MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Life
  • Things Ban In Flight: విమానం ఎక్కుతున్నారా? మీ బ్యాగ్ లో ఇవి ఉంటే.. విమానం ఎక్కలేరు..!

Things Ban In Flight: విమానం ఎక్కుతున్నారా? మీ బ్యాగ్ లో ఇవి ఉంటే.. విమానం ఎక్కలేరు..!

 Foods Ban In Flight: విమానం ఎక్కుతున్నారా? మీ బంధువులు, స్నేహితుల కోసం ఏవైనా ఆహార పదార్థాలు తీసుకువెళ్లాలని అనుకుంటున్నారా? మీ బ్యాగ్ లో కొన్ని ఫుడ్ ఐటెమ్స్ ఉంటే.. మీరు విమానం ఎక్కలేరని తెలుసా? 

2 Min read
Author : ramya Sridhar
Published : Apr 30 2026, 03:38 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
13
Airlines
Image Credit : Getty

Airlines

ఈ రోజుల్లో విమాన ప్రయాణం చాలా నార్మల్ అయిపోయింది. చిన్న చిన్న అవసరాలకు కూడా విమానాల్లో ప్రయాణించేవారు బాగా పెరిగిపోయారు. చదువు కోసం, ఉద్యోగాల కోసం పిల్లలు ఇతర దేశాల్లో సెటిల్ అయితే.. వాళ్ల కోసం పేరెంట్స్ కూడా ఈ మధ్య ఇంటర్నేషనల్ ట్రిప్స్ వేస్తున్నారు. అయితే.. దూరంగా ఉన్న పిల్లల కోసం... చాలా మంది స్పెషల్ గా కొన్ని ఆహార పదార్థాలను తీసుకొని వెళ్తుంటారు. మన ఫుడ్స్ అక్కడ వాళ్లకు దొరకదు అనే భావనతో స్పెషల్ గా ప్యాక్ చేసి మరీ తీసుకెళ్తుంటారు. కానీ, కొన్ని ఫుడ్స్ మీ బ్యాగ్ లో ఉంటే... విమాన సిబ్బంది మిమ్మల్ని విమానం ఎక్కడానికి అనుమతించరు అనే విషయం మీకు తెలుసా? వేటిని తీసుకువెళితే ఇబ్బంది పడతారో..? అసలు ఎలాంటివి విమానంలో తీసుకువెళ్లడానికి అనుమతించరో ఇప్పుడు తెలుసుకుందాం....

Add Asianetnews Telugu as a Preferred SourcegooglePreferred
23
 1.ద్రవ పదార్థాలు..
Image Credit : amazon

1.ద్రవ పదార్థాలు..

మీరు విమానంలో ప్రయాణించాలి అనుకుంటే... మీ లగేజ్ లో ఎలాంటి లిక్విడ్ ఫుడ్స్ ఉండకూడదు. అంటే.. సూప్ , సిరప్ , జామ్ , తేనె, చట్నీలు, డబ్బాలలోని జ్యూస్ లతో సహా 100ఎంఎల్ కంటే ఎక్కువ క్వాంటిటీలో ఉంటే.. వాటిని క్యాబిన్ బ్యాగులలో తీసుకువెళ్లడానికి అంగీకరించరు. పిల్లల పాలు, డాక్టర్ ప్రిస్కిప్షన్ తో ఉన్న మందులు అయితే మాత్రమే క్యాబిల్ లో అనుమతిస్తారు. కానీ, వాటికి కూడా కొన్ని పరిమితులు ఉంటాయి.

2.ఘాటైన వాసన ఉన్న ఆహారాలు..

విమాన క్యాబిన్ లు మూసేసి ఉంటాయి. మొత్తం ఏసీతో నిండి ఉంటుంది. కాబట్టి ఘాటైన వాసన ఉన్న ఆహార పదార్థాలను అనుమతించరు. ముఖ్యంగా పచ్చి ఉల్లిపాయలు, వెల్లుల్లి, కొన్ని రకాల చేపలతో చేసిన ఘాటైన వాసన ఉన్న ఆహారాలను నిషేధించారు. చాలా ఇంటర్నేషనల్ ఎయిర్ లైన్స్ ఈ ఫుడ్స్ ని అనుమతించరు.

Related Articles

Related image1
Snake Revenge: సినిమాల్లో చూపించినట్లు నిజంగా పాములు పగపడతాయా? మనుషులను గుర్తు పెట్టుకుంటాయా?
Related image2
Curd: పాలల్లో ఈ ఒక్క ఆకు వేస్తే.. పెరుగు గడ్డలా తోడుకుంటుంది, పుల్లగా కూడా మారదు
33
3.కొబ్బరి..
Image Credit : Getty

3.కొబ్బరి..

ఎండు కొబ్బరిని కూడా క్యాబిన్ బ్యాగులలోకి తీసుకువెళ్లడానికి అనుమతించరు. ఎండు కొబ్బరిలో నూనె శాతం ఎక్కువగా ఉండటం వల్ల దానికి మండే స్వభావం ఎక్కువగా ఉంటుంది. దీని కారణంగా అగ్ని ప్రమాదం జరిగే అవకాశాలు ఉన్నాయని దీనిని కూడా నిషేధించారు.

4. తాజా పండ్లు , కూరగాయలు

మీరు విదేశాలకు ప్రయాణిస్తుంటే, తాజా పండ్లు, కూరగాయలు ,విత్తనాలను తీసుకువెళ్లడంపై కఠినమైన ఆంక్షలు ఉన్నాయి. అంతర్జాతీయ నిబంధనల ప్రకారం, దిగుమతి చేసుకున్న పండ్లు లేదా విత్తనాలలో దేశ వ్యవసాయానికి హాని కలిగించే తెగుళ్లు లేదా వ్యాధులు ఉండవచ్చు. దొరికితే భారీ జరిమానా విధించే అవకాశం ఉంది.

5. మాంసం, పాల ఉత్పత్తులు

చాలా దేశాలు, ముఖ్యంగా అమెరికా, ఆస్ట్రేలియా , ఐరోపా దేశాలు, విమానాలలో దిగుమతి చేసుకున్న మాంసం, చీజ్ లేదా పాల ఉత్పత్తులను అనుమతించవు. మీరు వీటిని తీసుకువెళ్లాలంటే.. ఎయిర్ లైన్స్ తో ముందుగానే మాట్లాడుకోవడం ఉత్తమం.

About the Author

RS
ramya Sridhar
పది సంవత్సరాలుగా జర్నలిజంలో ఉన్నారు. 2017 నుండి ఆసియానెట్‌లో జర్నలిస్ట్‌గా పని చేస్తున్నారు. ప్రస్తుతం, లైఫ్‌స్టైల్ విభాగాన్ని లీడ్ చేస్తున్నారు. ఇంతకు ముందు ఈనాడులో పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్లో జర్నలిజం శిక్షణ పొందారు.
జీవనశైలి

Latest Videos
Recommended Stories
Recommended image1
రూ. 30 వేల‌తో మొద‌లై నెల‌కు రూ. 30 ల‌క్ష‌లు.. అవినాష్ స‌క్సెస్ స్టోరీ, ఇలా చేస్తే మీకు కూడా సాధ్య‌మే
Recommended image2
Peacock Toe Rings: పాదాలకు నెమలి అందం.. రాయల్ లుక్ ఇచ్చే మెట్టెలు
Recommended image3
Gas Burner: గ్యాస్ త్వరగా అయిపోతోందా? అయితే బర్నర్‌ను వెంటనే ఇలా క్లీన్ చేయండి
Related Stories
Recommended image1
Snake Revenge: సినిమాల్లో చూపించినట్లు నిజంగా పాములు పగపడతాయా? మనుషులను గుర్తు పెట్టుకుంటాయా?
Recommended image2
Curd: పాలల్లో ఈ ఒక్క ఆకు వేస్తే.. పెరుగు గడ్డలా తోడుకుంటుంది, పుల్లగా కూడా మారదు
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved