MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Life
  • Fish: సముద్రపు చేప, నదిలో చేప... రెండింటిలో ఏది ఆరోగ్యానికి మంచిది?

Fish: సముద్రపు చేప, నదిలో చేప... రెండింటిలో ఏది ఆరోగ్యానికి మంచిది?

Fish: చేపలు ఆరోగ్యానికి చాలా మంచిది. ఈ చేపల్లో ప్రోటీన్లు, విటమిన్లు, ఖనిజాలు పుష్కలంగా ఉంటాయి. మరి, సముద్రపు చేపలు, నదిలో దొరికే చేపల్లో ఏది ఆరోగ్యానికి ఎక్కువ మంచిది?

2 Min read
Author : ramya Sridhar
Published : Aug 12 2026, 04:01 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
13
Fish
Image Credit : AI

Fish

మాంసాహారులు ఎక్కువగా ఇష్టపడే ఆహారాల్లో చేపలు ఎక్కువగా ఉంటాయి. అద్భుతమైన రుచితో పాటు శరీరానికి అవసరమైన విటమిన్లు, ప్రోటీన్లు, ఖనిజాలు, హెల్దీ ఫ్యాటీ యాసిడ్స్ వీటిలో పుష్కలంగా ఉంటాయి. అయితే, చేపలు కొనేటప్పుడు మనలో చాలా మందికి ఒక సందేహం వస్తూ ఉంటుంది. సముద్రపు చేపలు మంచివా? లేక నదీ చేపలు మంచివా? ఈ రెండింటిలో ఏది ఆరోగ్యానికి మంచిది? నిపుణులు ఏమంటున్నారు..?

చేప రకం, అది పెరిగే వాతావరణం, తినే ఆహారాన్ని బట్టి చేపల్లోని పోషకాల పరిమాణం మారిపోతూ ఉంటుంది. సముద్రపు చేపలు, నదిలో పెరిగే చేపలు ఈ రెండింటికీ ఉన్న తేడా ఏంటి? ఈ రెండింటిలో ఏది తింటే ఎక్కువ పోషకాలు అందుతాయో ఇప్పుడు చూద్దాం...

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
23
సముద్రపు చేపలు (Sea Fish)
Image Credit : AI

సముద్రపు చేపలు (Sea Fish)

సముద్రపు చేపలు ఆహార ప్రియులకు మాత్రమే కాకుండా, గుండె ఆరోగ్యానికి శ్రద్ధ తీసుకునే వారికి బెస్ట్ ఆప్షన్. ఇవి, గుండె ఆరోగ్యాన్ని కాపాడటంలో సహాయపడతాయి.

ఒమేగా-3 నిధి: సముద్రపు చేపలలో 'ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్లు' (EPA & DHA) చాలా ఎక్కువ మొత్తంలో ఉంటాయి. ఇవి మన గుండె, మెదడు, కంటి ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి.

నాణ్యమైన ప్రోటీన్ & మినరల్స్: వీటిలో సులభంగా జీర్ణమయ్యే ప్రోటీన్‌తో పాటు అయోడిన్, విటమిన్-డి, కాల్షియం, ఫాస్ఫరస్ వంటి ఖనిజాలు పుష్కలంగా లభిస్తాయి.

తీసుకోవాల్సిన జాగ్రత్త : షార్క్, స్వోర్డ్‌ఫిష్ వంటి పెద్ద సముద్రపు చేపలు ఎక్కువ కాలం జీవించడం వల్ల వాటి శరీరంలో 'పాదరసం' (Mercury) చేరుతుంది. ఇలాంటి చేపలను తినడం వల్ల వాటిలోని పాదరసం నరాల వ్యవస్థపై ప్రభావం చూపుతుంది. కాబట్టి గర్భిణులు, పాలిచ్చే తల్లులు, చిన్న పిల్లలు పెద్ద సముద్రపు చేపలకు దూరంగా ఉండటం మంచిది. చిన్న సముద్రపు చేపలు తినడం సురక్షితం.

