MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Life
  • చలికాలం మీ డైట్‌లో ఈ పుడ్ కచ్చితంగా ఉండాల్సిందే.. ఓసారి చెక్‌ చేసుకోండి..

చలికాలం మీ డైట్‌లో ఈ పుడ్ కచ్చితంగా ఉండాల్సిందే.. ఓసారి చెక్‌ చేసుకోండి..

చలికాలం వ్యాధుల బారిన పడడం సర్వసాధారణం. ముఖ్యంగా జలుబు, జ్వరంతోపాటు జీర్ణశక్తి మందగిస్తుంది. అలాగే ఎండ సరిగ్గా లేకపోవడంతో విటమిన్‌ డీ లోపం తలెత్తుతుంది. ఇది కూడా రోగనిరోధక శక్తిని తగ్గిస్తుంది. దీంతో తరచూ వ్యాధుల బారిన పడుతుంటారు. అందుకే చలికాలంలో తీసుకునే ఆహారంలో కొన్ని మార్పులు చేసుకోవాలని నిపుణులు చెబుతున్నారు. ఇంతకీ ఆ మార్పులు ఏంటంటే..  

2 Min read
Author : Narender Vaitla
| Updated : Dec 25 2024, 04:32 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16

చలికాలం కచ్చితంగా ఆహారంలో కొన్ని మార్పులు చేసుకోవాలని నిపుణులు చెబుతున్నారు. మారిన వాతావరణంతో శరీరంలో జరిగే మార్పులకు అనుగుణంగా తీసుకునే ఆహారంలో మార్పులు చేసుకోవాలని చెబుతున్నారు. ఇంతకీ చలికాలం వ్యాధుల బారిన పడకుండా ఉండాలంటే కచ్చితంగా కొన్ని రకాల ఆహార పదార్థాలను డైట్‌లో భాగం చేసుకోవాలి. ఇంతకీ ఆ ఫుడ్స్‌ ఏంటి.? వీటివల్ల శరీరంలో ఎలాంటి మార్పులు జరుగుతాయో ఇప్పుడు తెలుసుకుందాం. 

26
నువ్వులు

నువ్వులు

చలికాలం తీసుకునే ఆహారంలో నువ్వులు ఉండేలా చూసుకోవాలని నిపుణులు చెబుతున్నారు. సాధారణంగా నువ్వులు శరీరంలో వేడిని పెంచుతాయని పెద్దలు సైతం చెబుతుంటారు. చలికాలంలో వచ్చే ఎమకలు, కీళ్లకు సంబంధించిన సమస్యలను దూరం చేయడంలో నువ్వులు ఉపయోగపడతాయి. మరీ ముఖ్యంగా బెల్లంలో నువ్వులను కలుపుకొని తీసుకుంటే చలికాలంలో జీర్ణ సంబంధిత సమస్యలను దూరం చేయడంలో సహాయపడుతుంది. శరీరంలో రక్తహీనతను నివారించడానికి నువ్వుల్ని మించింది లేదని నిపుణులు వెల్లడించారు.
 

36
చెరకు

చెరకు

వింటర్‌లో జీవక్రియలు మందగిస్తాయి. ఈ కారణంగా శరీరం నుంచి అదనపు కొవ్వులు, విషతుల్యాలు బయటికి వెళ్లకుండా శరీరంలోనే పేరుకుపోతాయి. ఇది ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం పడుతుంది. ముఖ్యంగా లివర్‌ ఆరోగ్యం దెబ్బతింటుందుని చెబుతున్నారు. అందుకే చెరకు రసం తీసుకోవాలని నిపుణులు చెబుతున్నారు. కాలేయ పనితీరును మెరుగుపరచడంలో చెరకు రసం కీలక పాత్ర పోషిస్తుంది. చెరకు రసంలోని ఆల్కలీన్‌ సమ్మేళనాలు శరీరంలో ఆమ్ల స్థాయుల్ని క్రమబద్ధీకరించడంలో ఉపయోగపడుతుంది. చలిగాలులకు చర్మం దెబ్బతినకుండా రక్షిస్తాయి. 

46
ఉసిరి

ఉసిరి

విటమిన్‌సికి పెట్టింది పేరైన ఉసిరిని కూడా ఆహారంలో భాగం చేసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. చలికాలంలో వచ్చే ఇన్ఫెక్షన్ల బారిన పడకుండా  ఉంచడంలో ఉసిరి కీలక పాత్ర పోషిస్తుంది. ఇందులోని విటమిన్‌ సి రోగనిరోధక శక్తిని పెంచడంలో కీలక పాత్ర పోషిస్తుంది. మలబద్ధకంతో పాటు ఇతర జీర్ణ సంబంధిత సమస్యలను దూరం చేస్తుంది. 
 

56
చింతపండు

చింతపండు

చలికాలంలో జీర్ణవ్యవస్థ మందగిస్తుంది. కాబట్టి ఈ సమస్యలను దూరం చేయడంలో చింతపండు దివ్యౌషధంగా పనిచేస్తుంది. ఇందులో ఉండే మెగ్నీషియం, క్యాల్షియం ఎముకలకు బలాన్ని చేకూర్చుతాయి. చింతపండులోని ఫ్లేవనాయిడ్స్‌, పాలీఫినోల్స్‌ బరువును కంట్రోల్ చేస్తుంది. ఇందులోని పాలీఫినోలిక్‌ సమ్మేళనాలు పేగుల్లో అల్సర్లు ఏర్పడకుండా రక్షిస్తాయి. చింతగింజల్ని పొడి చేసుకొని మజ్జిగలో కలుపుకొని తాగితే జీర్ణక్రియ మెరుగవుతుంది. 
 

66
ఇవి కూడా..

ఇవి కూడా..

చలికాలం జీర్ణవ్యవస్థ మెరుగ్గా ఉండాలంటే తీసుకునే ఆహారంలో ఫైబర్‌ కంటెంట్ ఎక్కువగా ఉండే ఫుడ్‌ను భాగం చేసుకోవాలని చెబుతున్నారు. వీటిలో ప్రధానంగా స్వీట్‌కార్న్‌, జామ, చిలగడదుంపలు ఉండేలా చూసుకోవాలి. ఇవి మలబద్ధకంతో పాటు, కడుపుబ్బరం, వంటి జీర్ణ సంబంధిత సమస్యలను దూరం చేస్తుంది. 

గమనిక: ఈ వివరాలు కేవలం ప్రాథమిక సమాచారం మేరకు మాత్రమే. ఆరోగ్యానికి సంబంధించి వైద్యుల సూచనలు పాటించడమే ఉత్తమం. 

About the Author

NV
Narender Vaitla
Narender Vaitla has over eight years of experience in print and digital media. He is currently working as a Senior Sub Editor at Asianet News.He began his journalism career in 2015 with the Sakshi newspaper. Later, in 2019, he worked as a Sub Editor in the digital division of Eenadu, and in 2020, he joined TV9 Telugu (Digital) as a Senior Sub Editor.He regularly writes news stories across sections such as lifestyle, technology, human interest, and related beats.
జీవనశైలి
ఆరోగ్యం
Latest Videos
Recommended Stories
Recommended image1
Chapati Recipes: రాత్రి మిగిలిన చపాతీలతో చేసే 5 టేస్టీ వంటలు
Recommended image2
Tomato: ఏడాది మొత్తం టమాటాలు ఎలా నిల్వ చేయాలో తెలుసా?
Recommended image3
Flower Anklet: ఫ్లోరల్ డిజైన్ లో అందమైన పట్టీలు
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved