- Home
- Astrology
- Birth Star: ఈ నక్షత్రాల్లో పుట్టిన వారు బంగారం ధరిస్తే.. అదృష్టం రెట్టింపు అవుతుంది..!
Birth Star: ఈ నక్షత్రాల్లో పుట్టిన వారు బంగారం ధరిస్తే.. అదృష్టం రెట్టింపు అవుతుంది..!
Birth Star:జోతిష్య శాస్త్రం ప్రకారం బంగారం బృహస్పతి కి సంకేతం. బంగారం ధరించడం వల్ల శరీరంలో సానుకూల శక్తి పెరగడమే కాకుండా కొన్ని నక్షత్రాల వారికి మాత్రం విపరీతమైన అదృష్టాన్ని తీసుకువస్తుంది.

పుష్యమి నక్షత్రం...
జోతిష్య శాస్త్రం ప్రకారం, పుష్యమి నక్షత్రానికి శని అధిపతి. అయినప్పటికీ, ఈ నక్షత్రం గురు గ్రహం మంచి గొప్ప స్థితిలో ఉంటుంది. ఈ నక్షత్రంలో పుట్టిన వారు బంగారం ధరించడం వల్ల వారి జాతకంలో గురు బలం పెరుగుతుంది. దీని కారణంగా, ఈ రాశుల వారికి సకల ఐశ్వర్యాలు లభిస్తాయి. వీరి అదృష్టం రెట్టింపు అవుతుంది.
ఉత్తరాభాద్ర నక్షత్రం:
ఈ నక్షత్ర జాతకులకు గురు గ్రహ అనుగ్రహం ఎప్పుడూ ఉంటుంది. వీరు బంగారు ఆభరణాలు ముఖ్యంగా ఉంగరం లేదా గొలుసు ధరించడం వల్ల వృత్తి, వ్యాపారాలలో ఉన్న అడ్డంకులు తొలగిపోయి, హఠాత్ ధన లాభం, సమాజంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి.
మఖ నక్షత్రం:
కేతు గ్రహ అధిపత్యం కలిగిన మఖ నక్షత్రంలో పుట్టిన వారు బంగారం ధరించడం వల్ల జాతకంలోని దోషాలు తగ్గిపోతాయి. వీరికి బంగారం అదృష్టాన్ని తెచ్చి పెడుతుంది. అంతేకాకుండా, నిర్ణయాలు తీసుకునే శక్తిని, నాయకత్వ లక్షణాలను మెరుగుపరుస్తుంది.
రోహిణి నక్షత్రం:
చంద్రుని ఆధిపత్యం ఉన్న రోహిణి నక్షత్రంలో జన్మించిన వారికి బంగారం చాలా శుభప్రదమైనది. వీరు బంగారం ధరిస్తే మానసిక ప్రశాంతత లభించడంతో పాటు, లక్ష్మీదేవి అనుగ్రహంతో ఇంట్లో నిరంతరం ధన ధాన్యవృద్ధి జరుగుతుంది. వీరికి ఆర్థిక సమస్యలు ఏమీ ఉండవు.

