Vada: గారెలు క్రిస్పీగా వచ్చే సీక్రెట్ ఇదే.. దీన్ని గారెల పిండిలో కలపండి చాలు
Vada: వడలు లేదా గారెలు క్రిస్పీగా వస్తేనే తినేందుకు బావుంటాయి. క్రిస్పీగా మినప వడలు ఎలా చేయాలో ఇక్కడ చూడండి. గారెల పిండిలో ఒక సీక్రెట్ పదార్థాన్ని కలిపితే చాలు అవి క్రిస్పీగా వస్తాయి. పైగా టేస్టీగా కూడా ఉంటాయి.

క్రిస్పీగా గారెలు చేయడం ఎలా?
మన వంటకాల్లో గారెలకు ప్రత్యేకమైన స్థానం ఉంది. వేడివేడి గారెలు తింటుంటే ఆ మజాయే వేరు. అయితే బయట కొనే గారెలకు, ఇంట్లో చేసే వాటికి చాలా తేడా ఉంటుంది. కొన్నిసార్లు ఇంట్లో చేసే వడలు క్రిస్పీగా రావు. మీరు పిండిలో ఒక పదార్థం కలిపితే వడల టేస్ట్, క్రిస్పీనెస్ అదిరిపోతాయి. మీరు పిండిని కరెక్ట్‌గా రెడీ చేసుకుంటే హోటల్ స్టైల్‌లో గారెలు ఈజీగా చేసుకోవచ్చు.
గారెల తయారీకి కావాల్సిన పదార్థాలు
మినపప్పు: 2 కప్పులు (8 గంటలు నానబెట్టాలి)
బియ్యం పిండి: 2 స్పూన్లు
పచ్చిమిర్చి: 2
కొత్తిమీర: కొద్దిగా
అల్లం: దంచిన లేదా తురిమిన ముక్క
కరివేపాకు: 1 రెమ్మ
మిరియాలు: 5-10 (దంచినవి)
ఉప్పు: తగినంత
నీళ్లు: తగినన్ని
గారెల ఇలా చేయండి
- నానబెట్టిన మినపప్పును మిక్సీ జార్‌లో వేసి మెత్తగా రుబ్బుకోండి. రుబ్బేటప్పుడు అవసరమైతేనే కొద్దిగా నీళ్లు పోయండి.
- ఈ పిండిని ఒక పెద్ద గిన్నెలోకి తీసుకోండి. ఇందులో సన్నగా తరిగిన పచ్చిమిర్చి, కొత్తిమీర, అల్లం, కరివేపాకు వేసి బాగా కలపండి.
- వడలు క్రిస్పీగా రావడానికి ఇందులో రెండు స్పూన్ల బియ్యం పిండి. బయట అమ్మేవారు కూడా ఇలాగే చేస్తారు. క్రిస్పీ గారెల వెనుకున్న సీక్రెట్ ఇదే.
4. ఇప్పుడు దంచిన మిరియాలు, తగినంత ఉప్పు వేసి అంతా బాగా మిక్స్ చేయండి. ఈ పిండిని కనీసం 10 నిమిషాల పాటు చేత్తో బాగా గిలక్కొట్టాలి.
5. ఇలా చేయడం వల్ల పిండిలోకి గాలి చేరి, వడలు బాగా ఉబ్బుతాయి. ఒక గిన్నెలో నీళ్లు పెట్టుకోండి. రెండు చేతులకు కొద్దిగా నీళ్లు రాసుకోండి.
6. కొద్దిగా పిండిని తీసుకుని ముద్దలా చేసి, బొటనవేలితో మధ్యలో చిల్లు పెట్టి కాగుతున్న నూనెలో వేసి వేయించండి.
7. గారెలు గోల్డెన్ బ్రౌన్ రంగులోకి మారాక తీసి టిష్యూ పేపర్ మీద వేయండి. అంతే క్రిస్పీ గారెలు సిద్ధమైనట్టే.

