- Home
- Life
- No Power Village: కరెంట్, వైఫ్, ఫోన్లు వాడని ఏకైక గ్రామం.. మన ఆంధ్రప్రదేశ్ లోనే ఎక్కడ ఉందో తెలుసా?
No Power Village: కరెంట్, వైఫ్, ఫోన్లు వాడని ఏకైక గ్రామం.. మన ఆంధ్రప్రదేశ్ లోనే ఎక్కడ ఉందో తెలుసా?
No Power Village: ఈ రోజుల్లో చేతుల్లో ఫోన్ లేకపోతే.. చాలా మందికి నిమిషం గడవదు. ఇలాంటి రోజుల్లో కూడా కనీసం ఫోన్, కరెంట్, వైఫ్ లేకుండానే జీవితం సాగిస్తున్న ఓ గ్రామం ఉంది. ఆ గ్రామం కూడా ఆంధ్రప్రదేశ్ లోనే ఉంది.

ఏపీలో వింత గ్రామం..
ఈ రోజుల్లో చిన్న పిల్లల నుంచి పెద్దవారి వరకు ఉదయం లేచిన దగ్గర నుంచి రాత్రి పడుకునే వరకు కాసేపు కూడా తమ ఫోన్లు పక్కన పెట్టడం లేదు. ఫోన్ ఒక్కటే కాదు.. వైఫై, కరెంట్ లేకుండా కూడా కాసేపు కూడా ఉండలేని పరిస్థితి ఏర్పడిన రోజులు ఇవి. ఆంధ్రప్రదేశ్ సరిహద్దుల్లో ఒక గ్రామం ఉంది. అక్కడ, కరెంట్ వెలుగులు ఉండవు. వైఫై సిగ్నల్స్ అసలే కనిపించవు. కనీసం చేతుల్లో ఫోన్లు కూడా వాడరు. ఆధునిక ప్రపంచపు హంగులన్నింటికీ దూరంగా, ప్రకృతి ఒడిలో ప్రశాంతంగా బతికేస్తున్న ఏకైక గ్రామం ఒకటి ఉంది. ఆ గ్రామం కథేంటో ఇప్పుడు తెలుసుకుందాం...
ఈ వింత గ్రామం ఎక్కడ ఉంది..?
శ్రీకాకుళం జిల్లా హిరమండలం సమీపంలో ఉన్న గ్రామమే కూర్మగ్రామం. దీనినే వేదిక్ విలేజ్ అని కూడా పిలుస్తారు. ఆధునిక యుగంలోనూ మన సనాతన ధార్మిక పద్ధతులను, సహజసిద్ధమైన జీవన శైలిని కాపాడుకోవాలనే లక్ష్యంతో ఈ గ్రామం రూపొందించారు.
ఈ గ్రామంలో లైఫ్ స్టైల్ ఎలా ఉంటుందంటే...
కరెంట్, ఫోన్లకు నో ఎంట్రీ: ఇక్కడ విద్యుత్ కనెక్షన్లు ఉండవు. అలాగే టీవీలు, సెల్‌ఫోన్లు, వైఫై వంటి డిజిటల్ సాధనాలను ఎవరూ ఉపయోగించరు. రాత్రి వేళల్లో దివిటీలు, దీపాల వెలుగులోనే గడుపుతారు.
ప్రకృతి సిద్ధమైన ఇళ్లు: ఇళ్ల నిర్మాణానికి సిమెంట్, ఇనుము వంటి ఆధునిక పదార్థాలను అస్సలు వాడరు. పూర్వకాలం నాటి పద్ధతిలో ఇసుక, సున్నం, బెల్లం, కరక్కాయల మిశ్రమాన్ని మాత్రమే ఉపయోగించి ఇళ్లను నిర్మించారు.
కెమికల్స్ లేని ఆహారం, సబ్బులు: ఇక్కడి ప్రజలు పూర్తిగా రసాయనాలు లేని ప్రకృతి వ్యవసాయం (ఆర్గానిక్ ఫార్మింగ్) చేస్తారు. తాము పండించిన ధాన్యం, కూరగాయలనే వాడుకుంటారు. బట్టలు ఉతకడానికి సబ్బులకు బదులుగా కుంకుడుకాయ రసాన్ని ఉపయోగిస్తారు.
లగ్జరీ ఉద్యోగాలు వదిలేసి..: ఇక్కడ నివసిస్తున్న వారిలో ఎక్కువ మంది గతంలో నగరాల్లో మంచి ఉద్యోగాలు, వ్యాపారాలు చేసినవారే. యాంత్రికమైన నగర జీవితంపై విసుగు చెంది, మనశాంతి కోసం ఇక్కడకు వచ్చి ప్రకృతితో మమేకమై జీవిస్తున్నారు.
గురుకుల విద్యావిధానం: ఇక్కడి పిల్లలకు కాంక్రీట్ స్కూళ్లు, టాబ్స్ ఉండవు. పురాతన వర్ణాశ్రమ విధానంలో గురుకుల విద్యను అందిస్తూ, గోశాలల నిర్వహణతో ఆధ్యాత్మిక వాతావరణంలో పెంచుతారు.
సకల సౌకర్యాలు ఉన్నా ప్రశాంతత కోసం తపించే ఈ రోజుల్లో... డిజిటల్ ప్రపంచానికి పూర్తిగా దూరంగా ఉంటూ, ప్రకృతితో కలసి జీవిస్తున్న కూర్మగ్రామం నిజంగా ఒక అద్భుతమనే చెప్పాలి.

