MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Today Rasi Phalalu
Severe Cyclone Threat
Katrina Kaif Trolls
The Paradise Flood Alert
Flash Flood Alert
Bigg Boss Telugu 10
Dal Cooking Tips
Pakistan Economic Crisis
Epic First Semester BO Collections
Megastar Chiranjeevi
Srikanth Daughter Medha Meka
  • Home
  • Life
  • Monsoon Snacks: వర్షం పడేటప్పుడు ఈ స్నాక్స్ తింటే వచ్చే ఫీలింగ్ వేరే లెవెల్ అంతే!

Monsoon Snacks: వర్షం పడేటప్పుడు ఈ స్నాక్స్ తింటే వచ్చే ఫీలింగ్ వేరే లెవెల్ అంతే!

Monsoon Snacks: వర్షాకాలం ప్రకృతి ప్రేమికులకు ఇష్టమైన కాలం. ఓ వైపు వర్షం, మరోవైపు చల్ల గాలి, మట్టి వాసన మనసుకు ఉత్సాహాన్నిస్తాయి. ఇలాంటి వాతావరణంలో వేడిగా రుచికరమైన స్నాక్స్‌ తింటే, ఆ ఫీలింగ్ వేరే లెవెల్ లో ఉంటుంది. అలాంటి కొన్ని స్నాక్స్ మీకోసం..

2 Min read
Author : Kavitha G
Published : Jun 12 2026, 02:36 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16
వర్షాకాలంలో ఎక్కువగా తినే స్నాక్స్
Image Credit : AI

వర్షాకాలంలో ఎక్కువగా తినే స్నాక్స్

వర్షాకాలంలో వేడివేడిగా ఏదైనా రుచికరమైన స్నాక్ తింటే ఆ అనుభూతి చాలా ప్రత్యేకంగా ఉంటుంది. తెలుగు రాష్ట్రాల్లో వర్షాకాలంలో కొన్ని ప్రత్యేకమైన స్నాక్స్ తయారు చేస్తారు. అందులో మొదటిది మిర్చి బజ్జీ. పెద్ద పచ్చి మిరపకాయలను శనగపిండి మిశ్రమంలో ముంచి నూనెలో వేయించి తయారు చేసే ఈ బజ్జీలు వేడిగా ఉన్నప్పుడు తింటే అద్భుతంగా ఉంటాయి. వేడివేడి మిర్చి బజ్జీతో అల్లం చట్నీ లేదా టమాటా సాస్ తీసుకుంటే రుచి మరింత పెరుగుతుంది.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
26
పకోడి
Image Credit : our own

పకోడి

వర్షాకాలంలో తినే మరో బెస్ట్ స్నాక్ పకోడి. ఉల్లిపాయ, పాలకూర, క్యాబేజీ లేదా ఇతర కూరగాయలతో తయారు చేసే పకోడీలు కరకరలాడే రుచితో అద్భుతంగా ఉంటాయి. వేడి టీతో కలిసి ఉల్లిపాయ పకోడీలు తినడం చాలా మందికి ఇష్టమైన అలవాటు. వీటిని ఇంట్లోనే తక్కువ సమయంలో సులభంగా తయారు చేసుకోవచ్చు.

36
పునుగులు
Image Credit : our own

పునుగులు

పునుగులు కూడా తెలుగు ప్రజలకు ఎంతో ఇష్టమైన సంప్రదాయ స్నాక్. దోశ పిండితో తయారు చేసే ఈ పునుగులు బయట కరకరలాడుతూ లోపల మెత్తగా ఉంటాయి. కొబ్బరి చట్నీ లేదా పల్లీ చట్నీతో కలిపి తింటే వీటి రుచి మరింత పెరుగుతుంది.

46
గారెలు
Image Credit : Sabitha vantalu

గారెలు

గారెలు కూడా వర్షం పడుతున్నప్పుడు తినే బెస్ట్ స్నాక్స్. మినప్పప్పుతో తయారు చేసే గారెలు ప్రోటీన్లతో పాటు మంచి రుచిని కూడా అందిస్తాయి. బయట వర్షం కురుస్తుండగా వేడివేడిగా గారెలు, అల్లం పచ్చడి లేదా కొబ్బరి చట్నీతో కలిసి తింటే ఆ టేస్ట్ ఎప్పటికీ గుర్తుండిపోతుంది.

56
మొక్కజొన్న
Image Credit : Getty

మొక్కజొన్న

మొక్కజొన్న కంకిని కూడా చాలామంది ఇష్టంగా తింటుంటారు. రోడ్ల పక్కన కాల్చిన, లేదా ఉడకబెట్టిన మొక్కజొన్న కంకిపై నిమ్మరసం, ఉప్పు, కారం చల్లి తినడం చాలామందికి ఇష్టం ఉంటుంది. మొక్కజొన్న సహజమైన రుచితో పాటు పోషక విలువలు కూడా కలిగి ఉంటుంది కాబట్టి అన్ని వయసుల వారికి మంచి ఎంపిక.

66
టీ, కాఫీలతో స్నాక్స్
Image Credit : Asianet News

టీ, కాఫీలతో స్నాక్స్

వర్షం పడుతున్నప్పుడు వేడివేడిగా టీ లేదా కాఫీతో పాటు బిస్కెట్లు, మురుకులు, చెకోడీలు వంటి స్నాక్స్ కూడా చాలామంది ఇష్టంగా తింటారు. ఈ స్నాక్స్ ని ఈజీగా తయారు చేసుకోవచ్చు. అలాగే ఎక్కువకాలం నిల్వ ఉంటాయి.

About the Author

KG
Kavitha G
8 సంవత్సరాలుగా జర్నలిజంలో ఉన్నారు. 2016లో ఈటీవీతో కెరీర్ ప్రారంభించారు. ప్రస్తుతం ఏసియానెట్‌లో ఫ్రీలాన్స్ జర్నలిస్ట్‌గా పని చేస్తున్నారు.
ఆహారం
జీవనశైలి
ఏషియానెట్ న్యూస్
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Dal: పప్పు ఉడికించేటప్పుడు పైన వచ్చే తెల్లటి నురగ ప్రమాదకరమా? పప్పు అసలు ఎలా వండాలి..?
Recommended image2
Gold Ring: అమ్మాయిల మనసు దోచే బంగారు ఉంగరం డిజైన్లు
Recommended image3
Weight Loss: ఇవి ఫాలో అయితే నెల రోజుల్లో బరువు తగ్గుతారు
Related Stories
Recommended image1
Fitness Tips: అమ్మాయిలు సన్నగా, ఫిట్‌గా ఉండడానికి 5 బెస్ట్ టిప్స్ ఇవిగో!
Recommended image2
Rice Water vs Aloe Vera: బియ్యం నీళ్లు, అలోవెరాలో జుట్టు పెరగడానికి ఏది మంచిది? నిజాలు ఇవే!
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved