ఈ ఆహారాలతో ఎంతటి పొట్టైనా ఇట్టే కరిగిపోవాల్సిందే..!
బెల్లీ ఫ్యాట్ హైపర్ టెన్షన్, టైప్ 2 డయాబెటీస్, అధిక కొలెస్ట్రాల్, గుండె జబ్బులు, అంగస్తంభన వంటి ఎన్నో ప్రమాదకరమైన రోగాలొచ్చే అవకాశం పెరుగుతుంది.
ఎంతటి కష్టతరమైన డైట్ పాటించినా.. ఎన్ని వ్యాయామాలు చేసినా.. పొట్ట తగ్గడం లేదని బాధపడేవారు చాలా మందే ఉన్నారు. ఏదేమైనా కానీ కడుపులో అధికంగా పేరుకుపోయిన కొవ్వు వివిధ ఆరోగ్య సమస్యలకు కారణమవుతుంది. అయితే ఆహారంలో కొన్నింటిని చేర్చుకోవడం వల్ల బెల్లీఫ్యాట్ ను తగ్గించుకోవచ్చని నిపుణులు చెబుతున్నారు.
belly fat
పొట్ట కొవ్వు వల్ల గుండె జబ్బులు, టైప్ 2 డయాబెటిస్,అధిక కొలెస్ట్రాల్, హైపర్ టెన్షన్, అంగస్తంభన లోపం, కొవ్వు కాలేయ వ్యాధి వంటి మరణాలతో సహా వివిధ రకాల ఆరోగ్య సమస్యల ప్రమాదం పెరుగుతుంది.
తక్కువ నిద్రకు బరువు పెరగానికి బరువు పెరగడానికి సంబంధం ఉందని వివిధ అధ్యయనాలు తేల్చి చెప్పాయి. ఎందుకంటే నిద్ర లేమి వల్ల కేలరీలను ఎక్కువమొత్తంలో తీసుకుంటారు. దీనివల్ల కడుపులోపల కొవ్వు ఎక్కువ మొత్తంలో పేరుకుపోతుంది. ఇది క్రమంగా ఎన్నో ప్రమాదకరమైన జబ్బులకు దారితీస్తుంది. అయితే కొన్ని రకాల ఆహారాలు బెల్లీ ఫ్యాట్ ను తగ్గించేందుకు సహాయపడతాయి. అవేంటో తెలుసుకుందాం పదండి.
గ్రీన్ టీ
టీ, కాఫీలతో పోల్చితే గ్రీన్ టీనే మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. దీనిలో తక్కువ మొత్తంలో కెఫిన్, ఎక్కువ మొత్తంలో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. అందుకే దీన్ని ఆరోగ్యవంతమైన పానీయం అంటారు. దీన్ని తాగడం వల్ల జీర్ణక్రియ ప్రక్రియను వేగవంతం అవుతుంది. కడుపుకు కొవ్వు పోరుకుపోవడాన్ని తగ్గిస్తుంది.
nuts
గింజలు
గింజల ద్వారా మన శరీరానికి కావాల్సిన ఎన్నో పోషకాలు అందుతాయి. వీటిలో విటమిన్ ఎ, విటమిన్ బి, విటమిన్ సి, విటమిన్ ఇ లు పుష్కలంగా ఉంటాయి. కొవ్వు ఎక్కువగా ఉండే ఆహారాలను బదులుగా పోషకాలు ఎక్కువగా ఉండే గింజలను తింటే బరువు తగ్గడంతో పాటుగా.. బెల్లీ ఫ్యాట్ కూడా సులువుగా తగ్గిపోతుంది.
turmeric
పసుపు
పసుపులో ఎన్నో ఔషదగుణాలుంటాయి. వీటిలో యాంటీ ఆక్సిడెంట్లతో పాటుగా కర్కుమిన్ కూడా పుష్కలంగా ఉంటుంది. ఇవి కాలెయం నుంచి విషాన్ని బయటకు పంపుతుంది. అలాగే ఇవి ఎన్నో రకాల అనారోగ్య సమస్యలను తగ్గించండలో కూడా ఎఫెక్టీవ్ గా పనిచేస్తాయి. అంతేకాదు ఇవి పొట్టలో కొవ్వు పేరుకుపోకుండా చూస్తుంది.
అవకాడో
అవకాడోలో ఎమినో యాసిడ్ పుష్కలంగా ఉంటుంది. ప్రతిరోజూ కొన్ని ముక్కల అవకాడోలను తింటే ఆకలి తక్కువగా అవుతుంది. ఇది పొట్టకొవ్వును కరిగించడానికి సహాయపడుతుంది.
బాదం
ప్రతిరోజూ ఐదారు నానబెట్టిన బాదంపప్పులను తినడం వల్ల శరీరం ఆరోగ్యంగా ఉంటుంది. దీనిలో మెగ్నీషియం, ఆరోగ్యకరమైన కొవ్వులు పుష్కలంగా ఉంటాయి. ఇవి కండరాలను బలంగా ఉంచడంతో పాటుగా బెల్లీ ఫ్యాట్ ను కూడా ఫాస్ట్ గా తగ్గిస్తాయి. బాదం పప్పుల్లో ఆకలిని తగ్గించే ఫైబర్ ఎక్కువగా ఉంటుంది. కేలరీలు మాత్రం తక్కువగా ఉంటాయి. అయితే వీటిని రాత్రంతా నానబెట్టి ఉదయం దాని తొక్కలను తీసేసి తినాలి.