- Home
- Life
- Train Journey: కాళ్లు బయట పెట్టి కూర్చొని రైలు ప్రయాణం.. ఇలాంటి ట్రైన్ జర్నీ ఎప్పుడూ చేసి ఉండరు..!
Train Journey: కాళ్లు బయట పెట్టి కూర్చొని రైలు ప్రయాణం.. ఇలాంటి ట్రైన్ జర్నీ ఎప్పుడూ చేసి ఉండరు..!
Train Journey: మీరు రైలు ఎక్కినప్పుడు కాళ్లు బయటకు పెట్టి ఎప్పుడైనా కూర్చొన్నారా? మన దగ్గర అలా కూర్చొంటే రైల్వే అధికారులు తిట్టి ఫైన్ వేస్తారు. కానీ, ఇక్కడ మాత్రం.. రైలు ఎక్కిన ప్రతి ఒక్కరూ అలానే కూర్చొంటారు.. అదెక్కడో తెలుసా?

Train Jouney
ఇప్పటి వరకు మీరు చాలా సార్లు ట్రైన్ ఎక్కే ఉంటారు. రైలు ఎక్కుతున్నాం అంటే చాలు చాలా మంది విండో సీటు రావాలని అనుకుంటారు. ఎందుకంటే.. విండో పక్కన కూర్చొని.. ఆ ప్రకృతి అందాలు చూడటం చాలా బాగుంటుంది. కానీ అందరికీ విండో సీటు దక్కదు. కానీ... అలా కాకుండా.. రైలు ఎక్కిన ప్రతి ఒక్కరూ విండో సీటు అనుభూతి పొందితే.. అది కూడా బెస్ట్ పర్యాటక ప్రదేశంలో అయితే.. చూడటానికి రెండు కళ్లు కూడా సరిపోవు. అంతేకాదు... ప్రతి ఒక్కరూ రైలులో నుంచి కాళ్లు బయట పెట్టుకునే కూర్చొంటారు. ఇలాంటి అద్భుతమైన రైలు జర్నీ చేయాలంటే ఎక్కడికి వెళ్లాలో తెలుసా? అక్కడ ఆ జర్నీ ఎందుకు ఎంత స్పెషలో ఇప్పుడు తెలుసుకుందాం...
ఈ రైలు ఎక్కడ ఉంది?
ఇలాంటి రైలు మనం ఆస్ట్రేలియాలోని మెల్ బోర్న్ లో మాత్రమే చూడగలం. దీనిని Puffing billy railway అని పిలుస్తారు. మెల్ బోర్న్ సమీపంలోని డాండేనాంగ్ రేజెస్ ప్రాంతంలో ఉంది. ఈ రైల్వేని 1990లో ప్రారంభించారు. ఇది నార్మల్ రైలు కాదు.. ఆవిరి మీద నడిచే రైలు ఇది. ఇది నార్మల్ జర్నీ చేయడానికి కాకుండా.. స్పెషల్ గా పర్యాటకుల కోసం ఏర్పాటు చేశారు. ఈ ట్రైన్ లో ప్రయాణించే రహదారి కూడా అద్భుతంగా ఉంటుంది. చుట్టూ పచ్చని చెట్ల మధ్య అద్భుతంగా సాగే ప్రయాణం ఇది.
ఈ రైలు ప్రత్యేకత ఇదే...
ఈ రైలులో ప్రయాణమే చాలా స్పెషల్. ఎందుకంటే.. ఈ రైలులో అన్ని రైళ్లలా కూర్చోరు. కాళ్లు బయటకు పెట్టి మరీ కూర్చొంటారు. ఓపెన్ సైడ్ బోగీల్లా కనిపిస్తాయి. నార్మల్ గా వేరే ఇంకైదైనా ట్రైన్ లో ఇలా కూర్చొంటే.. రైల్వే అధికారులు ఫైన్ వేస్తారు. కానీ..ఈ రైలులో మాత్రం ఇలా కూర్చోవడమే రూల్. దీనిని చాలా సంవత్సరాలుగా సంప్రదాయంగా కొనసాగిస్తూ వస్తున్నారు. పర్యాటకులు రైలు ఎక్కడానికి చాలా ఎక్కువ ఆసక్తి చూపిస్తారు. అయితే.. ఇది ఎక్కువ కిలో మీటర్లు ప్రయాణించదు. దాదాపు 24 కిలోమీటర్ల దూరం ప్రయాణం సాగుతుంది. దీనికి రెండు గంటల సమయం పడుతుంది. ఈ జర్నీకి సంబంధించి ఎక్కువగా సోషల్ మీడియాలో ఫోటోలు, వీడియోలు వైరల్ అవుతూ ఉంటాయి.