33
నదీ చేపలు , మంచినీటి చేపలు (Freshwater Fish)
Image Credit : chatgpt

నదీ చేపలు , మంచినీటి చేపలు (Freshwater Fish)

మన ఊళ్లలో, మార్కెట్లలో సులభంగా లభించే నదీ, చెరువు చేపలకు కూడా ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి.

అద్భుతమైన ప్రోటీన్ వనరు: శరీర కండరాల నిర్మాణానికి, కణాల మరమ్మత్తుకు అవసరమైన అధిక నాణ్యత గల ప్రోటీన్ నదీ చేపల్లో పుష్కలంగా ఉంటుంది.

సురక్షితమైనవి (తక్కువ మెర్క్యురీ): సముద్రపు చేపలతో పోలిస్తే నదీ చేపలలో పాదరసం (Mercury) ఉండే ప్రమాదం చాలా తక్కువ. కాబట్టి గర్భిణులు, చిన్న పిల్లలతో సహా అందరూ వీటిని భయం లేకుండా తినవచ్చు.

ఎముకల పుష్టి: కోరమీను, బొచ్చె వంటి నదీ చేపలతో పాటు చిన్న మంచినీటి చేపలను ముళ్ళతో సహా తింటే శరీరానికి అధిక మొత్తంలో కాల్షియం లభిస్తుంది.

ఒమేగా-3 పరిమాణం: వీటిలో కూడా ఒమేగా-3 కొవ్వు ఆమ్లాలు ఉంటాయి, కానీ సముద్రపు చేపలతో పోలిస్తే వీటి పరిమాణం కాస్త తక్కువగా ఉంటుంది.

వండేటప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు:

ఎంత మంచి చేపనైనా సరే.. ఎక్కువ ఉప్పు వేసి, నూనెలో డీప్ ఫ్రై (Deep Fry) చేస్తే దానిలోని పోషకాలన్నీ నశిస్తాయి. పైగా ఆరోగ్యానికి హాని చేస్తాయి. అందుకే చేపల పులుసు, గ్రిల్డ్ లేదా తక్కువ నూనెతో స్టీమ్ చేసిన చేపలను తినడం ఆరోగ్యానికి ఎంతో మేలు.

ఒమేగా-3 కావాలనుకునే వారు సముద్రపు చేపలను, పాదరసం భయం లేని సురక్షితమైన ప్రోటీన్ కావాలనుకునే వారు నదీ చేపలను ఎంచుకోవచ్చు. ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని ఈ రెండింటినీ మార్చి మార్చి మీ ఆహారంలో భాగం చేసుకోవడమే ఉత్తమమైన మార్గం

About the Author

RS
ramya Sridhar
పది సంవత్సరాలుగా జర్నలిజంలో ఉన్నారు. 2017 నుండి ఆసియానెట్‌లో జర్నలిస్ట్‌గా పని చేస్తున్నారు. ప్రస్తుతం, లైఫ్‌స్టైల్ విభాగాన్ని లీడ్ చేస్తున్నారు. ఇంతకు ముందు ఈనాడులో పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్లో జర్నలిజం శిక్షణ పొందారు.
జీవనశైలి
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Hair Growth: జుట్టు వేగంగా పెరగాలంటే ప్రతిరోజూ ఇదొక్కటి చేస్తే చాలు
Recommended image2
Soya: సోయా బీన్స్ Vs సోయా చంక్స్.. రెండింటికీ తేడా ఏంటి? ఏది మంచిది?
Recommended image3
Blouse Designs:గ్రే కలర్ చీరకు పర్ఫెక్ట్ మ్యాచ్ అయ్యే బ్లౌజు డిజైన్లు
Related Stories
Recommended image1
Over Cooked Rice: అన్నం మరీ మెత్తగా అయ్యిందా? మళ్లీ పొడి పొడిగా మార్చేయచ్చు..!
Recommended image2
Potato: బంగాళదుంపలు తొందరగా మొలకెత్తుతున్నాయా? ఇలా చేస్తే మొలకలు రావు..!
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved