MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
ICC WTC Standings 2026-27
IMD Weather Update
Today's Rasi Phalalu
Toxic Movie Box Office Collections
G Subhash Chandra
Actress Hema Health Update
Tollywood Stylish Heroes
September OTT Releases
Yash Mother vs Allu Aravind
New Rules in Schools
Nepal Flash Flood
  • Home
  • Life
  • Periods in March: మార్చి నెలలో అమ్మాయిలకు పీరియడ్స్ ఆలస్యంగా వస్తాయి.. ఎందుకలా?

Periods in March: మార్చి నెలలో అమ్మాయిలకు పీరియడ్స్ ఆలస్యంగా వస్తాయి.. ఎందుకలా?

Periods in March: చాలా మంది మహిళలు గమనించే ఉంటారు. అన్ని నెలలతో పోలిస్తే మార్చి నెలలో పీరియడ్స్ ఆలస్యంగా వస్తాయి. ఇలా ఎందుకు జరుగుతుంది? దానికి కొన్ని ముఖ్య కారణాలు ఉన్నాయి. 

2 Min read
Author : Haritha Chappa
Published : Apr 03 2026, 12:46 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
13
మార్చిలోనే పీరియడ్స్ లేట్
Image Credit : Chat gpt

మార్చిలోనే పీరియడ్స్ లేట్

మహిళల్లో ప్రతి నెలా సమయానికి పీరియడ్స్ వస్తేనే వారు ఆరోగ్యంగా ఉన్నట్టు. ఇది మహిళల ఆరోగ్యానికి ముఖ్యమైన సూచికగా కూడ వైద్యులు చెబుతారు. అయితే చాలా మంది మహిళలకు ప్రతి ఏడాది మార్చి నెలలో పీరియడ్స్ ఆలస్యం అవుతున్నట్టు ఎంతో మంది గమనిస్తారు. మార్చి నెలలోనే ఎందుకు పీరియడ్స్ ఆలస్యంగా వస్తాయి? ఆరోగ్య నిపుణులు చెప్పిన ప్రకారం ఇది భయపడాల్సిన విషయం కాకపోవచ్చు. మార్చి నెలలో సాధారణంగా పరీక్షలు, పనిభారం, టార్గెట్లు వంటివి ఎక్కువ ఉంటాయి. దీని కారణాల వల్ల ఒత్తిడి పెరుగుతుంది. ఈ ఒత్తిడి శరీరంలోని హార్మోన్లపై ప్రభావం చూపిస్తుంది. ముఖ్యంగా కార్టిసోల్ అనే హార్మోన్ పెరగడం వల్ల ఓవ్యూలేషన్ (అండాల విడుదల) ఆలస్యం అవుతుంది. దాంతో పీరియడ్స్ కూడా ఆలస్యంగా వస్తాయి. కాబట్టి స్ట్రెస్‌ను తగ్గించుకుంటే పీరియడ్స్ సమయానికి వస్తాయి.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
23
ఫిబ్రవరి నెల వల్లే
Image Credit : Getty

ఫిబ్రవరి నెల వల్లే

మరొక ముఖ్యమైన కారణం కూడా చెప్పుకుంటారు. ఏడాదిలో అతి చిన్న నెల ఫిబ్రవరి. ఫిబ్రవరిలో సాధారణంగా 28 రోజులు మాత్రమే ఉంటాయి. చాలా మంది మహిళల పీరియడ్ సైకిల్ 30 లేదా 31 రోజులుగా ఉంటుంది. ఈ కారణంగా పీరియడ్స్ మార్చిలో ఆలస్యంగా వచ్చినట్లు అనిపిస్తుంది. కానీ ఇది నిజంగా ఆలస్యం కాదు. ఫిబ్రవరి నెలలో రోజులు తగ్గడమే. దీన్ని కాలెండర్ ఎఫెక్ట్ అని కూడా అంటారు. అంతేకాకుండా జీవనశైలిలో మార్పులు కూడా ప్రభావం చూపుతాయి. ఉదాహరణకు నిద్ర సమయాలు మారడం, ప్రయాణాలు ఎక్కువ అవడం, ఆహారపు అలవాట్లు మారడం, వ్యాయామం తక్కువ లేదా ఎక్కువ అవడం వంటి కారణాలు శరీర హార్మోన్లను ప్రభావితం చేస్తాయి. ఇవన్నీ కూడా పీరియడ్స్ ఆలస్యం కావడానికి కారణమవుతాయి.

Related Articles

Related image1
Dishti Removal: మీకు దిష్టి పెట్టారా? ఇలా చేస్తే ఆ చెడు ప్రభావం మొత్తం పోతుంది
Related image2
Illu Illalu Pillalu April 3 Episode: నా కాపురం కూల్చేశారంటూ తల్లిదండ్రులను కడిగి పారేసిన వల్లి, పాపం చందు
33
మీకున్న ఆరోగ్య సమస్యలు
Image Credit : Getty

మీకున్న ఆరోగ్య సమస్యలు

మహిళలకు ఉండే కొన్ని ఆరోగ్య సమస్యలు కూడా పీరియడ్స్ ఆలస్య కావడానికి కారణం అవుతాయి. ముఖ్యంగా పీసీఓఎస్ (PCOS), థైరాయిడ్ సమస్యలు లేదా ఇతర హార్మోనల్ అసమతుల్యత వంటి సమస్యలు ఉన్నప్పుడు పీరియడ్స్ రెగ్యులర్‌గా రావు. అలాగే హఠాత్తుగా బరువు పెరగడం లేదా తగ్గడం వంటివి కూడా ప్రభావం చూపిస్తాయి. ఇలా తరచుగా జరుగుతుంటే డాక్టర్‌ను సంప్రదించడం మంచిది. ఒకటి రెండు సార్లు ఆలస్యం అవడం సాధారణమే అయినా.. వరుసగా నెలల తరబడి పీరియడ్స్ రాకపోతే పరీక్షలు చేయించుకోవాలి. మొత్తానికి మార్చిలో పీరియడ్స్ లేట్ అవ్వడం చాలా సందర్భాల్లో సాధారణంగానే తీసుకోవాలి. 

About the Author

HC
Haritha Chappa
హరిత ఏసియా నెట్‌లో చీఫ్ సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. జర్నలిజంలో పీజీ పూర్తి చేశారు. ఈనాడు, సమయం, ఆంధ్రజ్యోతి, ఏబీపీ నెట్ వర్క్, హిందూస్థాన్ టైమ్స్ లో పనిచేశారు. ప్రింట్, డిజిటర్ మీడియాలో 18 ఏళ్ల అనుభవం ఉంది. ఏసియా నెట్ లైఫ్ స్టైల్, బిజినెస్, ఓటీటీ మూవీ కంటెంట్, ఆస్ట్రాలజీ కంటెంట్ రాస్తారు.
జీవనశైలి
మహిళలు
ఏషియానెట్ న్యూస్
ఏషియానెట్ న్యూస్ తెలుగు ఒరిజినల్స్

Latest Videos
Recommended Stories
Recommended image1
Saree Designs: పండగలకు పర్ఫెక్ట్ మ్యాచ్ అయ్యే చీరల డిజైన్లు
Recommended image2
Asafoetida: రోజూ చిటికెడు ఇంగువ తీసుకుంటే ఏమౌతుందో తెలుసా?
Recommended image3
Birds: ఈ గ్రామంలో పక్షులన్నీ ఒకేసారి ఆత్మహత్య చేసుకుంటాయి.. అది కూడా సెప్టెంబర్ నెలలోనే.. ఎందుకో తెలుసా?
Related Stories
Recommended image1
Dishti Removal: మీకు దిష్టి పెట్టారా? ఇలా చేస్తే ఆ చెడు ప్రభావం మొత్తం పోతుంది
Recommended image2
Illu Illalu Pillalu April 3 Episode: నా కాపురం కూల్చేశారంటూ తల్లిదండ్రులను కడిగి పారేసిన వల్లి, పాపం చందు
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved