MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
ICC WTC Standings 2026-27
IMD Weather Update
Today's Rasi Phalalu
Toxic Movie Box Office Collections
G Subhash Chandra
Actress Hema Health Update
Tollywood Stylish Heroes
September OTT Releases
Yash Mother vs Allu Aravind
New Rules in Schools
Nepal Flash Flood
  • Home
  • Life
  • Water Bucket: AC రూమ్ లో నీళ్ల బకెట్ ఎందుకు పెట్టాలి?

Water Bucket: AC రూమ్ లో నీళ్ల బకెట్ ఎందుకు పెట్టాలి?

Water Bucket: మీ ఇంట్లో ఏసీ ఉందా? ఎండ వేడి తట్టుకోలేక ఏసీ వాడుతున్నారా? మరి , ఏసీ ఉన్న గదిలో వాటర్ బకెట్ పెడుతున్నారా? అసలు వాటర్ బకెట్ ఎందుకు పెట్టాలి? దీని వెనక రీజన్ ఏంటి? 

2 Min read
Author : ramya Sridhar
Published : May 13 2026, 03:45 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
13
AC room
Image Credit : Freepik

AC room

రోజు రోజుకీ ఎండలు మండిపోతున్నాయి. బయట ఎండలకు ఇంట్లో ఉన్నా కూడా విపరీతంగా చెమటలు పట్టేస్తున్నాయి.ఈ వేడి, చెమటలు తట్టుకోలేక ఏసీలు వాడటం మొదలుపెడతారు. ఏసీ రూమ్ లో ఉంటే ఎంతో హాయిగా ఉంటుంది. నిమిషాల్లో వేడి తగ్గుతుంది. చెమటలు కూడా మాయం అయిపోతాయి. కానీ, ఏసీ రూమ్ లో గంటల కొద్దీ ఉండటం వల్ల చర్మ సమస్యలు వస్తాయని మీకు తెలుసా? ముఖ్యంగా చర్మం పొడిబారిపోతుంది.. మరి.. ఆ సమస్య నుంచి బయటపడటానికి ఏసీ రూమ్ లో నీళ్ల బకెట్ పెట్టాలని నిపుణులు చెబుతున్నారు. నిజమేనా? నీళ్ల బకెట్ ఎందుకు పెట్టాలి? దీని వల్ల కలిగే ప్రయోజనం ఏంటి అనే విషయం ఇప్పుడు తెలుసుకుందాం...

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
23
ఎక్కువ సేపు ఏసీలో ఉంటే ఏమౌతుంది?
Image Credit : our own

ఎక్కువ సేపు ఏసీలో ఉంటే ఏమౌతుంది?

ఏసీ ఆన్ లో ఉన్నప్పుడు.. అది గదిలోని గాలి నుండి తేమను తొలగిస్తుంది. దీని ప్రభావం మన చర్మంపై చాలా ఎక్కువగా కనపడుతుంది. ఏసీ గదిలో ఎక్కువ సేపు కూర్చోవడం వల్ల చర్మం పొడి బారుతుంది. పెదాలు పగిలిపోతాయి. కళ్లు మంటలు పుడతాయి. మీ గొంతు, ముక్కు కూడా పొడిబారుతుంది. ఇక సైనస్ లేదా శ్వాసకోశ సంబంధిత సమస్యలు ఉన్న వారికి, ఏసీ గదిలో ఎక్కువ సేపు గడపడం వల్ల తీవ్ర ఇబ్బందులు కలిగే అవకాశం ఉంది.

Related Articles

Related image1
Cooler: కూలర్ నుంచి నీచు వాసన వస్తుందా? ఇలా క్లీన్ చేస్తే ఆ సమస్య ఉండదు
Related image2
Curd: పెరుగు మంచిదే కానీ, వీటితో కలిపి తింటే చాలా ప్రమాదం..!
33
ఏసీ గదిలో బకెట్ నీళ్లు ఉంచితే ఏం జరుగుతుంది?
Image Credit : Pixabay

ఏసీ గదిలో బకెట్ నీళ్లు ఉంచితే ఏం జరుగుతుంది?

ఏసీ గదిలో నీళ్ల బకెట్ ఉంచడం చాలా మంచిది. ఇలా నీళ్ల బకెట్ ఉంచడం వల్ల ఆ నీరు నెమ్మదిగా గాలిలోకి ఆవిరి అయిపోయి..గదిలో తగినంత తేమ ఉండేలా చేస్తుంది. ఇది మంచి హ్యూమిడిఫైయ్యర్ లా పని చేస్తుంది. దీని వల్ల చర్మం పొడిబారదు. మంచిగా తేమగా ఉంటుంది. శ్వాస సమస్యలు రావు. గొంతు పొడిబారే సమస్య ఉండదు. రాత్రిపూట మంచి నిద్రకూడా పడుతుంది.

AC నుండి వచ్చే గాలి చల్లగా ఉన్నప్పటికీ, అది పొడిగా ఉంటుంది. ఇది మీ శరీరంపైనే కాకుండా, ఇంటి వాతావరణంపై.. ఇంట్లోని వస్తువులపై కూడా ప్రతికూల ప్రభావాన్ని చూపుతుంది. పొడి గాలికి ఎక్కువసేపు గురికావడం వల్ల చెక్క ఫర్నిచర్‌లో పగుళ్లు ఏర్పడతాయి. ఇంట్లో పెంచుకునే మొక్కలు ఎండిపోతాయి. ఇంట్లో ఒక బకెట్ నీటిని ఉంచడం వల్ల గదిలో కొద్దిపాటి తేమ ఉంటుంది, ఇది ఈ సమస్యలను గణనీయంగా తగ్గిస్తుంది.

దీనిని ఎలా ఉపయోగించాలి?

బకెట్‌ను గది మూలలో లేదా కిటికీ దగ్గర ఉంచండి. బకెట్‌లోని నీటిని ప్రతిరోజూ మార్చాలి. లేకపోతే, నీటిలో దోమలు వృద్ధి చెందే అవకాశం ఉంది. మీరు కావాలనుకుంటే, నీటిలో నిమ్మ తొక్క లేదా కొన్ని చుక్కల ఎసెన్షియల్ ఆయిల్‌ను జోడించవచ్చు, ఇది సువాసనను ఇస్తుంది.

About the Author

RS
ramya Sridhar
పది సంవత్సరాలుగా జర్నలిజంలో ఉన్నారు. 2017 నుండి ఆసియానెట్‌లో జర్నలిస్ట్‌గా పని చేస్తున్నారు. ప్రస్తుతం, లైఫ్‌స్టైల్ విభాగాన్ని లీడ్ చేస్తున్నారు. ఇంతకు ముందు ఈనాడులో పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్లో జర్నలిజం శిక్షణ పొందారు.
జీవనశైలి

Latest Videos
Recommended Stories
Recommended image1
పెళ్లయిన మహిళలు నుదుటిన సింధూరం ఎందుకు పెట్టుకుంటారు?
Recommended image2
Oil Stains: దుస్తులపై నూనె మరకలు పడ్డాయా? ఈ సింపుల్ చిట్కాలతో సులభంగా తొలగించండి
Recommended image3
Cooking Tips: అన్నం కానీ, పప్పు కానీ మాడిపోయిందా? నిమిషాల్లో ఆ మాడువాసన పోగొట్టే చిట్కా ఇది..!
Related Stories
Recommended image1
Cooler: కూలర్ నుంచి నీచు వాసన వస్తుందా? ఇలా క్లీన్ చేస్తే ఆ సమస్య ఉండదు
Recommended image2
Curd: పెరుగు మంచిదే కానీ, వీటితో కలిపి తింటే చాలా ప్రమాదం..!
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved