MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Life
  • Cockroach: ఇదొక్కటి వేస్తే చాలు జీవితంలో బొద్దింకలు రావు

Cockroach: ఇదొక్కటి వేస్తే చాలు జీవితంలో బొద్దింకలు రావు

Cockroach: ఎంత శుభ్రం చేసినా వంటగదిలోకి, పడకగదిలోకి బొద్దింకలు వస్తూనే ఉంటాయి. బాత్‍రూం నుంచి ఎక్కువగా ఇంట్లోకి దూరిపోతాయి. అవి నడిచిన ఆహారం తినడం వల్ల రోగాలు పుట్టుకొస్తాయి. బొద్దింకల బెడద వదిలించుకోవాలంటే ఈ సింపుల్ చిట్కాలు పాటించండి.

2 Min read
Author : Nandini Arava
Published : Apr 11 2026, 05:01 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
19
బొద్దింకల బెడదకు ఇంటి చిట్కాలు
Image Credit : Getty

బొద్దింకల బెడదకు ఇంటి చిట్కాలు

వంటగది అంటే కేవలం వంట చేసే చోటు కాదు, ఇంటిల్లిపాది ఆరోగ్యం అక్కడే ఉంటుంది. వంటగదిలో చిన్నగా చెత్త ఉన్నా బొద్దింకల బెడద మొదలవుతుంది. ఒక్కటి వస్తే దానివెంట వందలు పుట్టుకొస్తాయి. ఎక్కడ చూసినా అవే కనిపిస్తాయి. బాత్‍రూం నుంచి వంటగదిలోకి, వండిన ఆహారంపైకి చేరడంతో అనారోగ్యానికి కారణమవుతుంది. బొద్దింకలే అని లైట్ తీసుకోకండి. టైఫాయిడ్ వచ్చే ప్రమాదముంది. అయితే ఎన్ని ట్రై చేసినా బొద్దింకల బెడద తప్పడం లేదా?

29
లవంగాలు
Image Credit : Getty

లవంగాలు

మార్కెట్లో దొరికే స్ప్రేలలో రసాయనాలు ఉంటాయి, అవి ప్రమాదకరం. అందుకే ఇంట్లోనే సహజ పద్ధతుల్లో బొద్దింకలను తరిమికొట్టొచ్చు. వంటల్లో వాడే లవంగాలు రుచిని పెంచడమే కాదు, బొద్దింకలను కూడా తరిమికొడతాయి. వాటి ఘాటైన వాసనను బొద్దింకలు భరించలేవు. వంటగది డ్రాయర్లు, క్యాబినెట్లలో ఓ 8-10 లవంగాలు పెట్టి చూడండి. ఆ వాసనకు బొద్దింకలు రావు.

Related Articles

Related image1
Cockroach Control: ఈ పదార్ధాలు చల్లారంటే బొద్దింకలు కిచెన్‌లోకి రావాలంటే భయపడతాయి
Related image2
Kitchen Hack: ఇకపై గ్యాస్ సమస్యకు చెక్, ఇదొక్కటి ఇంట్లో ఉంటే చాలు, నిమిషాల్లో వంట రెడీ
39
వంట సోడా, పంచదార
Image Credit : Getty

వంట సోడా, పంచదార

బేకింగ్ సోడా తిన్న వెంటనే బొద్దింకలు చనిపోతాయి. వంట సోడా, పంచదార పొడిని సమానంగా కలిపి వంటగది మూలల్లో, సింక్ కింద, క్యాబినెట్ల వెనుక చల్లాలి. పంచదార వాసనకు అక్కడికి వచ్చే బొద్దింకలు, బేకింగ్ సోడా తిని చనిపోతాయి.
49
వేపాకులు
Image Credit : Getty

వేపాకులు

వేపాకుల వాసన బొద్దింకలకు అస్సలు నచ్చదు. ఓ 5-6 వేపాకులను నలిపి వంటగది మూలల్లో పెట్టండి. ఈ వాసనకు బొద్దింకలు వెంటనే పారిపోతాయి.మీ ఇంట్లో బొద్దింకల సంఖ్య ఎక్కువగా ఉంటే, వేప నూనె వాడొచ్చు. వేప నూనెను నీటిలో కలిపి బొద్దింకలు ఉన్న చోట స్ప్రే చేయండి. లేదా వేప పొడిని కూడా బొద్దింకలు తిరిగే ప్రదేశాల్లో చల్లవచ్చు.

59
వెనిగర్
Image Credit : Getty

వెనిగర్

వంటగది నుంచి బొద్దింకలను తరిమికొట్టడానికి వెనిగర్ కూడా ఒక మంచి మార్గం. స్ప్రే బాటిల్‌లో వైట్ వెనిగర్, నీటిని సమానంగా కలపండి. రాత్రి వంటగది శుభ్రం చేశాక, గ్యాస్ స్టవ్, సింక్ చుట్టూ స్ప్రే చేయండి.
69
దాల్చినచెక్క
Image Credit : Getty

దాల్చినచెక్క

దాల్చినచెక్క కేవలం మసాలా దినుసు మాత్రమే కాదు, బొద్దింకలను నివారిస్తుంది కూడా. వంటగది మూలల్లో దాల్చినచెక్క పొడిని చల్లండి. దీని ఘాటైన వాసన బొద్దింకలు రాకుండా అడ్డుకుంటుంది.
79
నిమ్మరసం
Image Credit : Pixabay

నిమ్మరసం

నిమ్మరసం ఒక మంచి క్లీనింగ్ ఏజెంట్‌గా పనిచేస్తుంది. రెండు నిమ్మకాయల రసాన్ని ఒక బకెట్ నీటిలో కలిపి వంటగది నేలను తుడవండి. నిమ్మలోని సిట్రస్ వాసన, శుభ్రత.. బొద్దింకల సంతానోత్పత్తిని అడ్డుకుంటాయి.
89
పుదీనా నూనె
Image Credit : Asianet News

పుదీనా నూనె

పుదీనా నూనె వాసనను బొద్దింకలు అస్సలు భరించలేవు. నీటిలో కొన్ని చుక్కల పుదీనా నూనె కలిపి స్ప్రే చేయండి. వంటగదిలో ఈ వాసన రాగానే బొద్దింకలు అక్కడి నుంచి పారిపోతాయి.
99
దోసకాయ తొక్కలు
Image Credit : Getty

దోసకాయ తొక్కలు

మనం చెత్తలో పడేసే దోసకాయ తొక్కలు కూడా బొద్దింకలను తరిమికొట్టగలవు. దోసకాయ తొక్కలను ఒక అల్యూమినియం గిన్నెలో వేసి రాత్రంతా వదిలేయండి. దోసకాయ, అల్యూమినియం మధ్య జరిగే చర్య వల్ల వచ్చే వాసనను బొద్దింకలు భరించలేవు.

About the Author

NA
Nandini Arava
6 సంవత్సరాలుగా జర్నలిజంలో ఉన్నారు. 2019లో ఈటీవీతో కెరీర్ ప్రారంభించారు. తర్వాత పలు తెలుగు చానెళ్లలో ఛానెల్లో సబ్ ఎడిటర్ గా పనిచేశారు. ప్రస్తుతం ఏసియా నెట్ లో మల్టీమీడియా జర్నలిస్టుగా చేస్తున్నారు. ఈమె సినిమా, జీవనశైలి, తెలుగు రాష్ట్రాలకు సంబదించిన వార్తలు, విశ్లేషణలు చేయగలరు.
జీవనశైలి

Latest Videos
Recommended Stories
Recommended image1
Mini Thailand: ఇండియాలోనే మినీ థాయ్‌లాండ్.. ఈ సీక్రెట్ ప్లేస్ గురించి మీకు తెలుసా?
Recommended image2
Weight Loss: మంతెన చెప్పిన ఈ 30 డేస్ ఛాలెంజ్‍తో ఈజీగా వెయిట్ లాస్
Recommended image3
Health : ఆరోగ్యంగా ఉండే వ్యక్తి రోజుకు ఎన్నిసార్లు మూత్రవిసర్జన చేస్తాడు..? ఇంతకంటే ఎక్కువసార్లు చేస్తే..
Related Stories
Recommended image1
Cockroach Control: ఈ పదార్ధాలు చల్లారంటే బొద్దింకలు కిచెన్‌లోకి రావాలంటే భయపడతాయి
Recommended image2
Kitchen Hack: ఇకపై గ్యాస్ సమస్యకు చెక్, ఇదొక్కటి ఇంట్లో ఉంటే చాలు, నిమిషాల్లో వంట రెడీ
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved