Coffee: చైనా వాళ్లు ఇక మారరు.. బొద్దింకలతో స్పెషల్ కాఫీనట, ఎన్ని జబ్బులు వస్తాయో
Coffee: ప్రపంచంలో అతి వింతైన తిండి అలవాట్లు చైనా వాళ్లకే ఉన్నాయి. చైనాలోని బీజింగ్‌లో ఉన్న ఒక కీటకాల మ్యూజియంలో బొద్దింకల పొడి, ఎండిన గోధుమ పురుగులతో కాఫీని తయారు చేసి అమ్ముతున్నారు. దీన్ని తాగే వారి సంఖ్య అధికంగా ఉంది.

చైనాలో బొద్దింక కాఫీ
విచిత్రమైన ఆహారాలు తినే వారిలో చైనా వాళ్లు ముందుంటారు. పురుగుల నుంచి గబ్బిలాల వరకు అన్నింటినీ వీరు తినేస్తారు. ఇప్పుడు కొత్తగా కాఫీలో బొద్దింకల పొడి వేసి అమ్ముతున్నారు. దాన్ని యువత తెగ ఇష్టంగా తాగడం విశేషం. బీజింగ్‌లోని కీటకాల మ్యూజియం ఈ కొత్త రకం కాఫీని పరిచయం చేసింది. అక్కడ బొద్దింకల పొడి, ఎండిన గోధుమ పురుగులతో చేసిన కాఫీని అందిస్తోంది. కప్పు కాఫీ ధర 45 యువాన్లు. అంటే మన రూపాయల్లో 560 రూపాయలు.
రుచి ఎలా ఉంటుంది?
సాధారణంగా కాఫీ తాగితే ఎంతో హాయిగా, రుచిగా ఉంటుంది. దీన్ని తాగుతూ ఉంటే స్వర్గంలో విహరిస్తున్నట్టు ఉంది. కానీ ఈ బొద్దింకల కాఫీ రుచి మాత్రం చాలా భిన్నంగా ఉంటుంది. ఈ కాఫీ రుచి కొంచెం మాడిపోయినట్టు, అలా పుల్లగా కూడా ఉంటుందని దాన్ని తాగినవాళ్లు చెబుతున్నారు. చైనా వాళ్లు చెబుతున్న ప్రకారం బొద్దింకల పొడి రక్త ప్రసరణకు, గోధుమ పురుగులు రోగనిరోధక శక్తికి మంచివట.
చీమల కాఫీ
కేవలం బొద్దింక కాఫీనే కాదు… ఈ మ్యూజియం చీమల కాఫీని కూడా అందిస్తోంది. అలాగే ఇతర కీటకాలతో చేసిన పానీయాలను కూడా ఇక్కడ తయారు చేసి అమ్ముతున్నారు. చీమల కాఫీ ఎలా ఉంటుందో తెలుసుకోవాలనుందా? అది చాలా పుల్లాగా ఉంటుందట. నిజానికి బొద్దింకలు తిగిరిన కంచాలలో అన్నం తింటేనే ఎన్నో రోగాలు వస్తాయని అంటారు. అలాంటిది ఏకంగా బొద్దింకనే తినేస్తే ఎలాంటి రోగాలు రావా? చైనా వారికి అన్ని కీటకాలను అరిగించుకుని, తట్టుకునే శక్తి ఉన్నట్టుంది. అదే మనం తాగితే మాత్రం ఏమైనా జరగొచ్చు.

