MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Life
  • Cake Recipe: మీ ఇంట్లోని ఇడ్లీ పాత్రలోనే మెత్తటి కేక్ ఇలా చేసేయండి

Cake Recipe: మీ ఇంట్లోని ఇడ్లీ పాత్రలోనే మెత్తటి కేక్ ఇలా చేసేయండి

Cake Recipe: మీ ఇంట్లో ఓవెన్ లేకపోయినా ఇంట్లోనే చాలా సాఫ్ట్‌గా ఉండే కేక్ తయారు చేసుకోవచ్చు. రవ్వ, పాలు, పెరుగు లాంటి ఇంట్లో ఉండే వస్తువులతో ఇడ్లీ పాత్రలో కేక్ ఎలా చేయాలో ఇక్కడ చెప్పాము. ఫాలో అయిపోండి.

2 Min read
Author : Haritha Chappa
Published : Sep 25 2026, 11:25 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
13
ఇడ్లీ పాత్రలో కేక్ చేసేయండిలా
Image Credit : Pixabay

ఇడ్లీ పాత్రలో కేక్ చేసేయండిలా

ఇంట్లో కేక్ చేయాలంటే ఓవెన్ ఉండాలని అనుకుంటారు. నిజానికి ఇడ్లీలు ఉడికించే పాత్రలో కూడా కేక్ వండేయచ్చు. ఇందుకోసం కేక్ పిండిని నేరుగా మంట మీద కాకుండా, ఆవిరి మీద ఉడికిస్తాం. దీనివల్ల కేక్ మంచి తేమతో, చాలా సాఫ్ట్‌గా వస్తుంది. ఇడ్లీ స్టీమర్‌లో కేక్ చేసే పద్ధతిని చాలామంది ఇప్పటికే వాడుతున్నారు. ఈ పద్ధతికి ఓవెన్ అక్కర్లేదు, పెద్దపెద్ద బేకింగ్ వస్తువులు కూడా అవసరం లేదు. రవ్వ, పాలు, పెరుగు, చక్కెర, నూనె, కొన్ని బేకింగ్ వస్తువులు ఉంటే చాలు. ఇంట్లోనే చాలా ఈజీగా సాఫ్ట్ రవ్వ కేక్ ఎలా చేయాలో ఇప్పుడు చూద్దాం.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
23
కేక్ చేయడానికి కావాల్సిన పదార్థాలు
Image Credit : Chatgpt

కేక్ చేయడానికి కావాల్సిన పదార్థాలు

సన్నటి రవ్వ – 1½ కప్పు

చక్కెర – 1 కప్పు

పెరుగు – ¾ కప్పు

పాలు – ½ కప్పు

నూనె లేదా కరిగించిన నెయ్యి – ½ కప్పు

బేకింగ్ పౌడర్ – ½ టీస్పూన్

బేకింగ్ సోడా – ⅛ టీస్పూన్

ఉప్పు – ¼ టీస్పూన్

వెనిలా ఎసెన్స్ – 1 టీస్పూన్

జీడిపప్పు, కిస్మిస్ లేదా టూటీ ఫ్రూటీ – తగినంత

సన్నటి రవ్వ వాడితే కేక్ చాలా సాఫ్ట్‌గా వస్తుంది. ఒకవేళ మీ దగ్గర మామూలు రవ్వ ఉంటే, దాన్ని మిక్సీలో వేసి కాస్త సన్నగా పొడి చేసుకోండి.

33
ఇడ్లీ పాత్రలో కేక్ రెసిపీ
Image Credit : Chatgpt

ఇడ్లీ పాత్రలో కేక్ రెసిపీ

  1. ముందుగా ఒక గిన్నెలో రవ్వ, చక్కెర, ఉప్పు వేసి కలపండి. అందులో నూనె లేదా కరిగించిన నెయ్యి, పెరుగు, పాలు పోసి ఉండలు లేకుండా కేక్ పిండిలా కలుపుకోండి.

2. ఈ మిశ్రమంపై మూతపెట్టి 30 నుంచి 40 నిమిషాలు పక్కన పెట్టండి. రవ్వ పాలు, పెరుగును పీల్చుకుని మెత్తగా మారుతుంది. రవ్వ కేక్ చేసేటప్పుడు ఈ రెస్ట్ టైమ్ చాలా ముఖ్యం.

3. ఆ తర్వాత వెనిలా ఎసెన్స్, బేకింగ్ పౌడర్, బేకింగ్ సోడా వేసి నెమ్మదిగా కలపండి. మీకు ఇష్టమైతే జీడిపప్పు లేదా టూటీ ఫ్రూటీ కూడా వేసుకోవచ్చు.

4. ఇడ్లీ పాత్ర అడుగున తగినంత నీళ్లు పోసి మరిగించండి. ఒక చిన్న స్టీల్ కేక్ గిన్నెకు నూనె లేదా నెయ్యి రాయండి.

5. రెడీ చేసుకున్న పిండిని అందులో పోసి, ఇడ్లీ పాత్రలోని స్టాండ్ మీద పెట్టండి. మూతపెట్టి మీడియం మంట మీద ఉడికించండి.

6. సుమారు 30 నిమిషాల తర్వాత మధ్యలో ఒక పుల్ల గుచ్చి చూడండి. పుల్లకు పిండి అంటకుండా బయటకు వస్తే కేక్ ఉడికినట్లే. గిన్నె సైజు, మంటను బట్టి టైమ్ మారొచ్చు. పెద్ద కేకులకు 40 నిమిషాల వరకు పట్టొచ్చు. తరువాత స్టవ్ కట్టేయాలి. అంటే కేక్ రెడీ అయినట్టే.

About the Author

HC
Haritha Chappa
హరిత ఏసియా నెట్‌లో చీఫ్ సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. జర్నలిజంలో పీజీ పూర్తి చేశారు. ఈనాడు, సమయం, ఆంధ్రజ్యోతి, ఏబీపీ నెట్ వర్క్, హిందూస్థాన్ టైమ్స్ లో పనిచేశారు. ప్రింట్, డిజిటర్ మీడియాలో 18 ఏళ్ల అనుభవం ఉంది. ఏసియా నెట్ లైఫ్ స్టైల్, బిజినెస్, ఓటీటీ మూవీ కంటెంట్, ఆస్ట్రాలజీ కంటెంట్ రాస్తారు.
జీవనశైలి
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Gold Chains: కేవలం 5 గ్రాముల్లో వచ్చే బంగారు చైన్ డిజైన్స్
Recommended image2
Snakes: భూమి మీద పాములు లేకపోతే ఏం జరుగుతుంది? మనకు తిండి కూడా దొరకదా?
Recommended image3
Mushrooms: మష్రూమ్స్ ఎక్కువ రోజులు ఫ్రెష్‌గా ఉండాలంటే ఇలా చేయండి చాలు!
Related Stories
Recommended image1
Rent House: అద్దె ఇంట్లో ఎన్ని సంవత్సరాలు ఉంటే కిరాయిదారుడికి ఆ ఇల్లు సొంతమవుతుంది?
Recommended image2
Idli Capital: మనదేశంలో ఏ నగరాన్ని ఇడ్లీ రాజధానిగా పిలుచుకుంటారు?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved