MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Today's Rasi Phalalu
UPI Payment Charges
Irumudi Movie BO Collections
Indian Railways New Rule
Ramba Oorvasi Menaka BO Collections
Bethlehem Kudumba Unit OTT Release
Team India Squad for West Indies ODI Series
IMD Weather Update
Jio Free Canva Pro Subscription
Epic Movie BO Collections
Tirumala Srivari Brahmotsavam
Mandaadi Movie BO Collections
Bigg Boss Telugu 10
  • Home
  • Life
  • Soft Chapati: ఈ సింపుల్ టిప్స్ తో దూదిలాంటి మెత్తటి చపాతీలు రెడీ! ట్రై చేయకపోతే ఎలా?

Soft Chapati: ఈ సింపుల్ టిప్స్ తో దూదిలాంటి మెత్తటి చపాతీలు రెడీ! ట్రై చేయకపోతే ఎలా?

Soft Chapati: చపాతీలు ఎంత మెత్తగా ఉంటే తినడానికి అంత రుచిగా ఉంటాయి. కానీ, వాటిని మెత్తగా చేయడం చాలామందికి కష్టమైన పని. మీరు కూడా దూదిలాంటి మెత్తటి చపాతీలు చేయాలనుకుంటే, ఈ కిచెన్ టిప్స్ ఫాలో అయితే చాలు. చాలా ఈజీగా సాఫ్ట్ చపాతీలు తయారుచేసుకోవచ్చు.

2 Min read
Author : Kavitha G
Published : May 29 2026, 12:42 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16
సాఫ్ట్ చపాతీ తయారు చేసే విధానం
Image Credit : Pixabay

సాఫ్ట్ చపాతీ తయారు చేసే విధానం

మీరు చేసే చపాతీలు కాసేపటికే గట్టిగా, రాయిలా మారిపోతున్నాయా? అయితే ఈ సింపుల్ టిప్స్ మీ కోసమే. వీటితో ఇంట్లోనే దూదిలాంటి మెత్తటి చపాతీలు తయారు చేసుకోవచ్చు. పిండి కలపడం నుంచి కాల్చడం వరకు, చిన్న చిన్న టిప్స్ ఫాలో అయితే చాలు… చపాతీల రుచి, రూపు పూర్తిగా మారిపోతాయి. మరి ఆ కిచెన్ హ్యాక్స్ ఏంటో తెలుసుకోండి.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
26
గోరువెచ్చని నీళ్లు
Image Credit : AI Meta

గోరువెచ్చని నీళ్లు

చపాతీ పిండిని చక్కగా కలుపుకున్నప్పుడే చపాతీలు సాఫ్ట్ గా వస్తాయి. కాబట్టి పిండి కలిపే విధానం చాలా ముఖ్యం. చపాతీ పిండిని ఎప్పుడూ గోరువెచ్చని నీళ్లతోనే కలపాలి. ఇలా చేయడం వల్ల పిండి సాఫ్ట్‌గా మారుతుంది. చపాతీలు మెత్తగా వస్తాయి. అయితే, పిండి మరీ గట్టిగా లేదా మరీ జారుగా లేకుండా చూసుకోవాలి.

36
నూనె లేదా నెయ్యి
Image Credit : social media

నూనె లేదా నెయ్యి

చపాతీ పిండి కలిపేటప్పుడు కొద్దిగా నూనె లేదా నెయ్యి కలపడం మంచిది. ఇది పిండిలో తేమను నిలిపి ఉంచుతుంది. చపాతీలు త్వరగా గట్టిపడకుండా ఉంటాయి. రెండు రోజుల వరకైనా మెత్తగా ఉంటాయి. అలాగే నూనె లేదా నెయ్యి తక్కువ మోతాదులో వేయడం వల్ల చపాతీ రుచి కూడా బాగుంటుంది. 

46
15 నిమిషాలు పక్కన పెట్టడం
Image Credit : Freepik

15 నిమిషాలు పక్కన పెట్టడం

పిండి కలిపిన తర్వాత  వెంటనే చపాతీలు చేయకూడదు. దానిపై మూతపెట్టి కనీసం 15 నుంచి 20 నిమిషాల పాటు పక్కన పెట్టాలి. ఇలా చేయడం వల్ల పిండిలోని గ్లూటెన్ సెట్ అయి, చపాతీలు మరింత మెత్తగా వస్తాయి.

56
కాల్చే విధానం
Image Credit : youtube @sangeetareallife

కాల్చే విధానం

చపాతీ కాల్చే పెనం ముందుగానే వేడిగా ఉండాలి. వేడి పెనంపై చపాతీ వేస్తే అది సరిగ్గా కాలుతుంది. ఎక్కువసేపు నిల్వ ఉన్నా కూడా గట్టిపడకుండా ఉంటుంది. అలాగే చపాతీలను ఎప్పుడూ మీడియం ఫ్లేమ్ మీదే కాల్చాలి. మంట ఎక్కువగా ఉంటే చపాతీ మాడిపోయి, గట్టిగా మారే అవకాశం ఉంటుంది. సరైన వేడి ఉంటేనే చపాతీ బాగా పొంగుతుంది.

66
మూత ఉన్న బాక్స్ లో..
Image Credit : Getty

మూత ఉన్న బాక్స్ లో..

చపాతీ కాల్చిన వెంటనే, వాటిపై నెయ్యి రాసి, ఒక క్లాత్ తో కప్పి ఉంచాలి లేదా మూత ఉన్న డబ్బాలో పెట్టాలి. ఇలా చేస్తే చపాతీలు ఎక్కువసేపు మెత్తగా ఉంటాయి. రుచిగా కూడా ఉంటాయి.

About the Author

KG
Kavitha G
8 సంవత్సరాలుగా జర్నలిజంలో ఉన్నారు. 2016లో ఈటీవీతో కెరీర్ ప్రారంభించారు. ప్రస్తుతం ఏసియానెట్‌లో ఫ్రీలాన్స్ జర్నలిస్ట్‌గా పని చేస్తున్నారు.
ఆహారం
జీవనశైలి
చిట్కాలు మరియు ఉపాయాలు
ఏషియానెట్ న్యూస్
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Silver Mettelu: ఈ అందమైన మెట్టెలు చూస్తే ఫిదా అయిపోతారు
Recommended image2
Aloe Vera: కలబందను ఇలా వాడితే మీ అందం రెట్టింపు కావడం పక్కా!
Recommended image3
దేవుడి గదిలో మట్టి కుండ, రాతి ఉప్పు పెట్టి చూడండి... కొన్ని రోజుల్లోనే మీ జీవితంలో మార్పులు
Related Stories
Recommended image1
Saree Reuse: పాత చీరలను పడేస్తున్నారా? ఇలా చేస్తే డబ్బు ఆదా.. అద్భుతమైన లుక్ మీ సొంతం!
Recommended image2
Gardening Tips: కుండీల్లో ఈజీగా పెరిగే మొక్కలు.. ఇంటి అందం రెట్టింపు
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved