MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Life
  • Cockroach Control: ఈ పదార్ధాలు చల్లారంటే బొద్దింకలు కిచెన్‌లోకి రావాలంటే భయపడతాయి

Cockroach Control: ఈ పదార్ధాలు చల్లారంటే బొద్దింకలు కిచెన్‌లోకి రావాలంటే భయపడతాయి

Cockroach Control: కిచెన్‌లో బొద్దింకలు చేరి ఎంతో ఇబ్బంది పెడతాయి. వాటి వల్ల ఆహార పదార్థాలు విషపూరితం అవుతాయి.  వాటిని తరిమికొట్టేందుకు కెమికల్ స్ప్రేలు వాడాల్సిన అవసరం లేకుండా ఇంట్లో దొరికే వస్తువులతోనే ఎలా తరిమికొట్టొచ్చో  తెలుసుకోండి.

2 Min read
Author : Haritha Chappa
Published : Apr 11 2026, 11:17 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
14
బొద్దింకల బెడదకు చెక్
Image Credit : social media

బొద్దింకల బెడదకు చెక్

ఇంట్లో వంటగది అంటేనే బొద్దింకలకు చాలా ఇష్టం. రకరకాల ఆహారాలు తింటూ తమ సంతానాన్ని పెంచుకుంటాయి. వంటగది కేవలం  వంట చేసే ప్రదేశం మాత్రమే కాదు, మన కుటుంబ ఆరోగ్యాన్ని నిర్ణయించే ప్రదేశం. కిచెన్‌లో చెత్త పేరుకుపోతే బొద్దింకలు వచ్చేస్తాయి. ఇవి టైఫాయిడ్, అలర్జీల వంటి ఎన్నో రోగాలకు కారణం అవుతాయి. వీటిని తరిమికొట్టడానికి స్ప్రేలు కొని  వాడతాం. వాటిలో ప్రమాదకరమైన రసాయనాలు ఉంటాయి. కాబట్టి వాటిని వాడడం ఏమాత్రం మంచిది కాదు. నిజానికి ఇంట్లో ఉండే సహజమైన పదార్థాలతోనే బొద్దింకలను తరిమికొట్టవచ్చు.

24
లవంగాలు
Image Credit : Getty

లవంగాలు

వంటగదిలో లవంగాలు ఉంటాయి. ఇవి బొద్దింకలను తరిమికొడతాయి. వాటి వాసన బొద్దింకలకు ఏమాత్రం నచ్చవు. కిచెన్ డ్రాయర్లు, కప్‌బోర్డులలో ఓ పది లవంగాలు వేసి ఉంచండి. ఆ వాసనకు బొద్దింకలు రావు. బేకింగ్ సోడాను బొద్దింక తిన్న వెంటనే చనిపోతుంది. వంటసోడా, పంచదార పొడిని సమానంగా కలిపి కిచెన్ మూలల్లో, సింక్ కింద, అలమరాల వెనుక చల్లండి. పంచదార వాసనకు వచ్చే బొద్దింక, బేకింగ్ సోడా తిని చనిపోతుంది. బిర్యానీ ఆకులు కూడా బొద్దింకలను తరిమేందుకు అద్భుతంగా పనిచేస్తాయి. బొద్దింకలకు వాటి వాసన నచ్చదు. ఓ ఆరు బిర్యానీ ఆకులను పొడి చేసి వంటగది మూలల్లో చల్లండి. ఈ వాసనకు బొద్దింకలు వెంటనే పారిపోతాయి.

Related Articles

Related image1
Private jet Cost: రామ్ చరణ్, అల్లు అర్జున్ కొన్న ప్రైవేట్ జెట్ ధర ఎంత? నెలకు ఎంత ఈఎమ్ఐ కట్టాలి?
Related image2
Raaka: రాకా.. ఈ పదం ఏ భాషకు చెందినది? అల్లు అర్జున్ సినిమాకు ఈ పేరే ఎందుకు పెట్టారు?
34
వేప నూనె
Image Credit : stockPhoto

వేప నూనె

ఇంట్లో బొద్దింకల సంఖ్య మరీ ఎక్కువగా ఉంటే వేప నూనె అద్భుతంగా పనిచేస్తుంది. వేప నూనెను నీటిలో కలిపి, బొద్దింకలు తిరిగే చోట స్ప్రే చేయండి. బొద్దింకలు ఉన్న చోట వేప పొడిని చల్లితే ఎంతో బాగా పనిచేస్తుంది. ఇకపై మీ కిచెన్ వైపు బొద్దింకలు అడుగులు కూడా వేయవు. అలాగే వెనిగర్ కూడా వంటగది నుంచి బొద్దింకలను తరిమికొట్టడానికి ఉపయోగపడుతుంది. తెల్ల వెనిగర్‌ను, నీటిని సమాన పరిమాణంలో ఒక స్ప్రే బాటిల్‌లో కలపండి. రాత్రికి కిచెన్ శుభ్రం చేశాక, గ్యాస్ స్టవ్, సింక్ చుట్టూ దీన్ని స్ప్రే చేయండి.  బొద్దింకలు దగ్గరకు రమ్మన్నా రావు.

44
నిమ్మరసం
Image Credit : stockPhoto

నిమ్మరసం

నిమ్మరసంలో సహజంగానే క్లీనింగ్ ఏజెంట్‌ లక్షణాలు ఎక్కువ.  రెండు నిమ్మకాయల రసాన్ని ఒక బకెట్ నీటిలో కలిపి వంటగది నేలను శుభ్రం చేయండి. నిమ్మలోని సిట్రస్ వాసన, శుభ్రత బొద్దింకల సంతానోత్పత్తిని అడ్డుకుంటాయి. దాల్చినచెక్కను కూడా ఇందుకోసం వాడవచ్చు.  వంటగది మూలల్లో దాల్చినచెక్క పొడిని చల్లండి. దీని వాసన బొద్దింకలకు ఏమాత్రం నచ్చదు. అలాగే పుదీనా నూనె వాసనను బొద్దింకలు తట్టుకోలేవు. నీటిలో కొన్ని చుక్కల పుదీనా నూనె కలిపి స్ప్రే చేయండి. కిచెన్‌లో పుదీనా నూనె స్ప్రే చేస్తే బొద్దింకలు బయటికి పారిపోతాయి. 

About the Author

HC
Haritha Chappa
హరిత ఏసియా నెట్‌లో చీఫ్ సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. జర్నలిజంలో పీజీ పూర్తి చేశారు. ఈనాడు, సమయం, ఆంధ్రజ్యోతి, ఏబీపీ నెట్ వర్క్, హిందూస్థాన్ టైమ్స్ లో పనిచేశారు. ప్రింట్, డిజిటర్ మీడియాలో 18 ఏళ్ల అనుభవం ఉంది. ఏసియా నెట్ లైఫ్ స్టైల్, బిజినెస్, ఓటీటీ మూవీ కంటెంట్, ఆస్ట్రాలజీ కంటెంట్ రాస్తారు.
జీవనశైలి
ఏషియానెట్ న్యూస్
ఏషియానెట్ న్యూస్ తెలుగు ఒరిజినల్స్

Latest Videos
Recommended Stories
Recommended image1
Gold Chain: 5 గ్రాముల్లోనే అదిరిపోయే చైన్లు..అక్షయ తృతీయకు కొనేయండి
Recommended image2
Relationship: 90 శాతం మందికి ప్రేమ‌కు అస‌లైన‌ అర్థం ఏంటో తెలియ‌దు.. మీకు తెలుసా.?
Recommended image3
Ice Cream : మీరు తినే ఐస్‌క్రీం ఫ్లేవర్‌తో మీ క్యారెక్టర్ ఏంటో చెప్పొచ్చు.. ఎలాగో తెలుసా..?
Related Stories
Recommended image1
Private jet Cost: రామ్ చరణ్, అల్లు అర్జున్ కొన్న ప్రైవేట్ జెట్ ధర ఎంత? నెలకు ఎంత ఈఎమ్ఐ కట్టాలి?
Recommended image2
Raaka: రాకా.. ఈ పదం ఏ భాషకు చెందినది? అల్లు అర్జున్ సినిమాకు ఈ పేరే ఎందుకు పెట్టారు?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved