MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Bigg Boss Telugu 10
Asian Games 2026
IMD Weather Update
Today's Rasi Phalalu
Jr NTR Injury Update
OTT Releases This Week
Actress Roja Selvamani
Team India Captain
Dimpu Kallem Asha
Abhishek Sharma
Missing Meghana Movie Review
Getup Srinu Remuneration
Chicken Curry Recipe
  • Home
  • Life
  • Spicy Boti Curry: తెలంగాణ స్టైల్లో స్పైసీగా బోటీ కర్రీ ఇలా వండితే రుచి అదిరిపోతుంది, రెసిపీ ఇదిగో

Spicy Boti Curry: తెలంగాణ స్టైల్లో స్పైసీగా బోటీ కర్రీ ఇలా వండితే రుచి అదిరిపోతుంది, రెసిపీ ఇదిగో

Spicy Boti Curry: నాన్ వెజ్ ను ఇష్టపడేవారికి బోటీ కూర, ఇగురు, వేపుడు కూడా నచ్చుతాయి. బోటి కూడా కాస్త కారంగా చేసుకుంటేనే రుచిగా ఉంటుంది. తెలంగాణ స్టైల్లో బోటీ కూర ఎలా వండాలో రెసిపీ ఇక్కడ ఇచ్చాము. 

2 Min read
Author : Haritha Chappa
Published : Apr 03 2026, 06:08 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
14
తెలంగాణా స్టైల్లో బోటీ కర్రీ
Image Credit : Suneetha Chowdary/youtube

తెలంగాణా స్టైల్లో బోటీ కర్రీ

తెలంగాణలో అధికంగా తినే వంటకాల్లో బోటీ కర్రీ ఒకటి. దీన్ని స్పైసీగా వండుకుని తింటే ఆ రుచే వారు. మసాలాలు దట్టించి, కారం వేసి చేసే ఈ కూర బగారా రైస్ తో తింటే అద్భుతంగా ఉంటుంది. బోటీని సరైన విధంగా శుభ్రం చేసివండితే కూర చాలా టేస్టీగా ఉంటుంది. రెసిపీ ఎలాగో తెలుసుకోండి.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
24
బోటీ కర్రీ రెసిపీకి కావాల్సిన పదార్థాలు
Image Credit : Kitchen food of India/Youtube

బోటీ కర్రీ రెసిపీకి కావాల్సిన పదార్థాలు

మటన్ బోటి – అరకిలో

ఉల్లిపాయలు – రెండు

టమాటాలు – రెండు

అల్లం-వెల్లుల్లి పేస్ట్ – ఒక స్పూన్

పసుపు – అర టీస్పూన్

కారం – ఒకటిన్నర టీస్పూన్లు

ధనియాల పొడి – ఒక స్పూను

జీలకర్ర పొడి – అర స్పూన్

గరం మసాలా – అర స్పూన్

దాల్చిన చెక్క, లవంగాలు, మరాఠీ మొగ్గ – గుప్పెడు

ఉప్పు – రుచికి సరిపడా

నూనె – మూడు స్పూన్లు

కొత్తిమీర తరుగు - గుప్పెడు

34
బోటీ కర్రీ ఇలా వండండి
Image Credit : Vismai Foods/Youtube

బోటీ కర్రీ ఇలా వండండి

1. ముందుగా బోటిని చాలా శుభ్రంగా కడగాలి. ఇదే చాలా ముఖ్యమైన పని.

2. బోటీని ఒక గిన్నెలో వేయాలి. అందులో కొద్దిగా ఉప్పు, పసుపు వేసి బాగా రుద్దాలి. అప్పుడు వాసన పోతుంది.

3. ప్రెషర్ కుక్కర్‌లో బోటిని కొద్దిగా నీరు వేసి 3–4 విజిల్స్ వచ్చే వరకు ఉడికించాలి. ఉడికిన తర్వాత చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి.

4. ఇప్పుడు స్టవ్ మీద కళాయి పెట్టి నూనె వేసి వేడి చేయాలి. అందులో దాల్చిన చెక్క, లవంగాలు, మరాఠీ మొగ్గ వేసి వేయించాలి.

5. అందులో తరిగిన ఉల్లిపాయలు వేసి బంగారు రంగు వచ్చే వరకు వేయించాలి.

6. ఆ తరువాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి వేయించాలి. ఇప్పుడు ఉడికించిన బోటి ముక్కలు వేసి వేయించాలి.

7. దీని వల్ల మసాలా బాగా ముక్కలకు పట్టి కర్రీ రుచిగా వస్తుంది.

8. తరువాత పసుపు, కారం, ధనియాల పొడి, జీలకర్ర పొడి వేసి బాగా కలపాలి.

9. తరువాత టమాటా ముక్కలు వేసి అవి మెత్తబడే వరకు ఉడికించాలి.

10. గ్రేవీ కోసం అవసరమైతే కొద్దిగా నీరు వేసి కుక్కర్‌లో మళ్లీ 4–5 విజిల్స్ వచ్చే వరకు ఉడికించాలి.

11. చివరగా గరం మసాలా వేసి కలిపి పైన కొత్తిమీరను చల్లాలి. అంతే టేస్టీ బోటీ మసాల కూర సిద్ధమైనట్టే.

44
ఇలా తింటే అదిరిపోతుంది
Image Credit : Taste my Recipe/Youtube

ఇలా తింటే అదిరిపోతుంది

తెలంగాణ బోటి కూర ఎంతో ప్రత్యేకమైనది. దాన్నీ స్పైసీగా చేసుకుని తింటేనే ఆ రుచి తెలుస్తుంది. వేడి అన్నం, జొన్న రొట్టి లేదా బగారా రైస్‌తో ఈ కూర చాలా బాగా సరిపోతుంది.

About the Author

HC
Haritha Chappa
హరిత ఏసియా నెట్‌లో చీఫ్ సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. జర్నలిజంలో పీజీ పూర్తి చేశారు. ఈనాడు, సమయం, ఆంధ్రజ్యోతి, ఏబీపీ నెట్ వర్క్, హిందూస్థాన్ టైమ్స్ లో పనిచేశారు. ప్రింట్, డిజిటర్ మీడియాలో 18 ఏళ్ల అనుభవం ఉంది. ఏసియా నెట్ లైఫ్ స్టైల్, బిజినెస్, ఓటీటీ మూవీ కంటెంట్, ఆస్ట్రాలజీ కంటెంట్ రాస్తారు.
ఆహారం
జీవనశైలి
ఏషియానెట్ న్యూస్
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Printed Saree: ఆఫీస్ వేర్ కి పర్ఫెక్ట్ గా సూటయ్యే ప్రింటెడ్ చీరలు
Recommended image2
Chapati Dough: చపాతీ పిండి కలిపిన కాసేపటికే నల్లగా ఎందుకు మారుతుంది? తాజాగా ఉండాలంటే ఏం చేయాలి?
Recommended image3
Silver Anklet:భారత్ లో కాకుండా ఏదేశంలో మహిళలు పట్టీలు ధరిస్తారో తెలుసా
Related Stories
Recommended image1
Periods in March: మార్చి నెలలో అమ్మాయిలకు పీరియడ్స్ ఆలస్యంగా వస్తాయి.. ఎందుకలా?
Recommended image2
Illu Illalu Pillalu April 3 Episode: నా కాపురం కూల్చేశారంటూ తల్లిదండ్రులను కడిగి పారేసిన వల్లి, పాపం చందు
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved