MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Life
  • Snakes: భూమి మీద పాములు లేకపోతే ఏం జరుగుతుంది? మనకు తిండి కూడా దొరకదా?

Snakes: భూమి మీద పాములు లేకపోతే ఏం జరుగుతుంది? మనకు తిండి కూడా దొరకదా?

Snakes: పాము అంత దూరంలో కనపడిపోనే వెంటనే పారిపోతాం. కొందరు అయితే.. పాము కనపడగానే చంపకుండా వదిలిపెట్టరు. అలాంటి పాములు.. అసలు భూమి మీద లేకపోతే ఏం జరుగుతుందో తెలుసా?

2 Min read
Author : ramya Sridhar
Published : Sep 25 2026, 10:48 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
13
Snakes
Image Credit : Gemini AI

Snakes

పాము కనిపించాల్సిన అవసరం లేదు.. పేరు వినపడినా భయపడేవారు మనలో చాలా మంది ఉంటారు. దాని రూపం కొందరిని భయపెడితే.. అది కాటు వేస్తే చనిపోతాం అనే భయం చాలా మందిలో ఉంటుంది. ఎన్నో సంవత్సరాలుగా. మనం పాములను కేవలం ప్రాణాలు తీసే ప్రమాదకర జీవులుగా చూస్తూ వచ్చాం. కానీ, అసలు నిజం ఏంటంటే.. పాములు కనుక భూమిపై లేకపోతే.. మనుషులకు కనీసం తినడానికి తిండి కూడా దొరకదు. అసలు.. భూమిపై పాములు లేకపోతే ఏమౌతుంది? పాములు మనకు ఎలా ఉపయోగపడతాయి?

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
23
పాములు లేకపోతే ఏం జరుగుతుంది?
Image Credit : Chatgpt

పాములు లేకపోతే ఏం జరుగుతుంది?

పాములు లేకపోతే మనకు కరువు వస్తుంది. వినడానికి వింతగా అనిపించినా అక్షరాలా నిజం. ఒక జత ఎలుకలు కేవలం ఒకే సంవత్సరంలో దాదాపు వెయ్యి కంటే ఎక్కువ ఎలుకలకు జన్మనివ్వగలవు. పాములు లేకపోతే.. భూమిపై ఎలుకల సంఖ్య బాగా పెరిగిపోతోంది. ఆ ఎలుకలు మన పొలాల్లోని పంటలన్నింటినీ కొద్ది రోజుల్లోనే నాశనం చేస్తాయి. పాములు ఉండటం వల్లే.. మనం పండించిన పంట చేతికి అందుతుంది. పాములు ప్రకృతి ప్రసాదించిన ఉచిత పెస్ట్ కంట్రోలర్స్. అవి లేకపోతే.. ప్రపంచవ్యాప్తంగా ఆహార కొరత ఏర్పడి.. కరువు వచ్చే ప్రమాదం ఉంది.

33
పాము విషం.. ప్రాణాలు కూడా కాపాడుతుందా?
Image Credit : AI Image

పాము విషం.. ప్రాణాలు కూడా కాపాడుతుందా?

పాము కాటు వేస్తే.. దానిలోని విషం.. నిమిషాల్లో మన ప్రాణాలు తీసేస్తుంది. కానీ, అదే విషం మన ప్రాణాలను కూడా కాపాడుతుందని మీకు తెలుసా? ఏ పాము విషానికి అయితే.. మనం భయపడతామో.. అదే విషం తో లక్షలాది మంది గుండె జబ్బుల రోగులకు, హై బ్లడ్ ప్రెజర్ ఉన్న వారికి కొండంత అండగా నిలుస్తోంది. మెడికల్ సైన్స్‌లో ప్రాచుర్యం పొందిన కొన్ని బిపి , హార్ట్ ఎటాక్ మందులను పాము విషం నుంచే తయారుచేస్తారు. అల్జీమర్స్, క్యాన్సర్ , స్ట్రోక్ చికిత్సలలో పాము విషంలోని ప్రొటీన్లను వాడేందుకు శాస్త్రవేత్తలు పరిశోధనలు చేస్తున్నారు.

పాము పాలు తాగుతుందా?

మన దేశంలో అందరు దేవుళ్లతో పాటు.. పామును కూడా దేవతగా పూజిస్తూ ఉంటాం. పూజలో భాగంగా పాలు పోస్తూ ఉంటారు. కానీ.. సైన్స్ ప్రకారం, పాములు పాలు తాగలేవు. పాములకు లాక్టోస్ జీర్ణం చేసుకునే శక్తి ఉండదు. పాము పాలు తాగడం మేము కళ్లారా చూశాం అని చాలా మంది చెబుతూ ఉంటారు. అలా జరగడానికి కూడా ఒక కారణం ఉంది. గుడులలో లేదా పండుగల సమయంలో పాములు కొన్నిసార్లు పాలు తాగుతాయి. కానీ అది ఇష్టంతో కాదు... తీవ్రమైన నిర్జలీకరణం, దాహం వల్ల వేరే దారి లేక తాగుతాయి. పాలు తాగడం వల్ల చాలా పాములు అనారోగ్యం పాలై చనిపోతాయి.

అన్ని పాములు ప్రమాదకరమైనవి కావా?

ప్రపంచవ్యాప్తంగా దాదాపు 3,000 పైగా పాము జాతులు ఉంటే, అందులో కేవలం 15% నుండి 20% మాత్రమే మనుషులకు హాని కలిగించే ప్రమాదకరమైన విషాన్ని కలిగి ఉంటాయి. భారతదేశంలో కనిపించే మెజారిటీ పాములు విషపూరితమైనవి కావు. కాబట్టి, పాములు కనిపించగానే వాటిని చంపకుండా, వెంటనే స్నేక్ క్యాచర్స్ కి సమచారం ఇస్తే సరిపోతుంది.

About the Author

RS
ramya Sridhar
పది సంవత్సరాలుగా జర్నలిజంలో ఉన్నారు. 2017 నుండి ఆసియానెట్‌లో జర్నలిస్ట్‌గా పని చేస్తున్నారు. ప్రస్తుతం, లైఫ్‌స్టైల్ విభాగాన్ని లీడ్ చేస్తున్నారు. ఇంతకు ముందు ఈనాడులో పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్లో జర్నలిజం శిక్షణ పొందారు.
జీవనశైలి
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Mushrooms: మష్రూమ్స్ ఎక్కువ రోజులు ఫ్రెష్‌గా ఉండాలంటే ఇలా చేయండి చాలు!
Recommended image2
Bangles: ఎంత చూసినా మళ్లీ మళ్లీ చూడాలనిపించే గాజుల డిజైన్లు..
Recommended image3
Blouse Designs: లెహంగా, చీరల మీదకు అదిరిపోయే బ్లౌజు డిజైన్లు
Related Stories
Recommended image1
Prasad: చాక్లెట్స్ ని ప్రసాదంగా పంచి పెట్టే ఏకైక గుడి ఇది.. ఎక్కడ ఉందో తెలుసా?
Recommended image2
Birth Star: ఈ నక్షత్రాల్లో పుట్టిన వారు బంగారం ధరిస్తే.. అదృష్టం రెట్టింపు అవుతుంది..!
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved