Guru Shani Samyogam: గురు శని సంయోగంతో ఈ 4 రాశులవారికి చేతి నిండుగా డబ్బు
Guru Shani Samyogam: గురు శని సంయోగం కొన్ని రాశుల వారికి కలిసి వస్తుంది. ముఖ్యంగా 4 రాశుల వారికి అదృష్టాన్ని తెస్తుంది. 2026లో బృహస్పతి రెండుసార్లు తన రాశిని మార్చుకుంటాడు. శని ఏడాది పొడవునా మీనరాశిలోనే ఉంటాడు. వీరిద్దరి కలయిక ఎవరికి లాభిస్తుంది?

వృషభ రాశి
వృషభ రాశి వారికి 2026 కలిసొచ్చే కాలమనే చెప్పాలి. గురు, శని గ్రహ సంయోగం వల్ల మహాలక్ష్మి రాజయోగం ఏర్పడుతుంది. దీని వల్ల ఈ రాశి వారికి జీవితం మంచిగా స్థిరపడే అవకాశం ఉంది. మీరు తమ కెరీర్‌లో కొత్త శిఖరాలకు చేరుకుంటారు. వీరి ఆదాయం పెరిగే అవకాశం ఉంది. ఇక వ్యాపారస్తులకు మంచి లాభాలు కలిసొచ్చే సంవత్సరమనే చెప్పాలి.
మిథున రాశి
మిథున రాశి వారికి కొత్త ఏడాది బాగా కలిసొస్తుంది. ఈ కాలం వీరికి చాలా బాగుంటుందనే చెప్పాలి. ఇంతవరకు మీరు సాధించలేని లక్ష్యాలను ఈ ఏడాది సాధించే అవకాశం ఉంది. వీరికి గురుడు అంటే బృహస్పతి అనుకూలంగా ఉండటం వల్ల వీరికి శుభ యోగాలు ఏర్పడి అన్ని రకాలుగా కలిసివస్తుంది. ఒక కెరీర్ పరంగా, వ్యాపార పరంగా మంచి పురోగతి ఉంటుంది. వీరికి కొత్త ఆదాయ మార్గాలు వస్తాయి.
కర్కాటక రాశి
కర్కాటక రాశి వారికి ఈ కొత్త ఏడాది 2026 బాగా కలిసొచ్చే సంవత్సరం. వచ్చే ఏడాది జూన్‌లో బృహస్పతి మీ రాశిలోకి ప్రవేశించడం వల్ల గజకేసరి యోగం ఏర్పడుతుంది. ఈ యోగం ఈ రాశి వారి జీవితంలో ఆర్ధికంగా బాగా కలిసివస్తుంది. వీరికున్న ఆస్తి సమస్యలు కూడా తీరిపోతాయి. కుటుంబ జీవితం అద్భుతంగా ఉంటుంది.
తులా రాశి
తులారాశి వారికి 2026 మంచి ఫలితాలను అందిస్తుంది. మీనరాశిలోనే శని సంచారం జరుగుతుంది కాబట్టి ఎన్నో లాభాలు అందుతాయి. గతంలో అసంపూర్ణంగా ఉన్న పనులన్నీ పూర్తయ్యే అవకాశం ఉంది. ఇక పెళ్లికానికి ఇది ఉత్తమ సమయం. మంచి సంబంధాలు వచ్చి పెళ్లయ్యే అవకాశం ఉంది. ఇక కెరీర్, వ్యాపార పరంగా కూడా మంచి అభివృద్ధి చెందుతాయి. చేతి నిండా డబ్బు అందే అవకాశం ఉంది.

