MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Life
  • Kitchen Hacks: కిచెన్ లో ఈ 3 వస్తువులు ఉంటే క్యాన్సర్ వచ్చే ప్రమాదం ఎక్కువ.. వెంటనే పడేయడం మంచిది!

Kitchen Hacks: కిచెన్ లో ఈ 3 వస్తువులు ఉంటే క్యాన్సర్ వచ్చే ప్రమాదం ఎక్కువ.. వెంటనే పడేయడం మంచిది!

Kitchen Hacks: వంటగదిలో చాలా రకాల వస్తువులను వాడుతుంటాం. కొన్ని వస్తువులు మనకు తెలియకుండానే ఆరోగ్యానికి ప్రమాదంగా మారే అవకాశం ఉందని చెబుతున్నారు నిపుణులు. ఆ వస్తువులు ఏవి? వాటి వల్ల కలిగే నష్టాలేంటి? వాటి బదులు ఏం వాడాలో ఇక్కడ వివరంగా తెలుసుకుందాం. 

2 Min read
Author : Kavitha G
Published : May 20 2026, 04:46 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
కిచెన్ లో వాడకూడని వస్తువులు
Image Credit : Gemini AI

కిచెన్ లో వాడకూడని వస్తువులు

వంటగది మన ఆరోగ్యానికి మూలం. కాబట్టి వంటగదిలో ఉపయోగించే వస్తువుల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. ముఖ్యంగా కొన్ని వస్తువులు ఎక్కువకాలం వాడితే ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావం చూపే అవకాశముందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. అవేంటో తెలుసుకుందాం.

Add Asianetnews Telugu as a Preferred SourcegooglePreferred
25
ప్లాస్టిక్ చాపింగ్ బోర్డు
Image Credit : Getty

ప్లాస్టిక్ చాపింగ్ బోర్డు

చాలామంది కూరగాయలు, మాంసం, పండ్లు కోయడానికి ప్లాస్టిక్ చాపింగ్ బోర్డులను వాడుతుంటారు. ఇవి తక్కువ ధరలో లభించడం, తేలికగా ఉండటం వల్ల ఎక్కువగా ఉపయోగిస్తుంటారు. అయితే పదేపదే కత్తితో కోయడం వల్ల వాటిపై చిన్న చిన్న గీతలు ఏర్పడతాయి. ఆ గీతల్లో బ్యాక్టీరియా చేరే అవకాశం ఉంటుంది. అంతేకాదు, ప్లాస్టిక్ కణాలు ఆహారంలో కలిసే ప్రమాదం కూడా ఉంటుంది. ఈ మైక్రోప్లాస్టిక్ కణాలు శరీరంలోకి వెళ్లి దీర్ఘకాలంలో ఆరోగ్య సమస్యలకు కారణమవుతాయి. కాబట్టి వాటికి బదులు చెక్కతో తయారుచేసిన చాపింగ్ బోర్డులు ఉపయోగించడం మంచిది.

Related Articles

Related image1
Best Night Foods: రాత్రి భోజనానికి బెస్ట్ ఫుడ్స్.. మంచి నిద్ర, ఫిట్‌నెస్ కోసం హెల్తీ ఛాయిస్!
Related image2
Curd: ప్యాకెట్ పెరుగు vs ఇంటి పెరుగు.. రెండింటిలో ఆరోగ్యానికి ఏది మంచిది?
35
ప్లాస్టిక్ గరిటెలు
Image Credit : chat gpt

ప్లాస్టిక్ గరిటెలు

వేడి కూరల్లో లేదా నూనెలో ప్లాస్టిక్ గరిటెలను ఉపయోగిస్తే వాటిలోని రసాయనాలు ఆహారంలో కలిసే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా నాసిరకం ప్లాస్టిక్ వస్తువులు అధిక ఉష్ణోగ్రతల వద్ద బిస్ఫెనాల్-A (BPA) వంటి హానికర పదార్థాలను విడుదల చేస్తాయి. ఈ రసాయనాలు హార్మోన్ల సమతుల్యాన్ని ప్రభావితం చేసే అవకాశం ఉంది. వీటికి బదులు చెక్క, స్టీల్ లేదా సిలికాన్‌తో తయారైన మంచి నాణ్యత కలిగిన గరిటెలను ఉపయోగించడం మంచిది.

45
నాన్ స్టిక్ కుక్‌వేర్
Image Credit : AI Generated

నాన్ స్టిక్ కుక్‌వేర్

నాన్ స్టిక్ పాత్రల్లో వంట చేయడం సౌకర్యంగా ఉంటుంది. తక్కువ నూనెతో వంట చేసుకోవచ్చు కాబట్టి చాలా మంది వీటిని ఇష్టపడతారు. కానీ ఈ పాత్రలపై ఉన్న పూత పోయే కొద్దీ పూతలోని సూక్ష్మ కణాలు ఆహారంలో కలిసే అవకాశం ఉందని పరిశోధనలు సూచిస్తున్నాయి. ముఖ్యంగా అధిక వేడి వద్ద వాడితే కొన్ని హానికర వాయువులు విడుదల కావచ్చట. అందుకే గీతలు పడిన నాన్ స్టిక్ పాత్రలను వెంటనే మార్చేయాలని నిపుణులు సూచిస్తున్నారు.

55
ఈ జాగ్రత్తలు ముఖ్యం
Image Credit : Gemini AI

ఈ జాగ్రత్తలు ముఖ్యం

నిపుణుల ప్రకారం ఆరోగ్యకరమైన జీవనశైలికి కేవలం మంచి ఆహారం తినడం మాత్రమే కాదు, ఆహారం తయారుచేసే పాత్రలు, వంట సామగ్రి కూడా కీలక పాత్ర పోషిస్తాయి. వంటగదిలో ఉపయోగించే వస్తువులను తరచుగా పరిశీలించి, పాడైపోయినవి లేదా గీతలు పడ్డవి వెంటనే మార్చేయడం మంచిది. ముఖ్యంగా ప్లాస్టిక్ వస్తువులను అధిక వేడికి దూరంగా ఉంచాలని నిపుణులు సూచిస్తున్నారు.

About the Author

KG
Kavitha G
8 సంవత్సరాలుగా జర్నలిజంలో ఉన్నారు. 2016లో ఈటీవీతో కెరీర్ ప్రారంభించారు. ప్రస్తుతం ఏసియానెట్‌లో ఫ్రీలాన్స్ జర్నలిస్ట్‌గా పని చేస్తున్నారు.
జీవనశైలి
ఆరోగ్యం
ఏషియానెట్ న్యూస్

Latest Videos
Recommended Stories
Recommended image1
Sleep Tips : రాత్రిళ్లు నిద్రలేక ఇబ్బంది పడుతున్నారా? చిటికెలో గాఢనిద్రలోకి జారుకునే సింపుల్ టిప్స్
Recommended image2
BlackBeads: మెడ నిండుగా కనిపించే పంజాబీ మంగళసూత్రాలు.. ఓ లుక్కేయండి
Recommended image3
Fashion Tips: లైట్ వెయిట్ శారీస్.. వేసవిలో స్టైల్‌తో పాటు కూల్ లుక్!
Related Stories
Recommended image1
Best Night Foods: రాత్రి భోజనానికి బెస్ట్ ఫుడ్స్.. మంచి నిద్ర, ఫిట్‌నెస్ కోసం హెల్తీ ఛాయిస్!
Recommended image2
Curd: ప్యాకెట్ పెరుగు vs ఇంటి పెరుగు.. రెండింటిలో ఆరోగ్యానికి ఏది మంచిది?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved