MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Life
  • Sun Stroke : ఎండలోకి వెళితేనే కాదు ఇంట్లో ఉన్నా వడదెబ్బ తగులుతుంది.. సన్ స్ట్రోక్ కు టాప్ 5 రీజన్స్ ఇవే

Sun Stroke : ఎండలోకి వెళితేనే కాదు ఇంట్లో ఉన్నా వడదెబ్బ తగులుతుంది.. సన్ స్ట్రోక్ కు టాప్ 5 రీజన్స్ ఇవే

Heat Stroke : వేసవిలో ప్రాణాల మీదకు తెచ్చే ప్రమాదకరమైన సమస్య వడదెబ్బ... దీన్ని ''సన్ స్ట్రోక్'' అని కూడా అంటారు. అయితే వడదెబ్బ తగిలితే ఏం చేయాలి? అసలు వడదెబ్బ తగలకుండా తీసుకోవాల్సిన ముందు జాగ్రత్తలేమిటి..? 

3 Min read
Author : Arun Kumar P
Published : May 23 2026, 02:00 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
 వడదెబ్బతో పిట్టల్లా రాలిపోతున్న తెలుగు ప్రజలు..
Image Credit : Gemini AI

వడదెబ్బతో పిట్టల్లా రాలిపోతున్న తెలుగు ప్రజలు..

Sunstroke : వేసవి వచ్చిందంటే చాలు ఎండలు మండిపోతాయి. ఇక రోహిణి కార్తె సమయంలో అయితే ఈ ఎండలు తారాస్థాయికి చేరతాయి... ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో ఇదే పరిస్థితి ఉంది. ఆంధ్ర ప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో అత్యధికంగా 46 నుండి 48 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. పగటిపూట బయటకు రావాలంటేనే ప్రజలు భయపడిపోతున్నారు... దీంతో రోడ్లు నిర్మానుష్యంగా కనిపిస్తున్నారు. అయితే అత్యవసర పనులపై బయటకు వచ్చేవారు ఈ ఎండలు, వడగాలులు భారినపడి 'వడదెబ్బ (Sun Stroke)'' కు గురవున్నారు. గత నాలుగైదు రోజులుగా తెలుగు రాష్ట్రాల్లో వందలాదిమంది ఈ వడదెబ్బతో ప్రాణాలు కోల్పోయారు... ఇంకా ఎంతోమంది హాస్పిటల్లో చికిత్స పొందుతున్నారు.

వడదెబ్బ అంటే సాధారణ నీరసం కాదు.. దీనివల్ల శరీరంలో ఉష్ణోగ్రతను నియంత్రించే వ్యవస్థ పూర్తిగా విఫలమవుతుంది, దీంతో ఒళ్ళు విపరీతంగా వేడెక్కే ప్రాణాంతక పరిస్థితులకు దారితీస్తుంది. వడదెబ్బకు గురయిన వ్యక్తికి వెంటనే చికిత్స అందకపోతే మెదడు, గుండె, కిడ్నీల వంటి ముఖ్యమైన అవయవాలు దెబ్బతినవచ్చు. మరి ఇలా ప్రాణాంతకమైన వడదెబ్బ బారినుండి బైటపడాలంటే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో తెలుసుకుందాం.

Add Asianetnews Telugu as a Preferred SourcegooglePreferred
25
వడదెబ్బ తగలడానికి ప్రధాన కారణాలు...
Image Credit : iSTOCK

వడదెబ్బ తగలడానికి ప్రధాన కారణాలు...

సాధారణంగా మన శరీరంలో ఉష్ణోగ్రతను నియంత్రించుకునే వ్యవస్థ ఉంటుంది. కానీ తీవ్రమైన వేడి, డీహైడ్రేషన్, అధిక శారీరక శ్రమ వల్ల ఈ నియంత్రణ వ్యవస్థ దెబ్బతింటుంది. అప్పుడు శరీర ఉష్ణోగ్రత అకస్మాత్తుగా 40°C లేదా అంతకంటే ఎక్కువకు పెరుగుతుంది. దీనినే వడదెబ్బ (సన్ స్ట్రోక్) అంటారు. ముఖ్యంగా బయట పనిచేసే వాళ్లు, రైతులు, నిర్మాణ రంగ కార్మికులు, వృద్ధులు, పిల్లలు, ఇతర అనారోగ్య సమస్యలు ఉన్నవారికి దీని ముప్పు ఎక్కువ.

1. ఎక్కువసేపు ఎండలో ఉండటం : మండుటెండలో ఎక్కువసేపు నడవడం, పనిచేయడం లేదా ప్రయాణించడం వల్ల శరీరంలో వేడి పెరుగుతుంది. ముఖ్యంగా మధ్యాహ్నపు ఎండ చాలా ప్రమాదకరం.

2. డీహైడ్రేషన్ (Dehydration) : శరీరానికి సరిపడా నీళ్లు తాగకపోవడం వడదెబ్బకు ప్రధాన కారణం. చెమట ద్వారా శరీరం కోల్పోయిన నీటిని తిరిగి భర్తీ చేయకపోతే, శరీర ఉష్ణోగ్రత వేగంగా పెరుగుతుంది.

3. అధిక వ్యాయామం : వేసవిలో ఎండలో పరుగెత్తడం, జిమ్ చేయడం లేదా కఠినమైన శారీరక శ్రమ చేయడం వల్ల శరీర ఉష్ణోగ్రత అకస్మాత్తుగా పెరుగుతుంది. ఇది ఒక్కోసారి వడదెబ్బకు దారితీస్తుంది.

4. బిగుతైన, మందపాటి దుస్తులు ధరించడం : గాలి ఆడని దుస్తులు శరీరంలోని వేడిని బయటకు పోనివ్వకుండా చేస్తాయి. దీనివల్ల శరీరం సహజంగా చల్లబడదు... దీంతో వేడెక్కి వడదెబ్బకు దారితీసే ప్రమాదం ఉంటుంది.

5. గాలి వెలుతురు లేని చోట ఉండటం : ఎక్కువ వేడి ఉన్న గదులు, ఫ్యాక్టరీలు లేదా ఏసీ లేని మూసి ఉన్న ప్రదేశాల్లో ఎక్కువసేపు ఉండటం కూడా వడదెబ్బకు కారణమవుతుంది.

Related Articles

Related image1
Sun Stroke:వడ దెబ్బ తగిలిన వెంటనే ఏం చేయాలి?
Related image2
Now Playing
Sun Stroke: వడదెబ్బ తగిలిన వెంటనే ఏం చేయాలి? ఏం చేయకూడదు? | Asianet News Telugu
35
వడదెబ్బ తగిలితే ఏం జరుగుతుంది..?
Image Credit : Gemini AI

వడదెబ్బ తగిలితే ఏం జరుగుతుంది..?

వడదెబ్బ తగిలినప్పుడు శరీరం కొన్ని హెచ్చరిక సంకేతాలను పంపుతుంది. వాటిని వెంటనే గమనించాలి. మొదట ప్రథమ చికిత్స అందించేందుకు ప్రయత్నించాలి... పరిస్థితి చేయిదాటిపోయేలా ఉంటే మాత్రం వెంటనే హాస్పిటల్ కు తరలించాలి. కింది లక్షాలుంటే వడదెబ్బ తగిలినట్లే...

  • శరీర ఉష్ణోగ్రత 40°C లేదా అంతకంటే ఎక్కువకు పెరగడం
  • చెమట తగ్గడం లేదా శరీరం పొడిగా మారడం
  • చర్మం ఎర్రగా, వేడిగా ఉండటం
  • తీవ్రమైన తలనొప్పి, తల తిరగడం, వాంతి వస్తున్నట్లు అనిపించడం
  • నాడి వేగంగా కొట్టుకోవడం
  • శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది, గందరగోళం
  • మాట తడబడటం లేదా భ్రమ పడటం
  • స్పృహ కోల్పోవడం  
45
వడదెబ్బ తగిలితే ఏం చేయాలి..?
Image Credit : X

వడదెబ్బ తగిలితే ఏం చేయాలి..?

బాధితుడిని వెంటనే చల్లని ప్రదేశానికి మార్చండి : బాధితుడిని ఎండ నుంచి వెంటనే నీడకు లేదా ఏసీ ఉన్న గదికి తీసుకెళ్లాలి. ముందుగా శరీరాన్ని చల్లబరచండి. బట్టలు వదులు చేసి, చల్లటి నీటితో శరీరాన్ని తుడవాలి. మెడ, చంకలు, తొడల దగ్గర ఐస్ ప్యాక్స్ పెడితే వేడి త్వరగా తగ్గుతుంది.

నీళ్లు లేదా ORS ఇవ్వండి : వ్యక్తి స్పృహలో ఉంటే నెమ్మదిగా నీళ్లు లేదా ORS ద్రావణం తాగించాలి. వెంటనే వైద్య సహాయం అందించాలి మూర్ఛ, గందరగోళం లేదా స్పృహ కోల్పోతే ఆలస్యం చేయకుండా ఆసుపత్రికి తీసుకెళ్లాలి.

చేయకూడని పనులు :

వడదెబ్బ తగిలిన వ్యక్తి తెలిసీతెలియని నాటువైద్యం చేయకూడదు. ముఖ్యంగా కాఫీ, టీ లేదా ఆల్కహాల్ వంటివి అస్సలు ఇవ్వకూడదు. స్పృహలో లేనివారికి బలవంతంగా నీళ్లు తాగించకూడదు. 'కాసేపటికి అదే తగ్గిపోతుందిలే అని అస్సలు నిర్లక్ష్యం చేయకూడదు.

55
వడదెబ్బ తలగకుండా ముందుజాగ్రత్తలు...
Image Credit : iSTOCK

వడదెబ్బ తలగకుండా ముందుజాగ్రత్తలు...

ఎక్కువగా నీళ్లు తాగాలి : రోజూ కనీసం 3–4 లీటర్ల నీళ్లు తాగడం తప్పనిసరి. దాహం వేయకపోయినా మధ్యమధ్యలో నీళ్లు తాగుతూ ఉండాలి.

మధ్యాహ్నం ఎండలో తిరగకూడదు : వేసవికాలంలో 12 గంటల నుంచి 4 గంటల వరకు అంటే మిట్ట మధ్యాహ్నం బయటకు వెళ్లడం తగ్గించుకోవాలి.

సరైన దుస్తులు ధరించాలి : పలుచని, లేత రంగు కాటన్ దుస్తులు శరీరానికి చల్లదనాన్ని ఇస్తాయి. కాబట్టి వేసవి కాలంలో ఇలాంటి దుస్తులే వేసుకోవాలి. 

గొడుగు, టోపీ వాడాలి : బయటకు వెళ్లేటప్పుడు ఎండనుండి రక్షణనిచ్చే గొడుగు, టోపీ, సన్ గ్లాసెస్ వాడటం మంచిది.

ఓఆర్ఎస్, పండ్ల రసాలు తాగాలి : నీటితో పాటు ఎలక్ట్రోలైట్ పానీయాలు, మజ్జిగ, కొబ్బరి నీళ్లు, పుచ్చకాయ వంటి నీటిశాతం ఎక్కువగా ఉండే పానియాలు, ఆహారాలు తీసుకోవాలి.

 వృద్ధులు, పిల్లలు, గర్భిణీలు, గుండె జబ్బులు, షుగర్ ఉన్నవారు, బయట పనిచేసేవారు, ఎక్కువగా వ్యాయామం చేసేవారు వేసవిలో మరింత జాగ్రత్తగా ఉండాలి.

వడదెబ్బ అనేది సాధారణ వేసవి అలసట కాదు, ఇది ప్రాణాలకు ముప్పు తెచ్చే అత్యవసర వైద్య పరిస్థితి. ప్రారంభ లక్షణాలను గమనించి వెంటనే స్పందిస్తే పెద్ద ప్రమాదాలను నివారించవచ్చు. ముఖ్యంగా వేసవి కాలంలో తగినన్ని నీళ్లు తాగడం, ఎండలో తిరగకపోవడం, శరీరాన్ని చల్లగా ఉంచుకోవడం చాలా అవసరం. చిన్న నిర్లక్ష్యం కూడా పెద్ద సమస్యగా మారుతుందని మర్చిపోవద్దు.

About the Author

AK
Arun Kumar P
అరుణ్ కుమార్ పట్లోల : ఏడు సంవత్సరాలకు పైగా జర్నలిజంలో ఉన్నారు. ప్రస్తుతం ఏసియా నెట్ తెలుగులో సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. పొలిటికల్ తో పాటు ఎడ్యుకేషన్, కెరీర్, జాబ్స్, బిజినెస్, స్పోర్ట్స్ తదితర విభాగాలకు సంబంధించిన వార్తలు రాస్తుంటారు. ఇతడిని arunkumar.p@asianetnews.in ద్వారా సంప్రదించవచ్చు.
యుటిలిటీ
ఏషియానెట్ న్యూస్

Latest Videos
Recommended Stories
Recommended image1
Snake Finder APP: మీ ఫోన్ లో ఈ యాప్ ఉంటే...చుట్టుపక్కల ఎక్కడ పాము ఉన్నా ఈజీగా కనిపెట్టొచ్చు..!
Recommended image2
Pudina plant: పుదీనా మొక్కకు ఈ పొడి కలిపిన నీటిని వేశారంటే పచ్చని ఆకులతో నిండిపోతుంది
Recommended image3
Gold Plated mangalsutra: గ్రాండ్ లుక్ ఇచ్చే గోల్డ్ ప్లేటెడ్ నల్లపూసలు
Related Stories
Recommended image1
Sun Stroke:వడ దెబ్బ తగిలిన వెంటనే ఏం చేయాలి?
Recommended image2
Now Playing
Sun Stroke: వడదెబ్బ తగిలిన వెంటనే ఏం చేయాలి? ఏం చేయకూడదు? | Asianet News Telugu
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved