MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Today Rasi Phalalu
Severe Cyclone Threat
Katrina Kaif Trolls
The Paradise Flood Alert
Flash Flood Alert
Bigg Boss Telugu 10
Dal Cooking Tips
Pakistan Economic Crisis
Epic First Semester BO Collections
Megastar Chiranjeevi
Srikanth Daughter Medha Meka
  • Home
  • Life
  • Spiritual
  • Money Plant: వేరొకరి ఇంటి నుంచి మనీ ప్లాంట్ దొంగిలించి మన ఇంట్లో నాటితే సంపద కలిసి వస్తుందా?

Money Plant: వేరొకరి ఇంటి నుంచి మనీ ప్లాంట్ దొంగిలించి మన ఇంట్లో నాటితే సంపద కలిసి వస్తుందా?

Money Plant: చాలామంది మనీ ప్లాంట్ ను కొనుగోలు చేయడానికి ఇష్టపడరు. వేరే వారి ఇంట్లో నుంచి చిన్న కొమ్మను తెచ్చి ఇంట్లో నాటుతారు. ఇలా చేయడం వల్ల సంపద కలిసి వస్తుందని నమ్ముతారు. అది ఎంతవరకు నిజమో తెలుసుకుందాం. 

2 Min read
Author : Haritha Chappa
Published : Nov 02 2025, 11:50 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
ఇంట్లో మనీ ప్లాంట్
Image Credit : Pixabay

ఇంట్లో మనీ ప్లాంట్

వాస్తు శాస్త్రంలో మనీ ప్లాంట్ కు ఎంతో ప్రాధాన్యత ఉంది. దీన్ని పవిత్రమైన మొక్కగా భావిస్తారు. ఈ మొక్క ఇంట్లో నాటితే ఆనందం, శ్రేయస్సు, సంపద కలుగుతుందని నమ్ముతారు. ఇంట్లో మనీ ప్లాంట్ నాటడం వల్ల ఆ వ్యక్తి ధనవంతుడు అవుతాడని, ఆ ఇంట్లో అన్ని శుభకార్యాలు జరుగుతాయని, ఆర్థిక లాభాలు వచ్చి పడతాయని అంటారు. ఈ నమ్మకం పురాతన కాలం నుంచి ఉంది. అయితే కొంతమంది ఈ మొక్కను వేరొకరి ఇంటి నుంచి వారికి తెలియకుండా కొమ్మని తెచ్చి ఇంట్లో నాటుతారు. దీన్ని దొంగతనమనే అంటారు. అలా చేస్తే పక్కింటి వారి సంపద తమకు వచ్చేస్తుందని వారు భావిస్తారు. అది ఎంతవరకు నిజమో ఇప్పుడు చూద్దాం.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
పరమ పవిత్రం మనీప్లాంట్
Image Credit : Unsplash

పరమ పవిత్రం మనీప్లాంట్

వాస్తు శాస్త్రం చెబుతున్న ప్రకారం ఇంట్లో కొన్ని మొక్కలు నాటడం వల్ల ఎంతో మేలు జరుగుతుంది. శుభాలు కలుగుతాయి. ఇంట్లో సానుకూల శక్తి ప్రసరిస్తుంది. అలాంటి వాటిలో మనీ ప్లాంట్ ఒకటి. ఈ మొక్క ఇంటి వాతావరణాన్ని మార్చేస్తుంది. ఆర్థిక పరిస్థితిని బలోపేతం చేస్తుంది. మనీ ప్లాంట్ నాటడం అనేది సంపదను, అదృష్టాన్ని, విజయాన్ని పొందేందుకు ఒక మార్గంగా చెబుతారు.

35
దొంగిలించవచ్చా?
Image Credit : Pixabay

దొంగిలించవచ్చా?

మనీ ప్లాంట్ ను దొంగిలించి నాటడం వల్ల ఆర్థిక లాభాలు వస్తాయన్నది ఎంతోమంది నమ్మకం. కానీ వాస్తు శాస్త్రం ఈ నమ్మకాన్ని అపోహగానే చెబుతుంది. ఏ రూపంలోనైనా దొంగతనం చేయడం అశుభకరం. చట్ట విరుద్ధమైన మార్గాలలో నడవడం అనేది ఎప్పటికైనా సమస్యలను తెచ్చుతుంది. అలాగే మనీ ప్లాంట్ ను కూడా దొంగతనంగా పొందినప్పుడు అది మీకు ప్రతికూల శక్తిని అందిస్తుంది... తప్ప సానుకూల శక్తిని అందించదు. కాబట్టి మనీ ప్లాంట్ ను ఎవరి ఇంటి దగ్గర నుంచి వారి తెలియకుండా తీసుకోకండి. ఇది ఇంటి ఆనందానికి, శ్రేయస్సుకు సవాలుగా మారుతుంది. ఇంట్లో ఆర్థిక సమస్యలను పెంచుతుంది.

45
మీ డబ్బులతోనే కొని
Image Credit : Pixabay

మీ డబ్బులతోనే కొని

వాస్తు శాస్త్రం ప్రకారం మీరు మనీ ప్లాంట్ ఇంట్లో నాటాలనుకుంటే దాన్ని కచ్చితంగా మీ డబ్బులతోనే కొనాలి. అలా కొని నాటిన మనీ ప్లాంట్ అత్యంత శుభప్రదమైనదిగా చెబుతారు. అలా చేయడం వల్ల ఇంట్లో పాజిటివ్ ఎనర్జీ పెరుగుతుందని, లక్ష్మీదేవి ఆశీస్సులు దక్కుతాయని అంటారు. ఇక మనీ ప్లాంట్ నాటడానికి శుక్రవారం శుభప్రదమైన రోజు. శుక్రవారం ఉదయం లేదా సాయంత్రం వేళల్లో మనీ ప్లాంట్ ను నాటవచ్చు.

55
తీగ కిందకి వేలాడకుండా
Image Credit : Pixabay

తీగ కిందకి వేలాడకుండా

చాలామందికి తెలియని విషయం ఏమిటంటే మనీ ప్లాంట్ తీగ ఎప్పుడూ నేలను తాకకూడదు. దీనివల్ల ఆ మొక్క నుంచి వచ్చే సానుకూల శక్తి తగ్గిపోతుంది. ఇంట్లో ప్రతికూల ప్రభావం పెరిగిపోతాయి. కాబట్టి తీగ నేలవైపుగా వంగుతుంది అనిపించినప్పుడు.. దాన్ని పైకి కట్టేందుకు తగినంత మద్దతును ఇవ్వండి.

About the Author

HC
Haritha Chappa
హరిత ఏసియా నెట్‌లో చీఫ్ సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. జర్నలిజంలో పీజీ పూర్తి చేశారు. ఈనాడు, సమయం, ఆంధ్రజ్యోతి, ఏబీపీ నెట్ వర్క్, హిందూస్థాన్ టైమ్స్ లో పనిచేశారు. ప్రింట్, డిజిటర్ మీడియాలో 18 ఏళ్ల అనుభవం ఉంది. ఏసియా నెట్ లైఫ్ స్టైల్, బిజినెస్, ఓటీటీ మూవీ కంటెంట్, ఆస్ట్రాలజీ కంటెంట్ రాస్తారు.
జీవనశైలి
ఆధ్యాత్మిక విషయాలు
ఏషియానెట్ న్యూస్
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Life Lessons : దశావతారాల నుంచి Gen-Z నేర్చుకోవాల్సిన 10 జీవిత పాఠాలు
Recommended image2
Bonalu: తెలంగాణలో ఆడపడుచులు.. అమ్మవారికి బోనం ఎందుకు సమర్పిస్తారు..?
Recommended image3
IRCTC సప్త జ్యోతిర్లింగ మహాయాత్ర: ఒక్క ట్రిప్‌లో 7 జ్యోతిర్లింగాల దర్శనం.. ప్యాకేజీ వివరాలు ఇవే
Related Stories
Recommended image1
క్యాన్సర్ రాకుండా ఉండాలంటే ఈ సూపర్ ఫుడ్స్ ప్రతిరోజూ తినాల్సిందే
Recommended image2
Basundi recipe: నోట్లో పెడితే కరిగిపోయేలా బాసుంది పాయసం రెసిపీ ఇదిగో
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved