MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Life
  • Black Jeans: బ్లాక్ జీన్స్ ఇలా ఉతికితే.. ఎన్నేళ్లు అయినా కొత్త దానిలా కనపడుతుంది..!

Black Jeans: బ్లాక్ జీన్స్ ఇలా ఉతికితే.. ఎన్నేళ్లు అయినా కొత్త దానిలా కనపడుతుంది..!

Black Jeans: మీ దగ్గర బ్లాక్ జీన్స్ ఉందా? రెగ్యులర్ గా వాడటం, ఉతకడం వల్ల దాని రంగు వెలసిపోయినట్లుగా కనపడుతోందా? మరి, మీ బ్లాక్ జీన్స్ ఎక్కువ కాలం మన్నికగా ఉండాలంటే ఏం చేయాలో తెలుసా? 

2 Min read
Author : ramya Sridhar
Published : May 19 2026, 12:08 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
13
Black Jeans
Image Credit : Chat GPT

Black Jeans

అమ్మాయిలు, అబ్బాయిలు అనే తేడా లేదు.. ప్రతి ఒక్కరి వార్డ్ రోబ్ లో బ్లాక్ జీన్స్ కచ్చితంగా ఉంటుంది. ఒక్క బ్లాక్ జీన్స్ ఉంటే.. ఎన్ని రకాలుగా అయినా స్టైల్ చేయవచ్చు. అయితే.. బ్లాక్ జీన్స్ తో ఉన్న సమస్య ఏమిటంటే.. నాలుగైదు సార్లు ఉతకగానే అవి కలర్ షేడ్ అయిపోతాయి. తెల్లగా లేదంటే.. బూడిద రంగులోకి మారిపోతూ ఉంటాయి. ఇలా మారడానికి కారణం..మనం దానిని సరిగా ఉతికకపోవడం. అన్ని దుస్తులతో కలిసి బ్లాక్ జీన్స్ ని వాషింగ్ మెషిన్ లో వేయడం వల్లే... తొందరగా పాడైపోతుంది. అలా జరగకుండా, బ్లాక్ జీన్స్ ఎక్కువ రోజులు మన్నికగా ఉండాలంటే ఏం చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం..

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
23
  బ్లాక్ జీన్స్ ఉతికే విధానం...
Image Credit : AI

బ్లాక్ జీన్స్ ఉతికే విధానం...

బ్లాక్ జీన్స్ కలర్ షేడ్ అవ్వగుండా ఉండేందుకు దానిని ఉతికే సమయంలో కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. ముఖ్యంగా జీన్స్ రివర్స్ తిప్పి ఉతకాలి. ఇలా చేయడం వల్ల కలర్ షేడ్ అవ్వదు. ఎండలో ఆరేసినప్పుడు కూడా దానిని రివర్స్ లోనే ఆరేయాలి. అప్పుడు ఎక్కువ రోజులు మన్నికగా ఉంటుంది.

కూల్ వాటర్, వెనిగర్...

వేడి నీటితో బ్లాక్ జీన్స్ ని ఉతికితే.. తొందరగా కలర్ పోయే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అందుకే, ఈ బ్లాక్ జీన్స్ ని ఉతకడానికి చల్లటి నీరు ఉపయోగించాలి. మీరు జీన్స్ ని మొదటిసారి ఉతుకుతున్నట్లయితే.. చల్లటి నీటిలో ఒక కప్పు వైట్ వెనిగర్, చిటికెడు ఉప్పు వేసి కలపాలి. ఈ నీటిలో ఉతికితే.. ఎంతకాలం అయినా జీన్స్ పాడవ్వకుండా ఎక్కువ కాలం కొత్త దానిలానే కనిపిస్తుంది.

33
ఎక్కువగా ఉతకకూడదు...
Image Credit : others

ఎక్కువగా ఉతకకూడదు...

బ్లాక్ జీన్స్ వేసుకున్న ప్రతిసారీ ఉతకాల్సిన అవసరం లేదు. మీరు మీ డెనిమ్ ను ఎంత తక్కువగా ఉతికితే, అది ఎక్కువ కాలం మన్నుతుంది. మీ జీన్స్ పై చిన్న మరకపడితే.. జీన్స్ మొత్తం ఉతకకుండా.. ఆ మరక వరకు శుభ్రం చేస్తే సరిపోతుంది. మరీ ముఖ్యంగా నెలకు ఒకటి లేదా రెండు సార్లు మాత్రమే జీన్స్ ఉతికితే.. అది ఎక్కువ రోజులు చాలా మన్నికగా ఉంటుంది.

ఎండలో ఆరవేయకూడదు...

మీ జీన్స్ ని ఉతికేటప్పుడు.. రంగును కాపాడే తేలికపాటి డిటర్జెంట్ ను ఎల్లప్పుడూ వాడాలి. ఉతికిన తర్వాత, వాటిని ఎప్పుడూ నేరుగా ఎండలో ఆరవేయాలి. ఎందుకంటే.. అతి నిలలోహిత కిరణాలు నలుపు రంగు తొందరగా పాలిపోయేలా చేస్తాయి. మీ జీన్స్ ని ఎల్లప్పుడూ నీడలో లేదా ఇంటి లోపల ఆరబెట్టాలి. ఈ చిన్న చిన్న జాగ్రత్తలు తీసుకుంటే.. ఎన్ని రోజులైనా మీ బ్లాక్ జీన్స్ కొత్త దానిలాగే కనపడుతుంది.

About the Author

RS
ramya Sridhar
పది సంవత్సరాలుగా జర్నలిజంలో ఉన్నారు. 2017 నుండి ఆసియానెట్‌లో జర్నలిస్ట్‌గా పని చేస్తున్నారు. ప్రస్తుతం, లైఫ్‌స్టైల్ విభాగాన్ని లీడ్ చేస్తున్నారు. ఇంతకు ముందు ఈనాడులో పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్లో జర్నలిజం శిక్షణ పొందారు.
జీవనశైలి
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Fresh Fish Vs Dry Fish: తాజా చేపలు, ఎండు చేపలు ఏది తింటే మంచిది? ఎందులో ఎక్కువ పోషకాలు ఉంటాయి?
Recommended image2
Fry Piece Mutton Dum Biryani: నెల్లూరు స్టైల్ ఫ్రై పీస్ మటన్ దమ్ బిర్యానీ..వీకెండ్ సెట్ అంతే
Recommended image3
Earphone Hacks: జేబులో ఇయర్ ఫోన్ వైర్లు చిక్కులు పడకుండా ఉండాలంటే ఈ ట్రిక్ ట్రై చేయండి
Related Stories
Recommended image1
Water Bucket: AC రూమ్ లో నీళ్ల బకెట్ ఎందుకు పెట్టాలి?
Recommended image2
Lucky Plant: మనీ ప్లాంట్ కాదు.. ఈ మొక్క మీ ఇంట్లో ఉంటే డబ్బును అయస్కాంతంలా ఆకర్షిస్తుంది..!
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved