Hair Growth: రోజూ ఈ ఐదు తింటే... ఒక్క వెంట్రుక కూడా రాలదు, జుట్టు ఒత్తుగా పెరుగుతుంది..!
Hair Growth: ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా.. జుట్టు విపరీతంగా రాలిపోతోందా? ఖరీదైన ఉత్పత్తులు వాడాల్సిన అవసరం లేదు. ప్రతిరోజూ ఉదయాన్నే కొన్ని రకాల పదార్థాలు తినడం వల్ల జుట్టు రాలడం తగ్గడంతో పాటు.. హెయిర్ గ్రోత్ పెరుగుతుంది.

Hair Growth
మనం తినే ఆహారమే మన ఆరోగ్యాన్ని నిర్దేశిస్తుంది. ఆరోగ్యకరమైన జీవితాన్ని గడపాలంటే... మంచి పోషకాహారం కచ్చితంగా తీసుకోవాలి. పోషకాహార లోపం ఉంటే.. అనేక ఆరోగ్య సమస్యలు వస్తాయి. ముఖ్యంగా... చిన్న ఆరోగ్య సమస్య వచ్చినా... దాని ప్రభావం జుట్టుపై పడుతుంది. ఫలితంగా... విపరీతంగా జుట్టు రాలడం మొదలౌతుంది. అంతేకాదు, శరీరంలో విటమిన్ల లోపం ఉన్నా కూడా జుట్టు ఎక్కువగా రాలుతుంది. ప్రోటీన్, విటమిన్ బి12, బయోటిన్, రిబో ఫ్లావిన్, ఐరన్ వంటి ముఖ్యమైన పోషకాలు లేని ఆహారం తీసుకోకపోవడం వల్ల కూడా జుట్టు రాలుతుంది. ఇలా జరగకుండా ఉండాలంటే.. ప్రతిరోజూ ఐదు రకాల ఆహారాలు తీసుకోవడం వల్ల జుట్టు రాలడం పూర్తిగా తగ్గుతుంది.
1.చేపలు..
రెగ్యులర్ గా చేపలు తినడం వల్ల జుట్టు రాలడం తగ్గుతుంది. ఎందుకంటే, చేపలలో ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ పుష్కలంగా ఉంటాయి. ఇవి, జుట్టుకు కావాల్సిన పోషణను అందించి, జుట్టు వేగంగా పెరగడానికి సహాయపడతాయి. అంతేకాదు, జుట్టుకు మంచి మెరుపును కూడా ఇస్తాయి. మీ జుట్టు బలంగా ఉండటానికి రోజువారీ ఆహారంలో చేపలను చేర్చుకోవచ్చు. చేపల పులుసు, ఫిష్ ఫ్రై రూపంలో తక్కువ ఆయిల్ తో తీసుకుంటే సరిపోతుంది.
2.గుడ్లు...
జుట్టు ఎదుగుదలకు అత్యంత కీలకమైన పోషకాలు బయోటిన్, ప్రోటీన్. ఈ రెండూ కోడి గుడ్లలో పుష్కలంగా లభిస్తాయి. మన జుట్టు కుదుళ్లు పూర్తిగా ప్రోటీన్ తోనే తయారౌతాయి. కాబట్టి, తగినత ప్రోటీన్ తీసుకోవడం చాలా ముఖ్యం. అందుకే రోజుకి రెండు ఉడకపెట్టిన కోడిగుడ్లను ఆహారంలో భాగం చేసుకోవాలి.
3. పుట్టగొడుగులు..
పుట్టగొడుగులు తినడం వల్ల కూడా జుట్టు రాలడాన్ని అరికట్టవచ్చు. పుట్టగొడుగులలో యాంటీఆక్సిడెంట్లు, విటమిన్లు, ఖనిజాలు పుష్కలంగా ఉంటాయి. ఈ పోషకాలన్నీ జుట్టును ఆరోగ్యంగా, బలంగా ఉంచడంలో కీలక పాత్ర పోషిస్తాయి. మీ రోజువారీ భోజనంలో పుట్టగొడుగులతో చేసిన వంటకాలను సులభంగా చేర్చుకోవచ్చు.
4. గుమ్మడి గింజలు
గుమ్మడి గింజలలో ఒమేగా-3, జింక్, విటమిన్ E, విటమిన్ K అవసరమైన కొవ్వు ఆమ్లాలు ఉంటాయి. ఇవి శరీరంలో కొల్లాజెన్ ఉత్పత్తికి సహాయపడతాయి. అంతేకాకుండా, ఇవి జుట్టు కుదుళ్లకు పోషణనందించి, జుట్టు ఊడిపోకుండా దృఢంగా ఉండేలా చేస్తాయి.
5. ఆకుకూరలు..
పాలకూర, తోట కూర వంటి ఆకుకూరలలో ప్రోటీన్, కెరోటిన్, ఫోలేట్, పొటాషియం పుష్కలంగా ఉంటాయి. ఇవి జుట్టు కుదుళ్లను బలోపేతం చేయడానికి తోడ్పడతాయి. దీనికి తోడు, వీటిలో ఉండే ఐరన్ తలలో 'సిబమ్' సహజ నూనె ఉత్పత్తిని పెంచి, మాడును ఆరోగ్యంగా ఉంచుతుంది. ఈ ఆకుకూరలతో ఇంట్లోనే పోషకాలతో కూడిన హెల్దీ సలాడ్స్ తయారు చేసుకోవచ్చు.వీటిని రెగ్యులర్ గా తీసుకుంటే.. జుట్టు రాలడం తగ్గుతుంది.

