MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today's Rasi Phalalu
Toxic Movie First Review
India's Shortest Train Journey
Onion & Sugar Prices
Irumudi Movie 4 Days Collections
Megastar Chiranjeevi
Dhruv Jurel
OTT Releases
Devdutt Padikkal
Dakshina Kailasam Temple
Bigg Boss Agnipariksha
  • Home
  • Life
  • Nighty: ప్రతి ఇంట్లో కనిపించే నైటీ కథ ఇదే.. మనదేశంలో ఎప్పుడు ఎలా మొదలైందంటే

Nighty: ప్రతి ఇంట్లో కనిపించే నైటీ కథ ఇదే.. మనదేశంలో ఎప్పుడు ఎలా మొదలైందంటే

Nighty: ఇంట్లో ఉన్న మహిళలు నైటీలు తప్పకుండా వేసుకుంటున్నారు. ఈ సంస్కృతి మనది కాకపోవచ్చు కానీ ఇప్పుడు మాత్రం మహిళల వార్డ్ రోబ్‌లో నైటీలకు ప్రత్యేక స్థానం ఉంది. అసలు నైటీలు వేసుకునే అలవాటు మనకి ఎప్పటి నుంచి మొదలైంది? 

2 Min read
Author : Haritha Chappa
Published : Jun 03 2026, 10:50 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
14
నైటీ చరిత్ర
Image Credit : Chat gpt

నైటీ చరిత్ర

భారతదేశంలో ఇప్పుడు మహిళల రోజువారీ జీవితంలో నైటీ ఒక ముఖ్యమైన డ్రెస్‌గా మారిపోయింది. ఇళ్లల్లో పనులు చేసుకునేందుకు, నిద్రపోయేటప్పుడు నైటీ చాలా కంఫర్ట్ గా ఉంటోందని మహిళల అభిప్రాయం. అందుకే కోట్లాదిమంది మహిళలకు నైటీలు ఫేవరేట్ అయిపోయాయి. కానీ ఒకప్పుడు భారతదేశంలో మహిళలకు నైటీలు అంటేనే తెలియదు. అవి వేసుకునే అలవాటే లేదు. ఎప్పుడు సంప్రదాయ పద్ధతిలో చీరలు, లంగాఓణీలతోనే ఉండేవారు. కానీ ఇప్పుడు నైటీలు మహిళలకు సౌకర్యంగా ఉండే దుస్తుల్లో మొదటి స్థానాన్ని ఆక్రమించాయి. అసలు నైటీలు మనం దేశానికి ఎలా వచ్చాయి? మన సంస్కృతిలో ఎలా భాగం అయ్యాయి?

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
24
నైట్ గౌన్ నుంచి పుట్టింది
Image Credit : instore.co.in

నైట్ గౌన్ నుంచి పుట్టింది

నైటీ అనే డ్రెస్ మూలాలు పాశ్చాత్య దేశాల్లోని నైట్ గౌన్ సంస్కృతితో అనుబంధం కలిగి ఉన్నాయి. 19వ శతాబ్దం చివర నుంచి యూరోప్ దేశాల్లోని మహిళలు రాత్రి నిద్రపోయే సమయంలో పొడవైన, వదులైన గౌన్లను ధరించేవారు. ఎక్కువగా ధనిక కుటుంబాల్లోని వారే ఇలాంటివి వేసుకొని నిద్రపోయేవారు. రాత్రిపూట ఈ దుస్తులు సౌకర్యంగా ఉంటాయని వారు భావించేవారు. ఇక మన దేశంలో బ్రిటిష్ పాలన ప్రారంభమయ్యాక వారి దుస్తుల ప్రభావం కూడా మన దేశంపూ పడింది. కానీ ఆ సమయంలో నైటీలు మన మహిళల జీవితంలో భాగం కాలేదు. కేవలం కొన్ని ధనవంతుల కుటుంబాల్లో మాత్రమే కనిపించేవి .

Related Articles

Related image1
Coconut Shells: కొబ్బరి చిప్పలతో సులువుగా చేసే క్రాఫ్ట్స్ ఇవిగో.. మీ ఇంటి అందాన్ని పెంచేస్తాయి
Related image2
Flights: అంటార్కిటికా ఖండంపై విమానాలు ఎందుకు ఎగరవు? ఎగిరితే ఏమవుతుంది?
34
ఎప్పట్నించి వేసుకుంటున్నారు?
Image Credit : Amazon

ఎప్పట్నించి వేసుకుంటున్నారు?

