Paneer: ఇంట్లో చేసిన పనీర్ ఎన్ని రోజులైనా ఫ్రెష్ గా ఉండాలంటే ఈ సింపుల్ టిప్ ట్రై చేయండి
Paneer: పాల ప్రొడక్ట్ పనీర్‌లో చాలా పోషకాలు ఉంటాయి. ప్రోటీన్ ఎక్కువగా ఉండటం వల్ల జిమ్ చేసేవాళ్లకి, పిల్లలకు మంచి పోషకాహారంగా పనిచేస్తుంది. హెల్దీగా ఉంటారు. మరీ ఇంట్లో చేసిన పనీర్…ఎక్కువ రోజులు ఫ్రెష్ గా ఉండాలంటే…ఈ సింపుల్ టిప్ ట్రై చేయండి. పాడవ్వదు.

ఎన్ని రోజులైనా పన్నీర్ ఫ్రెష్ గా ఉండాలంటే ఇది ట్రై చేయండి
పాల ప్రొడక్ట్ పనీర్‌లో చాలా పోషకాలు ఉంటాయి. ప్రోటీన్ ఎక్కువగా ఉండటం వల్ల జిమ్ చేసేవాళ్లకి, పిల్లలకు మంచి పోషకాహారంగా పనిచేస్తుంది. హెల్దీగా ఉంటారు. ఏ కూరలో వేసినా దాని రుచి అమాంతం పెరిగిపోతుంది. ఇందులో ప్రొటీన్ ఎక్కువగా ఉండటం వల్ల చాలామంది తమ రోజువారీ డైట్‌లో పనీర్‌ను తప్పకుండా చేర్చుకుంటారు. మరీ ఇంట్లో చేసిన పనీర్…ఎక్కువ రోజులు ఫ్రెష్ గా ఉండాలంటే…ఇలా చేయండి.
కేర్ తీసుకోకపోతే పసుపుగా మారి పాడైపోద్ది
పనీర్ రెసిపీస్ చాలా బాగుంటాయి. చేయడం చాలా సులువు. కానీ దాని రుచి, ఫ్రెష్ నెస్ తగ్గకుండా చూసుకోవడం చాలా ముఖ్యం. సరిగ్గా నిల్వ చేయకపోతే పనీర్ పసుపు రంగులోకి మారి పుల్లగా అయిపోతుంది. అప్పుడది వృథాగా పడేయాల్సిందే. పనీర్ పాడవకుండా ఈ మూడు పద్ధతులు ట్రై చేయండి.
1.పనీర్‌ను నీళ్లలో వేసి నిల్వ చేయాలి
పనీర్‌ను నిల్వ చేయడానికి అత్యంత ఈజీ మార్గం దాన్ని నీళ్లలో ముంచడం. ఒక గిన్నెలో పనీర్ ముక్కను ఉంచి, అది మునిగేలా నీళ్లు పోసి ఫ్రిజ్‌లో పెట్టండి. పనీర్ రెండు మూడు రోజుల పాటు ఫ్రెష్‌గా ఉండాలంటే రోజూ ఆ నీటిని మారుస్తూ ఉండాలి.
2. తడి మస్లిన్ వస్త్రంలో పనీర్‌ను చుట్టి పెట్టండి
పనీర్ ఎండిపోకుండా ఉండాలంటే, దాన్ని ఒక తడి మస్లిన్ వస్త్రంలో చుట్టి గిన్నెలో పెట్టండి. తేమను నిలుపుకోవడానికి ప్రతి 4-5 గంటలకు ఒకసారి ఆ గుడ్డపై కొద్దిగా నీళ్లు చల్లండి. ఇలా చేసిన పనీర్‌ను ఫ్రిజ్‌లో పెడితే ఎక్కువ కాలం నిల్వ ఉంటుంది.
3. ఉప్పు నీటిలో పనీర్‌ను నిల్వ చేయడం
పనీర్ పాడవకుండా ఉండటానికి ఉప్పు నీరు బాగా సహాయపడుతుంది. ఒక గిన్నెలో నీళ్లు తీసుకుని అందులో ఒక టీస్పూన్ ఉప్పు కలపండి. ఆ నీటిలో పనీర్ ముక్కను ముంచి ఫ్రిజ్‌లో పెట్టండి. రెండు రోజులకోసారి నీళ్లు మారుస్తుంటే పనీర్ వారం రోజుల పాటు ఫ్రెష్‌గా ఉంటుంది.
గాలి చొరబడని డబ్బాలో పెడితే 6 నెలల పాటు ఫ్రెష్‌గా ఉంటుంది
గాలి చొరబడని (ఎయిర్‌టైట్) డబ్బాలో పనీర్‌ను ఉంచి ఫ్రీజర్‌లో పెడితే 6 నెలల వరకు పాడవకుండా ఉంటుంది. అయితే, ఇంత ఎక్కువ కాలం నిల్వ ఉంచితే పనీర్ సహజత్వంలో కొద్దిగా మార్పు రావచ్చు. మంచి రుచి కోసం ఫ్రీజర్‌లో పెట్టిన 3 నెలల్లోపు దీన్ని వాడేయడం ఉత్తమం.
ప్యాకెట్ పనీర్‌ను నేరుగా ఫ్రీజర్‌లోనే ఉంచండి
మీరు ప్యాకెట్ పనీర్ తెచ్చుకుంటే దాన్ని అలాగే ఫ్రీజర్‌లో పెట్టేయండి. వంటలో వాడే ముందు, ఆ పనీర్ ముక్కను కనీసం 15 నిమిషాల పాటు గోరువెచ్చని నీటిలో నానబెట్టండి. ఆ తర్వాత మీకు కావాల్సిన సైజులో ముక్కలు కోసుకుని వాడుకోవచ్చు. ఇలా చేస్తే పనీర్ ఎక్కువ కాలం నిల్వ ఉండటమే కాకుండా రుచిగా కూడా ఉంటుంది.

