MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Life
  • Snakes: సైజులో అత్యంత చిన్న పాములు... విషంలో మాత్రం చాలా డేంజర్

Snakes: సైజులో అత్యంత చిన్న పాములు... విషంలో మాత్రం చాలా డేంజర్

Snakes: పాములో విషం ఉంటుందని మనకు తెలుసు. కానీ, అందరూ పెద్ద పెద్ద పాముల్లోనే విషం ఎక్కువగా ఉంటుంది అనుకుంటారు. కానీ, చూడటానికి చిన్నగా ఉన్నా.. అత్యంత ప్రమాదకరమైన పాములు కూడా మన దేశంలో ఉన్నాయి.

2 Min read
Author : ramya Sridhar
Published : Oct 19 2026, 06:56 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
13
అత్యంత ప్రమాదకరమైన పాములు..
Image Credit : geminiai

అత్యంత ప్రమాదకరమైన పాములు..

మన దేశంలో పాము అనగానే తాచు పాము, కొండ చెలువలు లాంటివి మాత్రమే చాలా ప్రమాదకరమైనవి అనుకుంటాం. కానీ, సైజు లో చాలా చిన్నవిగా కనిపిస్తూ, కంటికి కూడా సరిగ్గా ఆనని కొన్ని చిన్న చిన్న పాములు కూడా ఉన్నాయి. అవి చూడటానికి చిన్నగా ఉన్నా.. అత్యంత ప్రమాదకరమైనవని మీకు తెలుసా? అది కూడా ఈ పాములు మన దేశంలోనే ఎక్కువగా ఉన్నాయి. ఈ పాములు కాటేస్తే.. మనిషి బ్రతకడం కూడా చాలా కష్టం. అలాంటి నాలుగు అత్యంత ప్రమాదకరమైన పాములు ఏవో ఇప్పుడు చూద్దాం..

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
23
సా స్కేల్డ్ వైపర్...
Image Credit : geminiai

సా స్కేల్డ్ వైపర్...

ఈ పాము చూడటానికి చాలా చిన్నగా ఉంటుంది. ఇది కేవలం 1 నుండి 2 అడుగుల పొడువు మాత్రమే ఉంటుంది.

భారతదేశంలో అత్యధిక మరణాలకు కారణమయ్యే పాములలో ఇది కూడా ఒకటి. కానీ, అన్నింటి కంటే అత్యంత చిన్నది ఇదే. శత్రువుల నుండి ప్రమాదం అనిపించినప్పుడు తన శరీరంపై ఉండే రంపపు పొలుసులను ఒకదానికొకటి రుద్దుతూ "సర్‌ర్‌ర్" అనే హెచ్చరిక శబ్దాన్ని చేస్తుంది. గ్రామీణ ప్రాంతాల్లో, పొలాల్లో పనిచేసే వారిపై ఇది అత్యంత వేగంగా దాడి చేస్తుంది. చిన్నదిగా ఉండటం వల్ల ఎండుటాకుల్లో గుర్తుపట్టడం చాలా కష్టం.

హంప్-నోస్డ్ పిట్ వైపర్

ఈ పాము కూడా కేవలం 1.5 నుండి 2 అడుగులు మాత్రమే ఉండే చిన్న పాము. దీని ముక్కు భాగం కొద్దిగా ఉబ్బెత్తుగా ఉండటం వల్ల దీనికి ఈ పేరు వచ్చింది. రాళ్ల సందులు, రాలిపడిన ఎండుటాకుల రంగులో ఉన్నందున గుర్తుపట్టడం దాదాపు అసాధ్యం. దక్షిణ భారతదేశంలో ఎక్కువగా కనిపించే ఈ పాము ఇది. ఈ పాము కాటు వేస్తే రక్త ప్రసరణ వ్యవస్థ దెబ్బతిని, కిడ్నీలు కూడా ఫెయిల్ అయిపోతాయి.

33
గ్రీన్ పిట్ వైపర్
Image Credit : geminiai

గ్రీన్ పిట్ వైపర్

సాధారణంగా 2 నుండి 2.5 అడుగుల వరకు పెరుగుతుంది. ఆకుపచ్చని శరీరంతో చెట్ల కొమ్మలు, ఆకుల మధ్య కలిసిపోతుంది. దీనికి ఇతరుల శరీరం నుంచి వచ్చే ఉష్ణోగ్రతను పసిగట్టగలదు. చీకటిలో కూడా మనుషులను గుర్తించి కాటు వేయగల సత్తా దీనికి ఉంది. తోటలు, తేయాకు లేదా కాఫీ ఎస్టేట్లలో పనిచేసే కార్మికులకు ఇది చెట్ల కొమ్మలను నరికేటప్పుడు తెలియకుండా కాటు వేస్తుంటుంది.

సింధ్ క్రైట్ 

దీని పరిమాణం సుమారు 2 నుండి 3 అడుగుల పొడవు ఉంటుంది. కట్లపాము జాతికి చెందిన ఈ చిన్న జీవి శరీరంలో ఉండే విషం అత్యంత ప్రమాదకరం ఇది. సాధారణ కట్లపాము కంటే దీని విషం అనేక రెట్లు శక్తివంతమైనది. ముఖ్యంగా రాత్రివేళల్లో నేలపై నిద్రించే వారిని ఇది కాటు వేస్తుంది. దీని కాటు నొప్పి అంతగా అనిపించకపోవడం వల్ల బాధితులు గుర్తించే లోపే విషం శరీరం మొత్తం పాకి ప్రాణాలు పోయే ప్రమాదం ఉంది.

About the Author

RS
ramya Sridhar
పది సంవత్సరాలుగా జర్నలిజంలో ఉన్నారు. 2017 నుండి ఆసియానెట్‌లో జర్నలిస్ట్‌గా పని చేస్తున్నారు. ప్రస్తుతం, లైఫ్‌స్టైల్ విభాగాన్ని లీడ్ చేస్తున్నారు. ఇంతకు ముందు ఈనాడులో పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్లో జర్నలిజం శిక్షణ పొందారు.
జీవనశైలి
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Blouse Designs: చీరలు, లెహంగాలకు ట్రెండీ లుక్ ఇచ్చే బ్లౌజు డిజైన్లు
Recommended image2
Okra Vada: కరకరలాడే బెండకాయ వడలు.. ఒక్కసారి రుచి చూశారంటే అస్సలు వదలరు!
Recommended image3
Gold Ring: డైలీవేర్ కి పర్ఫెక్ట్ లుక్ ఇచ్చే గోల్డ్ రింగ్స్.. ఇవిగో!
Related Stories
Recommended image1
Colour: పింక్ అమ్మాయిల కలర్, బ్లూ అబ్బాయిల కలర్ గా ఎలా మారింది?ఈ నిజం తెలిస్తే నోరెళ్లపెట్టాల్సిందే
Recommended image2
Facts: చెట్లకు నిజంగానే డబ్బులు కాస్తే ఏమౌతుంది? మనకు తిండి కూడా దొరకదా?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved