Tips and Tricks: పొరపాటున కూడా ఇవి మంచం కింద పెట్టకూడదు.. ఎందుకో తెలుసా?
Tips and Tricks: ఇల్లు శుభ్రంగా ఉండడం అంటే కేవలం పైకి కనిపించే ప్రదేశాలను శుభ్రం చేయడం కాదు. కనిపించని ప్రదేశాలను కూడా ఎప్పటికప్పుడు శుభ్రం చేసుకోవాలి. అప్పుడే.. ఆరోగ్యంగా ఉండగలం,

Life Hacks
ఈ రోజుల్లో ఎంత పెద్ద ఇల్లు ఉన్నా... సామాన్లు సర్దుకోవడానికి ప్లేస్ లేదని ఫీలయ్యే వారు చాలా మంది ఉన్నారు. ఇంట్లో ప్రతి మూలలోనూ కబోర్డ్ చేయించి... బయట ఏమీ కనిపించకుండా.. అన్నీ అందులో పెట్టేస్తున్నారు. దీనిలో భాగంగానే చాలా మంది... మంచం కింద కూడా చాలా రకాల వస్తువులను స్టోర్ చేస్తున్నారు. కానీ, ఈ అలవాటు కొన్నిసార్లు ఆరోగ్యానికీ, మనశ్శాంతికి కూడా హానికరం అవుతుందని మీకు తెలుసా? అసలు.. మంచం కింద ఎలాంటి వస్తువులు పెట్టకూడదో తెలుసా? పెట్టడం వల్ల కలిగే నష్టాలేంటో చూద్దాం...
ఆహార పదార్థాలు ఉంచకండి...
చాలామందికి రాత్రిపూట ఆకలి వేసినప్పుడు తినడానికి ఏదైనా స్నాక్‌ను మంచం కింద ఉంచే అలవాటు ఉంటుంది. ఇది తాత్కాలికంగా సౌకర్యంగా అనిపించినా, దీని వల్ల చాలా సమస్యలు వచ్చే అవకాశం ఉంది. ఫుడ్ వాసనకు చీమలు, దోమలు, ఎలుకలు, కీటకాలు వంటివి గదిలోకి వస్తాయి. దీని వల్ల వైరస్, బ్యాక్టీరియా అక్కడ పెరిగే అవకాశం ఉంది. అందుకే.. ఇలాంటి పొరపాటు చేయకూడదు. ఆహార పదార్థాలను కిచెన్ లో.. అది కూడా శుభ్రమైన కంటైనర్ లో స్టోర్ చేయాలి.
విద్యుత్ ఉపకరణాలకు దూరంగా ఉండాలి...
మంచం కింద కరెంట్ కి సంబంధించిన వస్తువులు, హీటర్లు, ఐరన్ బాక్స్‌లు లేదా ఇతర ఎలక్ట్రానిక్ వస్తువులు ఉంచడం చాలా ప్రమాదకరం. ఎందుకంటే, దూళి పేరుకుపోవడం వల్ల వైర్లు వేడెక్కి స్పార్క్స్ ఏర్పడి మంటలకు దారితీయవచ్చు. అంతేకాదు, తేమ ఉన్న ప్రాంతాల్లో విద్యుత్ కి సంబంధించిన వస్తువులను ఉంచడం షార్ట్ సర్క్యూట్ ప్రమాదాన్ని పెంచుతుంది. అందువల్ల, వీటిని మంచం కింద ఎప్పుడూ ఉంచకండి.
ఆయుధాలు, పదునైన వస్తువులు
కొంతమంది స్వీయ రక్షణ కోసం ఆయుధాలు లేదా పదునైన వస్తువులను మంచం కింద దాచుకుంటారు. కానీ ఇది చాలా ప్రమాదకర అలవాటు. ముఖ్యంగా పిల్లలు ఉన్న ఇళ్లలో, ఈ వస్తువులు ఉంచడం మంచిది కాదు. వీటిని ఎల్లప్పుడూ తాళం వేసిన క్యాబినెట్‌లో లేదా పిల్లలకు అందని ప్రదేశంలో ఉంచాలి.
చెప్పులు, పాత దుస్తులు..
మంచం కింద బూట్లు లేదా పాత దుస్తులు ఉంచే అలవాటు చాలా మందికి ఉంటుంది. కానీ ఇవి దుర్వాసన, ధూళి , సూక్ష్మక్రిములు పెరగడానికి కారణం అవుతాయి. భవిష్యత్తులో అలర్జీ సమస్య కూడా రావచ్చు. అందుకే.. ఇలాంటి వాటిని మంచం కింద ఉంచకూడదు.
పనికి రాని వస్తువులు...
పనికి రాని వస్తువులను కూడా మంచం కింద ఉంచకూడదు. వాస్తు ప్రకారం.. ఇది అంత మంచి అలవాటు కాదు. దీని వల్ల నిద్రకు ఆటంకం ఏర్పడే అవకాశం ఉంది. మానసిక సమస్యలు కూడా రావచ్చు. కాబట్టి... ఎప్పుడూ మంచం కింద భాగాన్ని శుభ్రంగా ఉంచాలి.