MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Feature
  • మనదేశంలో మద్యం చవకగా దొరికే ప్రాంతం అదే.. రూ.100కే లగ్జరీ బాటిల్స్

మనదేశంలో మద్యం చవకగా దొరికే ప్రాంతం అదే.. రూ.100కే లగ్జరీ బాటిల్స్

మనదేశంలో మద్యప్రియులు ఎక్కువే. అయితే భారతదేశంలో ఆల్కహాల్ చవకగా దొరికేది ఎక్కడ? ఏ ప్రాంతంలో మద్యం అతి ఖరీదు.. అనే విషయాలు ఇక్కడ ఇచ్చాము. ఈ ఆసక్తికరమైన అంశాలను తెలుసుకోండి.

2 Min read
Author : Haritha Chappa
Published : Oct 06 2026, 04:52 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
13
ఏ రాష్ట్రంలో మద్యం చవక?
Image Credit : Gemini AI

ఏ రాష్ట్రంలో మద్యం చవక?

భారతదేశంలో మద్యప్రియులు అధికంగా ఉంటారు. మద్యం మీద వచ్చే రెవెన్యూతోనే ప్రభుత్వ ఖజానా కూడా నిండుతుంది. అయితే మనదేశంలో ఎక్కడ మద్యం చాలా చీప్? మీరు ఊహించలేని ప్రాంతంలో మద్యం చాలా తక్కువ ధరకు లభిస్తుంది. ఒకే బ్రాండ్‌కు చెందిన మద్యం బాటిల్ కొనుగోలు చేసినా, రాష్ట్రం మారితే దాని ధర ఊహించని రీతిలో మారిపోతుంది. దేశంలో మద్యం అత్యంత తక్కువ ధరకు లభించే ప్రాంతంగా గోవా. ఇక మద్యం ఖరీదు అధికంగా ఉండేది కర్ణాటక. గోవాలో కేవలం రూ. 100 ల నుంచే మంచి బ్రాండ్ మద్యం దొరుకుతుంది. అదే మద్యం బాటిల్ దేశ రాజధాని ఢిల్లీలో రూ. 134 ఉంటే, కర్ణాటకలో ఏకంగా రూ. 513 దాకా చేరుకుంటుంది. సాధారణ బడ్జెట్ బ్రాండ్ల పరిస్థితి ఇలా ఉంటే, ప్రీమియం, లగ్జరీ స్కాచ్ బ్రాండ్ల విషయానికి వచ్చేసరికి రాష్ట్రాల మధ్య వ్యత్యాసం పది వేల నుంచి పన్నెండు వేల రూపాయల వరకు ఉంటోంది.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
23
గోవాలో ఎందుకు చీప్?
Image Credit : Pixabay

గోవాలో ఎందుకు చీప్?

ఒక్కో రాష్ట్రంలో మద్యం ధరల్లో ఇంత తేడాలు రావడానికి ప్రధాన కారణం మద్యం జీఎస్టీ పరిధిలో లేకపోవడమే. దేశవ్యాప్తంగా దాదాపు అన్ని వస్తువులపై ఒకే పన్ను విధానం అమలవుతున్నప్పటికీ, ఆల్కహాల్‌ను జీఎస్టీ నుంచి మినహాయించారు. దాంతో మద్యంపై ఎక్సైజ్ సుంకాలు, ఇతర పన్నులను నిర్ణయించే పూర్తి అధికారం ఆయా రాష్ట్ర ప్రభుత్వాల చేతుల్లోనే ఉండిపోయింది. పర్యాటక రంగాన్ని భారీగా ప్రోత్సహించే గోవాలో ఎక్సైజ్ డ్యూటీ సుమారు 49 శాతంగా ఉంటే, కర్ణాటకలో ఇది ఏకంగా 83 శాతానికి పైగా వసూలవుతోంది. పన్నుల్లో ఉన్న ఈ భారీ వ్యత్యాసం నేరుగా మద్యం బాటిల్ రిటైల్ ధరపై ప్రభావం చూపుతోంది.

33
ఏ రాష్ట్రాల్లో ఖరీదు?
Image Credit : Pixabay

ఏ రాష్ట్రాల్లో ఖరీదు?

కర్ణాటకతో పాటు మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్, రాజస్థాన్ రాష్ట్రాల్లో కూడా మద్యంపై భారీగా పన్నులు వసూలు చేస్తున్నారు. కర్ణాటక ప్రభుత్వం ఆల్కహాల్ పరిమాణం ఆధారంగా కొత్త పన్ను విధానాన్ని తేవడంతో కొన్ని సాధారణ బ్రాండ్ల ధరలు మరింత పెరిగాయి. మరోవైపు హర్యానా, ఢిల్లీ ప్రభుత్వాలు పన్నులను కాస్త అందుబాటులోనే ఉంచడంతో అక్కడ ధరలు ఇతర రాష్ట్రాల కంటే తక్కువగా ఉంటాయి. ఫలితంగా దేశంలో మద్యం ధరలకు సంబంధించి ఒకే రేటు ఉండదు. ఇది పూర్తిగా రాష్ట్రాల ఎక్సైజ్ నిబంధనల మీదే ఆధారపడి నడుస్తోంది.

About the Author

HC
Haritha Chappa
హరిత ఏసియా నెట్‌లో చీఫ్ సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. జర్నలిజంలో పీజీ పూర్తి చేశారు. ఈనాడు, సమయం, ఆంధ్రజ్యోతి, ఏబీపీ నెట్ వర్క్, హిందూస్థాన్ టైమ్స్ లో పనిచేశారు. ప్రింట్, డిజిటర్ మీడియాలో 18 ఏళ్ల అనుభవం ఉంది. ఏసియా నెట్ లైఫ్ స్టైల్, బిజినెస్, ఓటీటీ మూవీ కంటెంట్, ఆస్ట్రాలజీ కంటెంట్ రాస్తారు.
భారత దేశం
 

Latest Videos
Recommended Stories
Recommended image1
పాములు చ‌ర్మాన్ని ఎందుకు విడుస్తాయి.? ఆ స‌మ‌యంలో మ‌రింత ప్ర‌మాద‌క‌రంగా మారుతాయా?
Recommended image2
మార్బుల్, గ్రానైట్, టైల్స్.. కొత్త ఇంటి ప్లోరింగ్ కు ఏది బెస్ట్? నిర్మాణరంగ నిపుణుల సలహాలు ఇవే!
Recommended image3
India's Paris: మన దేశంలో ఏ నగరాన్ని ‘పారిస్ ఆఫ్ ఇండియా’ అని పిలుస్తారో తెలుసా?
Related Stories
Recommended image1
First Bank: మనదేశంలో మొట్టమొదటి బ్యాంక్ ఏది? ఇప్పటికీ అది పనిచేస్తోందా?
Recommended image2
గోధుమ పిండి, శెనగ పిండి, బియ్యం పిండి డబ్బాల్లో ఈ పదార్థం వేస్తే పురుగులే పట్టవు
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved