వీటిని తింటే మీరు అందంగా కనిపిస్తారు తెలుసా?
యాంటీ ఆక్సిడెంట్లు ఎక్కువగా ఉండే ఆహారాలు రక్తాన్ని శుద్ధి చేయడంతో పాటుగా శరీరంలో రక్త ప్రవాహాన్ని పెంచుతుంది. చర్మాన్ని అందంగా చేస్తుంది.
అందమైన, ఆరోగ్యకరమైన, మెరిసే చర్మం కావాలని ప్రతి ఒక్కరూ ఆశపడతారు. ఇందుకోసం రకరకాల ఖరీదైన కాస్మొటిక్స్ ను ఉపయోగించేవారు కూడా ఉన్నారు. నిజానికి కెమికల్స్ ఉండే బ్యూటీ ప్రొడక్ట్స్ చర్మానికి అస్సలు మంచివి కావు. వీటివల్ల మొటిమలతో పాటుగా ఎన్నో చర్మ సమస్యలు వస్తాయి. నిపుణుల ప్రకారం.. కొన్ని రకాల ఆహారాలను తింటే ఎలాంటి బ్యూటీ ప్రొడక్ట్స్ వాడకున్నా అందంగా కనిపిస్తారు. చర్మ సమస్యలు కూడా పోతాయి. అయితే కొవ్వు, వేయించిన ఆహారాలను తినకూడదు. అలాగే శీతల పానీయాలను రోజూ తాగకూడదు. ఎందుకంటే ఇవి చర్మ సమస్యలకు దారితీస్తాయి. చర్మం ఆరోగ్యంగా ఉండేందుకు ఎలాంటి ఆహారాలను తినాలో ఇప్పుడు తెలుసుకుందాం..
![article_image2](https://static-ai.asianetnews.com/images/ce6a1193-acf2-4b9d-9944-0f5a31ce6f63/image_300x236xt.jpg)
బీట్ రూట్
బీట్ రూట్ లో యాంటీ ఆక్సిడెంట్స్ పుష్కలంగా ఉంటాయి. పిగ్మెంటేషన్ తొలగించడానికి ఈ బీట్ రూట్ సహాయపడుతుంది. ఇది రక్తాన్ని శుద్ధి చేయడంతో పాటగా శరీరంలో రక్త ప్రవాహాన్ని పెంచుతుంది. అలాగే చర్మానికి మెరుపును ఇస్తుంది. బీట్ రూట్ జ్యూస్ రక్తాన్ని శుద్ధి చేసి, టాక్సిన్స్ ను తొలగించి ముఖానికి గ్లో ను ఇస్తుంది.
curd
పెరుగు
పెరుగులో లాక్టిక్ యాసిడ్, జింక్, బి విటమిన్లు, యాంటీఆక్సిడెంట్లు ఎక్కువగా ఉంటాయి. పెరుగు చర్మ సమస్యలను తొలగించడంలో ఎఫెక్టీవ్ గా పనిచేస్తుంది. ప్రతిరోజూ పెరుగును తినడం వల్ల చర్మమే కాదు మీ మొత్తం శరీరం ఆరోగ్యంగా ఉంటుంది.
పసుపు పాలు
పసుపు పాలు ఎన్నో ఆరోగ్య సమస్యలకు దీర్ఘకాలిక సాంప్రదాయ నివారిణి. పసుపు పాలు చర్మాన్ని శుభ్రపరుస్తాయి. అలాగే చర్మానికి సహజ కాంతిని ఇస్తాయి. ఇది చర్మాన్ని మెరుగుపరుస్తుంది. సిన్క్ ట్యాన్ కూడా తొలగిస్తుంది.
బచ్చలికూర
మినరల్స్, విటమిన్స్ పుష్కలంగా ఉండే బచ్చలికూర మన చర్మంపై మచ్చలను తగ్గించడానికి బాగా సహాయపడుతుంది. బచ్చలికూరలోని యాంటీఆక్సిడెంట్లు వృద్ధాప్య లక్షణాలను నెమ్మదింపజేస్తాయి. అలాగే చర్మాన్ని ప్రకాశవంతం చేయడానికి సహాయపడతాయి.
నిమ్మకాయ
నిమ్మకాయలో విటమిన్ సి, విటమిన్ బి, ఫాస్పరస్ లు పుష్కలంగా ఉంటాయి. దీన్ని ప్రతిరోజూ తీసుకుంటే మీ చర్మం అందంగా మెరిసిపోతుంది. నిమ్మకాయలోని సహజ ఆమ్లాలు చనిపోయిన చర్మ కణాలను తొలగిస్తాయి. వయస్సు రీత్యా వచ్చిన మచ్చలను తగ్గిస్తాయి.
Image: Getty Images
దానిమ్మ
దానిమ్మ పండ్లను తింటే హిమోగ్లోబిన్ స్థాయిలు పెరగడంతో పాటుగా మరెన్నో ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయి. ఇది సూర్యరశ్మి వల్ల కలిగే చర్మ సమస్యలను, చర్మ నష్టాన్ని నివారించడానికి సహాయపడుతుంది.