MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Life
  • Fish Curry: చేపలపులుసులో ఇదొక్కటి వేయండి రుచి అదిరిపోతుంది

Fish Curry: చేపలపులుసులో ఇదొక్కటి వేయండి రుచి అదిరిపోతుంది

Fish Curry: చేపల పులుసు అంటేనే నోరూరిపోద్ది. కారం, పులుపు, మసాలాల ఘుమఘుమలతో వేడి అన్నంలో కలుపుకుని తింటే అదిరిపోద్ది. అయితే ఎప్పుడూ చేసుకునేలా కాకుండా ఈ తమిళనాడు స్టైల్ లో ఒకసారి చేసుకుని తినండి. ఇలా చేస్తే ప్లేట్ కడగాల్సిన పనే ఉండదు. అంత బాగుంటుంది.

2 Min read
Author : Nandini Arava
Published : Oct 03 2026, 04:36 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
తమిళనాడు చేపల పులుసు రెసిపీ
Image Credit : vismai food/ youtube

తమిళనాడు చేపల పులుసు రెసిపీ

చేపల పులుసు ఒక్కో దగ్గర ఒక్కోలా చేస్తారు. నెల్లూరు చేపల పులుసు, తమిళనాడు చేపలపులుసు, ఆంధ్రా స్టైల్ పులుసు...ఇలా రెసిపీ ఎదైనా సరే దాని రుచి మాత్రం అద్భుతం. ప్రాంతానికో పద్ధతి ఉంటుంది. అందుకే ఎప్పుడూ మనం చేసుకునే చేపల పులుసులా కాకుండా ఈ సండే రోజు ఈ తమిళనాడు చేపల పులుసు ట్రై చేయండి. చేపలు ఇష్టపడని వాళ్లు కూడా పులుసుతో లాగించేస్తారు. అంత బాగుంటుంది. అయితే రెసిపీ చూసేయండి.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
కావాల్సిన పదార్థాలు
Image Credit : vismai food/ youtube

కావాల్సిన పదార్థాలు

చేపలు – 750 గ్రాములు, ఉప్పు – తగినంత, పసుపు – 1/4 టీస్పూన్, నల్ల మిరియాలు – 1 టేబుల్‌స్పూన్, 10 మెంతులు తాళింపు కోసం, ఉల్లిపాయ – 1, పచ్చిమిరపకాయలు – 3, వెల్లుల్లి రెబ్బలు – 15, టమాటాలు – 3, నూనె – సుమారు ⅔ కప్పు, ఆవాలు– 1/2 టీస్పూన్, కరివేపాకు – 2 రెమ్మలు, కారం – 2 టేబుల్‌స్పూన్లు, ధనియాల పొడి – 2 టేబుల్‌స్పూన్లు, చింతపండు – 50 గ్రాములు, కొబ్బరి పాలు – 2 కప్పులు, కొత్తిమీర – కొద్దిగా

పులుసు మసాలా కోసం.. మెంతులు – కాసింత సోంపు – 1/4 టీస్పూన్ జీలకర్ర – 1 టీస్పూన్ ఎండు మిరపకాయలు – 3–4. ఇప్పుడు ఒక పాన్‌లో మెంతులు, సోంపు, జీలకర్ర, ఎండు మిరపకాయలు వేసి మీడియం మంటపై వేయించాలి. మంచి వాసన వచ్చి మసాలాలు చిటపటలాడిన తర్వాత దించుకుని చల్లార్చాలి. వీటిని మెత్తని పొడిగా చేసుకుని పక్కన పెట్టాలి.

తయారీ విధానం

ముందుగా చేప ముక్కలను శుభ్రంగా కడిగి వాటికి ఉప్పు, 1/4 టీస్పూన్ పసుపు పట్టించాలి. 30 నిమిషాల పాటు పక్కన పెట్టాలి. తర్వాత పాన్‌లో కొద్దిగా నూనె వేసి నల్ల మిరియాలు, పెద్ద ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిరపకాయలు, వెల్లుల్లి రెబ్బలు వేయాలి. ఉల్లిపాయలు వేగాక టమాటాలు కూడా వేసి వేయించాలి. దీన్ని చల్లార్చి మెత్తని పేస్ట్ చేసుకోవాలి.

35
చింతపండు రసం వేయాలి
Image Credit : vismai food/ youtube

చింతపండు రసం వేయాలి

ఇప్పుడు మరోసారి పాన్‌లో నూనె వేడి చేసి కొద్దిగా మెంతులు, ఆవాలు, ఎండు మిరపకాయలు, కరివేపాకు వేసి తాలింపు పెట్టాలి. ఆ తర్వాత ఉల్లిపాయ-టమాటా పేస్ట్ వేసి బాగా కలపాలి. నూనె పైకి తేలేక ఉప్పు, పసుపు, కారం, ధనియాల పొడి వేసి బాగా కలిపి కొద్దిసేపు ఉడికించాలి. ముందుగా నానబెట్టిన చింతపండును పిండి సుమారు 1/3 కప్పు చిక్కటి చింతపండు రసాన్ని తీసుకోవాలి. దీన్ని పాన్‌లో పోసి బాగా కలపాలి. మళ్లీ నూనె పైకి తేలే వరకు ఉడికించాలి.

45
కొబ్బరి పాలు పోయాలి
Image Credit : vismai food/ youtube

కొబ్బరి పాలు పోయాలి

ఇప్పుడు చేప ముక్కలను జాగ్రత్తగా గ్రేవీలో వేయాలి. తర్వాత 2 కప్పుల పలుచని కొబ్బరి పాలు పోసి మూత పెట్టి మీడియం మంటపై చేపలు ఉడికే వరకు ఉంచాలి. చివరగా ముందుగా తయారు చేసుకున్న సోంపు-జీలకర్ర పొడిని చల్లి, కొత్తిమీర తరుగు వేయాలి. మరికొద్దిసేపు ఉడికించి స్టవ్ ఆఫ్ చేయాలి.

55
నెయ్యితో కలుపుకుని తింటే అదిరిపోద్ది
Image Credit : vismai food/ youtube

నెయ్యితో కలుపుకుని తింటే అదిరిపోద్ది

ఈ చేపల పులుసును వెంటనే తినడం కంటే 3–4 గంటలు చల్లారనిస్తే మసాలాల రుచి చేపలకు బాగా పడుతుంది. వేడి వేడి అన్నంలో నెయ్యితో కలుపుకుని తింటే తమిళనాడు స్టైల్ చేపల పులుసు రుచి అదిరిపోతుంది.

About the Author

NA
Nandini Arava
6 సంవత్సరాలుగా జర్నలిజంలో ఉన్నారు. 2019లో ఈటీవీతో కెరీర్ ప్రారంభించారు. తర్వాత పలు తెలుగు చానెళ్లలో సబ్ ఎడిటర్ గా పనిచేశారు. ప్రస్తుతం ఏసియా నెట్ లో మల్టీమీడియా జర్నలిస్టుగా చేస్తున్నారు. ఈమె సినిమా, జీవనశైలి, తెలుగు రాష్ట్రాలకు సంబదించిన వార్తలు, విశ్లేషణలు చేయగలరు.
జీవనశైలి
ఆహారం
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Swiggy : స్విగ్గీ ఆర్డర్స్ లో మన హైదరబాదీ వంటకమే టాప్.. ఏదో తెలుసా?
Recommended image2
Hair Growth : జుట్టు పొడవుగా, ఒత్తుగా పెరగాలంటే తరచూ కట్ చేయాల్సిందేనా?
Recommended image3
Pattu Sarees: మగువల మనసు దోచే బ్యూటిఫుల్ పట్టు చీరలు.. చూస్తే ఫిదా!
Related Stories
Recommended image1
Biryani Recipes: క్రేవింగ్స్ తీర్చే బిర్యానీస్ రెసిపీస్.. ఒకసారి ట్రై చేస్తే మళ్లీ మళ్లీ కావాలంటారు
Recommended image2
Jalebi : ఏమిటీ.. జిలేబి ఇండియన్ స్వీట్ కాదా? ఏ దేశానిదో తెలుసా?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved