Tips and Tricks: డోర్‌మ్యాట్‌లు జారకుండా ఉండాలంటే ఈ టిప్స్ ఫాలో అయితే చాలు!
ప్రతి ఒక్కరి ఇంట్లో డోర్‌మ్యాట్ లు వాడుతుంటారు. అయితే వర్షాకాలంలో తేమ ఎక్కువగా ఉండటం వల్ల ఇవి జారుతుంటాయి. దానివల్ల చాలా ఇబ్బందిపడాల్సి వస్తుంది. మరి డోర్ మ్యాట్ లు జారకుండా ఎలాంటి చిట్కాలు పాటించాలో ఇక్కడ చూద్దాం.

డోర్ మ్యాట్ లు జారకుండా ఏం చేయాలి?
వర్షాకాలంలో డోర్‌మ్యాట్ ఎంత అవసరమో.. అంతకంటే ఎక్కువే సమస్యలను తెస్తుంది. మనం సాధారణంగా డోర్ మ్యాట్ ను పాదాలు తుడుచుకోవడానికి వాడుతుంటాం. కానీ వర్షాకాలంలో ఎక్కువ తడిగా ఉండటం వల్ల డోర్ మ్యాట్ జారుతుంది. దానివల్ల కిందపడటం, దెబ్బలు తగలడం వంటివి జరుగుతుంటాయి. మరి డోర్‌మ్యాట్ జారకుండా ఉండాలంటే ఏం చేయాలో ఇక్కడ చూద్దాం.
డోర్ మ్యాట్ ను సరిగ్గా వేయాలి..
వర్షాకాలంలో ఇంటి బయట ఉంచే డోర్‌మ్యాట్ ఏ సమస్యలను కలిగిస్తుందో అనుభవించిన వారికే తెలుసు. క్రమంగా నీరు చేరి తడిగా మారడం వల్ల చాలామంది జారిపడుతుంటారు. కాబట్టి డోర్‌మ్యాట్‌ను సరిగ్గా ఉంచడం లేదా అమర్చడం ముఖ్యం.
slip resistant mats
డోర్‌మ్యాట్ జారకుండా ఉండడానికి ఇది చాలా ప్రభావవంతమైన మార్గం. మార్కెట్లో స్లిప్ రెసిస్టెంట్ మ్యాట్ లేదా ప్యాడ్ సులభంగా లభిస్తుంది. వీటిని కార్పెట్‌లు లేదా డోర్‌మ్యాట్‌ల కింద ఉంచడానికి ప్రత్యేకంగా తయారు చేస్తారు. డోర్‌మ్యాట్ పరిమాణానికి అనుగుణంగా దాన్ని కత్తిరించి కింద ఉంచండి.
డబుల్ సైడెడ్ టేప్
డబుల్ సైడెడ్ టేప్ తాత్కాలిక పరిష్కారం. కానీ మంచి నాణ్యత కలిగిన డబుల్ సైడెడ్ టేప్ తీసుకొని.. దాన్ని కట్ చేసి డోర్‌మ్యాట్ కింది భాగంలోని నాలుగు మూలల్లో, మధ్యలో అతికించండి. ఇప్పుడు డోర్‌మ్యాట్‌ను నేలకు అతికిస్తే సరిపోతుంది.
బరువైన డోర్ మ్యాట్
డోర్‌మ్యాట్ బరువుగా ఉంటే జారడాన్ని నివారించవచ్చు. కొంచెం బరువుగా ఉండి.. కింది భాగం రబ్బరు లేదా ఏదైనా జారని పదార్థంతో తయారు చేసిన డోర్‌మ్యాట్‌ను ఎంచుకోండి. కొబ్బరి పీచుతో తయారు చేసిన మందపాటి డోర్‌మ్యాట్‌లు మంచి ఎంపిక.
రబ్బరు మ్యాట్..
ఇంట్లో ఉన్న పాత వస్తువులను ఉపయోగించి కూడా డోర్‌మ్యాట్ జారకుండా చూసుకోవచ్చు. ఇంట్లో పాత రబ్బరు మ్యాట్, యోగా మ్యాట్ లేదా మందపాటి రబ్బరు షీట్ ఉంటే.. దాన్ని మీ డోర్‌మ్యాట్ పరిమాణానికి కత్తిరించండి. దాన్ని డోర్‌మ్యాట్ కింద వేయండి.
సిలికాన్ కాల్క్
సిలికాన్ కాల్క్ సాయంతో డోర్‌మ్యాట్‌ను చాలా కాలం పాటు ఒకే చోట ఉంచవచ్చు. కానీ దాన్ని తీసేటప్పుడు కొంచెం ఎక్కువ పని ఉంటుంది. డోర్‌మ్యాట్ కింది భాగానికి సిలికాన్ కాల్క్ తో సన్నని పొరను వేసి ఆరనివ్వాలి. ఇది డోర్‌మ్యాట్ జారడాన్ని నిరోధిస్తుంది.