భారతదేశనికి స్వాతంత్య్రం వచ్చిన తర్వాత ముఖ్యంగా 1970 నుంచి 80 దశకంలో భారతదేశంలోని జీవన శైలిలో ఎన్నో మార్పులు కనిపించాయి. ముఖ్యంగా ఉద్యోగాలు చేసే మహిళల సంఖ్య పెరిగింది. అలాగే మార్కెట్లో రెడీమేడ్ దుస్తులు అమ్మకాలు కూడా ఎక్కువయ్యాయి. ఆ సమయంలోనే నైటీలు మెల్లగా మార్కెట్లో అడుగుపెట్టాయి. మొదట వీటిని ఎవరూ పెద్దగా కొనలేదు. వాటిని వేసుకుంటే విచిత్రంగా చూసేవారు. చీరలతోనే రాత్రిపూట నిద్రపోయేవారు. అయితే ఉద్యోగం చేసే మహిళలు, ధనిక కుటుంబాలకు చెందిన మహిళలు మొదటగా నైటీలను వేసుకోవడం మొదలుపెట్టారు. ఇంటి పనులు చేస్తున్నప్పుడు సౌకర్యంగా అనిపించడం వల్ల వారికి ఎంతగానో నచ్చేసాయి. ముఖ్యంగా చవక ధరల్లో దొరకడం ప్రారంభించాయి. అలాగే రాత్రిపూట కూడా ఇవి చాలా సౌకర్యవంతంగా ఉండడంతో మెల్లగా పట్టణంలో నివసించే మహిళల్లో నైటీ సంస్కృతి పెరిగిపోయింది.

44
పగలు రాత్రి నైటీల్లోనే
Image Credit : PongiNighties

పగలు రాత్రి నైటీల్లోనే

ఇప్పుడు కాలం పూర్తిగా మారిపోయింది. నైటీని రాత్రి పగలు కూడా వేసుకొని తిరిగేస్తున్నారు. ఇది భారతీయ సంస్కృతిలో ఒక భాగం అయిపోయింది. ఇప్పుడు నైటీల మార్కెట్ కోట్ల రూపాయల్లో నడుస్తోంది. రకరకాల రంగులు, డిజైన్లు, పూల ప్రింట్లు, రకరకాల ఫ్యాబ్రిక్ లతో నైటీలు మహిళల మనసు దోచుకుంటున్నాయి. రోజువారీ సౌకర్యానికి గుర్తుగా నైటీలను మహిళలు భావిస్తున్నారు. ఇది ఒకప్పుడు ఇది విదేశీ ప్రభావంతో వచ్చిన దుస్తులే కావచ్చు కానీ ఇప్పుడు భారతీయ కుటుంబాల్లో మాత్రం ప్రత్యేక స్థానాన్ని సంపాదించాయి.

About the Author

HC
Haritha Chappa
హరిత ఏసియా నెట్‌లో చీఫ్ సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. జర్నలిజంలో పీజీ పూర్తి చేశారు. ఈనాడు, సమయం, ఆంధ్రజ్యోతి, ఏబీపీ నెట్ వర్క్, హిందూస్థాన్ టైమ్స్ లో పనిచేశారు. ప్రింట్, డిజిటర్ మీడియాలో 18 ఏళ్ల అనుభవం ఉంది. ఏసియా నెట్ లైఫ్ స్టైల్, బిజినెస్, ఓటీటీ మూవీ కంటెంట్, ఆస్ట్రాలజీ కంటెంట్ రాస్తారు.
ఫ్యాషన్
జీవనశైలి

Latest Videos
Recommended Stories
Recommended image1
ఈ మొక్కలు ఇంట్లో ఉంటే అప్పులపాలవుతారు
Recommended image2
Wall Stickers: గోడపై అంటుకున్న స్టిక్కర్లను పెయింట్ పోకుండా ఇలా ఈజీగా తీసేయండి!
Recommended image3
Sleep Problems: నిద్రలో పదేపదే మెలకువ వస్తోందా? ఈ 5 విషయాలు చెక్ చేసుకోండి!
Related Stories
Recommended image1
Coconut Shells: కొబ్బరి చిప్పలతో సులువుగా చేసే క్రాఫ్ట్స్ ఇవిగో.. మీ ఇంటి అందాన్ని పెంచేస్తాయి
Recommended image2
Flights: అంటార్కిటికా ఖండంపై విమానాలు ఎందుకు ఎగరవు? ఎగిరితే ఏమవుతుంది?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved