MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Life
  • Sleep Tips : రాత్రిళ్లు నిద్రలేక ఇబ్బంది పడుతున్నారా? చిటికెలో గాఢనిద్రలోకి జారుకునే సింపుల్ టిప్స్

Sleep Tips : రాత్రిళ్లు నిద్రలేక ఇబ్బంది పడుతున్నారా? చిటికెలో గాఢనిద్రలోకి జారుకునే సింపుల్ టిప్స్

పగలంతా ఆవలింతలు, కళ్లు మూతలు పడతాయి. కానీ రాత్రి పడుకుందామంటే నిద్ర మాయం..! ఈ రోజుల్లో 10లో 8 మంది ఇదే సమస్యతో బాధపడుతున్నారు. మందులు లేకుండా, మొబైల్ చూడకుండా... సహజంగా, ప్రశాంతంగా నిద్రపోవడానికి 5 సూపర్ టిప్స్ ఇవిగో..!

2 Min read
Author : Arun Kumar P
Published : May 20 2026, 03:49 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
పక్కమీద నుంచి లేవండి..!
Image Credit : Getty

పక్కమీద నుంచి లేవండి..!

పక్క మీద పడుకొని 20 నిమిషాలు దాటినా నిద్ర పట్టట్లేదా..? బలవంతంగా కళ్లు మూసుకొని అక్కడే పడుకోవద్దు. అది మీలో ఆందోళనను మరింత పెంచుతుంది. వెంటనే బెడ్ మీద నుంచి లేచి వేరే గదిలోకి వెళ్లండి. డిమ్ లైట్‌లో ఏదైనా పుస్తకం చదవండి. నిద్ర వస్తున్నప్పుడు మాత్రమే మళ్లీ వచ్చి పడుకోండి.

Add Asianetnews Telugu as a Preferred SourcegooglePreferred
25
"నేను అస్సలు నిద్రపోను" అని మీకు మీరే చెప్పుకొండి
Image Credit : Getty

"నేను అస్సలు నిద్రపోను" అని మీకు మీరే చెప్పుకొండి

ఇదొక సైకలాజికల్ ట్రిక్. 'నాకు నిద్ర రావాలి, రావాలి' అని మీరు ఎంతగా అనుకుంటే మీ మెదడు అంత చురుగ్గా మేల్కొని ఉంటుంది. దానికి బదులుగా కళ్లు పెద్దవి చేసి 'నేను మరో 10 నిమిషాల పాటు అస్సలు నిద్రపోను, మేల్కొనే ఉంటాను' అని మీకు మీరే సవాల్ చేసుకోండి. దీంతో మీ మెదడు అలసిపోయి, మీకు తెలియకుండానే మిమ్మల్ని నిద్రపుచ్చుతుంది.

Related Articles

Related image1
Best Night Foods: రాత్రి భోజనానికి బెస్ట్ ఫుడ్స్.. మంచి నిద్ర, ఫిట్‌నెస్ కోసం హెల్తీ ఛాయిస్!
Related image2
Vastu Tips For Morning: ఉదయం నిద్ర లేవగానే అస్సలు చేయకూడని 5 పనులు ఇవే!
35
'4-7-8' బ్రీతింగ్ టెక్నిక్..
Image Credit : Getty

'4-7-8' బ్రీతింగ్ టెక్నిక్..

ఈ సింపుల్ టెక్నిక్‌తో 60 సెకన్లలో శరీరాన్ని రిలాక్స్ చేయండి. పడుకొని 4 సెకన్ల పాటు ముక్కుతో గాలి పీల్చండి. 7 సెకన్ల పాటు గాలిని లోపలే బిగపట్టండి. 8 సెకన్ల పాటు 'ఉష్' అనే శబ్దంతో నోటి ద్వారా నెమ్మదిగా గాలిని వదలండి. ఇలా 4 సార్లు చేస్తే చాలు, మీ గుండె కొట్టుకునే వేగం సాధారణ స్థితికి వస్తుంది, నరాలు శాంతించి నిద్ర పడుతుంది.

45
'నైలాన్' బట్టలకు నో చెప్పండి..!
Image Credit : Getty

'నైలాన్' బట్టలకు నో చెప్పండి..!

చాలా మంది నైలాన్ లేదా పాలిస్టర్ దుస్తులు వేసుకొని నిద్రపోతారు. ఇవి శరీరంలోని వేడిని బయటకు పోనివ్వకుండా చేసి, పక్కను వేడిగా మారుస్తాయి. దీనివల్ల శరీరానికి అసౌకర్యంగా ఉండి నిద్రకు భంగం కలుగుతుంది. నిద్రపోయేటప్పుడు 100% కాటన్ దుస్తులనే, అది కూడా వదులుగా ఉండే వాటిని ధరించండి. శరీరం చల్లగా ఉంటే మెదడు నిద్రకు అవసరమైన 'మెలటోనిన్' హార్మోన్‌ను దానంతట అదే విడుదల చేస్తుంది.

55
రేపటి ప్లాన్ రాసిపెట్టుకోండి..!
Image Credit : Getty

రేపటి ప్లాన్ రాసిపెట్టుకోండి..!

'రేపు ఆఫీసులో ఆ ఫైల్ ఇవ్వాలి, ఉదయాన్నే లేవాలి' వంటి ఆందోళనలే నిద్రను పాడు చేస్తాయి. పడుకునే ముందు ఒక డైరీ తీసుకొని, రేపు చేయాల్సిన పనులను, మీ ఆందోళనలను అందులో రాసేయండి. 'అన్నీ డైరీలో రాసేశాం కదా, రేపు చూసుకోవచ్చులే' అని మీ మెదడు కూడా ప్రశాంతంగా మారిపోతుంది.

About the Author

AK
Arun Kumar P
అరుణ్ కుమార్ పట్లోల : ఏడు సంవత్సరాలకు పైగా జర్నలిజంలో ఉన్నారు. ప్రస్తుతం ఏసియా నెట్ తెలుగులో సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. పొలిటికల్ తో పాటు ఎడ్యుకేషన్, కెరీర్, జాబ్స్, బిజినెస్, స్పోర్ట్స్ తదితర విభాగాలకు సంబంధించిన వార్తలు రాస్తుంటారు. ఇతడిని arunkumar.p@asianetnews.in ద్వారా సంప్రదించవచ్చు.
జీవనశైలి
ఏషియానెట్ న్యూస్
ఏషియానెట్ న్యూస్ తెలుగు ఒరిజినల్స్

Latest Videos
Recommended Stories
Recommended image1
BlackBeads: మెడ నిండుగా కనిపించే పంజాబీ మంగళసూత్రాలు.. ఓ లుక్కేయండి
Recommended image2
Fashion Tips: లైట్ వెయిట్ శారీస్.. వేసవిలో స్టైల్‌తో పాటు కూల్ లుక్!
Recommended image3
Blouse Designs: తక్కువ ధరలో వచ్చే ప్రింటెడ్ బ్లౌజులు.. ఎంత బాగున్నాయో!
Related Stories
Recommended image1
Best Night Foods: రాత్రి భోజనానికి బెస్ట్ ఫుడ్స్.. మంచి నిద్ర, ఫిట్‌నెస్ కోసం హెల్తీ ఛాయిస్!
Recommended image2
Vastu Tips For Morning: ఉదయం నిద్ర లేవగానే అస్సలు చేయకూడని 5 పనులు ఇవే!
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved