Telugu

లైట్ వెయిట్ శారీస్.. వేసవిలో స్టైల్‌తో పాటు కూల్ లుక్!

Telugu

లెమన్ గ్రీన్ లెనిన్ చీర

లెట్ వెయిట్ చీరల్లో లెనిన్ చీరలు బెస్ట్ ఆప్షన్. ఈ చీరలు చెమటను త్వరగా పీల్చుకుంటాయి. రాయల్ లుక్ ఇస్తాయి. ఆఫీస్, డైలీ వేర్ నుంచి ప్రయాణాల వరకు.. అన్నింటికీ సౌకర్యంగా ఉంటాయి.

Image credits: pinterest
Telugu

పింక్ కలర్ ఎంబ్రాయిడరీ చీర

ఆర్గంజా ఫ్యాబ్రిక్ చాలా తేలికగా, ట్రాన్స్‌పరెంట్‌గా ఉంటుంది. ఇది కట్టుకుంటే చాలా హాయిగా, సౌకర్యంగా అనిపిస్తుంది. ఎంబ్రాయిడరీ వర్క్ తో ఉన్న ఇలాంటి చీర ఫంక్షన్లకు బెస్ట్ ఆప్షన్.

Image credits: Pinterest
Telugu

బ్లాక్ అండ్ వైట్ చీర

వేసవిలో కాంట్రాస్ట్ బ్లౌజ్‌తో చందేరీ చీరలు కూడా ట్రై చేయొచ్చు. ఈ చీరలు కాటన్, సిల్క్ మిక్స్డ్ టెక్స్‌చర్‌తో వస్తాయి. చూడటానికి చాలా అందంగా కనిపిస్తాయి.

Image credits: Instagram
Telugu

ఫ్లోరల్ ప్రింట్ షిఫాన్ చీర

షిఫాన్ ఫ్యాబ్రిక్ చాలా పల్చగా, గాలి ఆడేలా ఉంటుంది. వేసవిలో ఇలాంటి చీరలు చాలా రిలీఫ్ ఇస్తాయి. వీటిని చిన్న చిన్న ఫంక్షన్లకు కట్టుకుని వెళ్లవచ్చు.

Image credits: houseofchiffon_ Instagram
Telugu

కాటన్ చీర

కాటన్ చీరలు వేసవిలో చాలా కంఫర్ట్ గా ఉంటాయి. ఇలాంటి మల్టీ కలర్ చీరలు మీకు ప్రత్యేకమైన లుక్ ని ఇస్తాయి. ఎల్బో స్లీవ్స్ బ్లౌజుతో మరింత అందంగా కనిపిస్తారు. 

Image credits: pinterest
Telugu

లైట్ వెయిట్ జార్జెట్ చీర

ప్లెయిన్ జార్జెట్ చీరలు చాలా తేలికగా ఉంటాయి. వేసవిలో కట్టుకోవడానికి ఇవి పర్ఫెక్ట్‌గా ఉంటాయి. మీరు మల్టీకలర్ లేదా షేడెడ్ జార్జెట్ చీరలను ఎంచుకోవచ్చు.

Image credits: pinterest

Blouse Designs: తక్కువ ధరలో వచ్చే ప్రింటెడ్ బ్లౌజులు.. ఎంత బాగున్నాయో!

Chicken:కేజీ చికెన్ కూరలో ఎంత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయాలి?

Sandal Anklets: అమ్మాయిల చెప్పులకు జతగా పట్టీలు.. అందమైన పాదాల కోసం

Vastu Tips For Wealth: ఇంట్లో డబ్బులకు లోటు రావద్దంటే ఈ 5 చేస్తే చాలు!