మీ బాత్రూమ్ లో పీస్ లిల్లీ ఉంటే.. దుర్వాసన రాదు. ఈ మొక్కను పెంచడం చాలా సులభం. ఇది గాలిలోని విష పదార్థాలను తొలగించి, గాలిని శుభ్రపరుస్తుంది.
బోస్టన్ ఫెర్న్ మొక్క తేమ ఉన్న ప్రదేశాల్లో సులభంగా పెరుగుతుంది. ఇది గాలిని శుభ్రం చేయగలదు. బాత్రూంలోని దుర్వాసనను పోగొట్టడానికి కూడా ఇది సహాయపడుతుంది.
బాత్రూంలోని చెడు వాసనను పోగొట్టడానికి అరెకా పామ్ మొక్క సరిపోతుంది. ఇది గాలిలోని కాలుష్య కారకాలను సులభంగా తొలగించగలదు.
స్నేక్ ప్లాంట్‌ను తక్కువ సంరక్షణతో సులభంగా పెంచవచ్చు. ఇది బాత్రూంలోని దుర్వాసనను తేలికగా తొలగించగలదు.
స్పైడర్ ప్లాంట్‌ను కూడా తక్కువ శ్రద్ధతో సులభంగా పెంచవచ్చు. ఇది గాలిలోని విష పదార్థాలను తొలగించి, గాలిని స్వచ్ఛంగా మారుస్తుంది.
కలబంద మొక్క తేమను ఇష్టపడుతుంది. ఇది గాలిని శుభ్రపరచగలదు. బాత్రూంలోని దుర్వాసనను తొలగించడానికి కలబంద మొక్కను పెంచితే చాలు.
గాలిని శుభ్రపరచడానికి బ్యాంబూ పామ్ మొక్కను పెంచడం మంచిది. ఇది బాత్రూంలోని చెడు వాసనను కూడా దూరం చేస్తుంది.
Henna Plant: చిన్న కొమ్మతో కుండీలో గోరింటాకు మొక్క ఈజీగా పెంచేయచ్చు..!
Tulsi Plant: గింజలు ఇలా చల్లినా తులసి మొక్క గుబురుగా పెరుగుతుంది
Curry Leaves: ఈ ఒక్కటి వేస్తే కరివేపాకు మొక్క ఫాస్ట్ గా పెరుగుతుంది!
Gardening Tips: ఇంట్లో స్నేక్ ప్లాంట్ పెంచితే ఎన్ని లాభాలో..!