగా తీసుకోకూడదు
మధుమేహులు కార్భోహైడ్రేట్లను మోతాదుకు మించి తీసుకోవడం ఆరోగ్యానికి అస్సలు మంచిది కాదు. ఎందుకంటే పిండి పదార్థాలు రక్తంలో చక్కెర స్థాయిలను ఎక్కువగా పెంచుతాయి. అందుకే కార్భోహైడ్రేట్లు ఎక్కువగా ఉండే ఆహారాలను తక్కువ మొత్తంలో తీసుకోవాలి.
తక్కువగా ఎక్కువ సార్లు తినండి
మధుమేహం సమస్యతో బాధపడేవారు భోజనాన్ని ఒకేసారి ఎక్కువగా తినకూడదు. రోజుకు మూడు సార్లు ఎక్కువ మొత్తంలో తినే బదులు రోజుకు నాలుగు పూటలా కొంచెం కొంచెం తినండి.
శుద్ధి చేసిన ఆహారాలకు దూరంగా ఉండండి
శుద్ది చేసిన ఆహారాలను మధుమేహుల ఆరోగ్యానికి ఏ మాత్రం మంచివి కావు. ఇవి వారి ఆరోగ్యాన్ని మరింత దిగజార్చుతాయి. చాక్లెట్లు, శీతల పానీయాలు, వైట్ రైస్, కొవ్వు ఎక్కువగా ఉండే ఆహారాలు, చక్కెర, మైదా వంటి శుద్ధి చేసిన ఆహారాలను తినకపోవడమే మీ ఆరోగ్యానికి మంచిది. ఎందుకంటే ఇవి మీ రక్తంలో చక్కెర స్థాయిలను అమాంతం పెంచుతాయి.
చక్కెర తక్కువగా ఉండే ఆహారాలనే తినండి
షుగర్ పేషెంట్ల ఆరోగ్యానికి చక్కెర ఏ మాత్రం మంచిది కాదు. అందుకే వీరు చక్కెర ఎక్కువగా ఉండే ఆహారాలను తక్కువగా తినాలి. స్ట్రాబెర్రీలు, జామ, నేరేడు పండ్లు, జామ పండ్లను ఎక్కువగా తినొచ్చు. ఈ పండ్లలో షుగర్ కంటెంట్ చాలా తక్కువగా ఉంటుంది.
మొలకలు
మొలకలు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. వీటిలో శరీరానికి కావాల్సిన ఎన్నో పోషకాలు లభిస్తాయి. అందుకే వీటిని మీ రోజు వారి ఆహారంలో చేర్చండి. ఇవి రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రణలో ఉంచుతాయి.
యాంటీ ఆక్సిడెంట్లు ఎక్కువగా ఉండే ఆహారాలను తినండి
యాంటీ ఆక్సిడెంట్లు, విటమిన్ ఎ, విటమిన్ సి ఎక్కువగా ఉండే ఆహారాలను ఎక్కువగా తినండి. అలాగే మెగ్నీషియం, క్రోమియం, సెలీనియం, జింక్ వంటి పోషక ఆహార పదార్థాలను తినడం వల్ల రక్తంలో చక్కెర స్థాయిలు నియంత్రనలనో ఉంటాయి.
Exercise
వ్యాయామం
క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం వల్ల శరీరం ఫిట్ గా ఆరోగ్యంగా ఉంటుంది. అలాగే రక్తంలో చక్కెర స్థాయిలు నియంత్రణలో ఉంటాయి. ఇందు కోసం మీరు రెగ్యులర్ గా 30 నుంచి 40 నిమిషాలు వ్యాయామం చేయాలి.