MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Life
  • Most Expensive Plant: బంగారం కంటే ఖరీదైన మొక్క ఇది, ఎక్కడ దొరుకుతుందో తెలుసా?

Most Expensive Plant: బంగారం కంటే ఖరీదైన మొక్క ఇది, ఎక్కడ దొరుకుతుందో తెలుసా?

Most Expensive Plant: మన దేశంలో అరుదుగా దొరికే ఒక్క మొక్క బంగారం కంటే విలువైనది మీకు తెలుసా? అచ్చం బంగారంలా మెరిసే ఈ ఆకులు మన దేశంలో ఎక్కడ దొరుకుతుందో తెలుసా?

2 Min read
Author : ramya Sridhar
Published : Aug 12 2026, 01:01 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
13
బంగారం కంటే విలువైన మొక్క..
Image Credit : Gemini AI

బంగారం కంటే విలువైన మొక్క..

ప్రపంచంలో అత్యంత విలువైన లోహం బంగారం అని మన అందరికీ తెలుసు. కానీ, మన దేశంలో బంగారం కంటే వెయ్యి రెట్లు విలువైన మొక్క ఒకటి ఉందని మీకు తెలుసా? ఈ మొక్క ఆకుల ధర వేలల్లో పలుకుతుంది. ఈ ఆకులను చైనా సైతం అక్రమంగా దొంగలించేసి..అక్రమంగా కూడా అమ్మేస్తున్నారు. ఆ మొక్క పేరే ‘మిష్మీ తీత’. అసలు ఈ మొక్క ఎక్కడ దొరుకుతుంది? దీనిలో ఉన్న స్పెషాలిటీ ఏంటి? దీనికి ఇంత విలువ ఎందుకు? ఆ వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం..

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
23
అరుదైన మొక్క..
Image Credit : Gemini AI

అరుదైన మొక్క..

మిష్మీతీత అనేది అరుదైన, అత్యంత విలువైన ఔషధ మొక్క. దీని శాస్త్రీయ నామం ‘క్యాప్టిస్ తీత’. ఇది మనకు హిమాలయాల్లో మాత్రం దొరుకుతుంది. దీని వేళ్లు చాలా చేదుగా ఉంటాయి. తీత అంటే.. ఈశాన్య ప్రాంత భాషల్లో చేదు అని అర్థం. అందుకే..దీనికి ఆ పేరు వచ్చింది. సంప్రదాయ ఆయుర్వేదం, చైనీస్ మెడిసిన్, ఈశాన్య భారత గిరిజన వైద్యంలో దీనిని చాలా రకాల వైద్యాలలో వాడతారు. ఈ మొక్క ఆకుల్లో బెర్బెరిన్ అనే ముఖ్యమైన రసాయనం ఉంటుంది. దీని వల్ల ఇది మలేరియా, కంటి సమస్యలు, కడుపు రుగ్మతలు, జ్వరం, బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్లను తగ్గించడానికి ఉపయోగపడుతుంది.

ఇది ఎక్కడ దొరుకుతుంది? ప్రధాన ప్రాంతం: ఇది భారతదేశంలోని ఈశాన్య రాష్ట్రమైన అరుణాచల్ ప్రదేశ్ లోని 'మిష్మీ కొండలు' (Mishmi Hills) ప్రాంతంలో ఎక్కువగా పెరుగుతుంది. అందుకే దీనికి 'మిష్మీ తీత' అనే పేరు వచ్చింది.

భౌగోళిక సరిహద్దులు: అరుణాచల్ ప్రదేశ్‌తో పాటు చైనాలోని టిబెట్ సరిహద్దు ప్రాంతాలలో, మిజోరాం, నాగాలాండ్ , మయన్మార్ సరిహద్దు అడవులలో కూడా ఇది చాలా అరుదుగా కనిపిస్తుంది.

వాతావరణం: ఇది సముద్ర మట్టానికి దాదాపు 2,000 నుండి 3,000 మీటర్ల ఎత్తులో, తేమ, చల్లదనం ఎక్కువగా ఉండే దట్టమైన సదాహరిత (Evergreen) అడవులలో మాత్రమే పెరుగుతుంది.

ఈ మొక్కకు భారీ డిమాండ్ ఉంది. అయితే, విపరీతమైన వాడకం, అక్రమ రవాణా, అడవుల నరికివేత కారణంగా.. ఇది ప్రస్తుతం అంతరించిపోతున్న జాతుల జాబితాలో ఈ మొక్క కూడా చేరిపోయింది. చాలా అరుదుగా మాత్రమే దొరుకుతోంది.

33
దీని ధర ఎంత ఉంటుంది?
Image Credit : Gemini AI

దీని ధర ఎంత ఉంటుంది?

భారత మార్కెట్‌లో మిష్మీతీత ధర దాని నాణ్యత, లభ్యతను బట్టి కిలోగ్రాముకు సుమారు ₹3,000 నుండి ₹9,000 వరకు ఉంటుంది.

సాధారణ హోల్‌సేల్ ధర: నాణ్యమైన ఎండిన వేళ్ల (Dry Roots) మార్కెట్ ధర సాధారణంగా కిలో ₹4,000 నుండి ₹5,000 మధ్య ఉంటుంది.

ప్యూర్/ఆర్గానిక్ గ్రేడ్: అత్యంత అరుదైన, ప్రాసెస్ చేసిన ఆర్గానిక్ మెడిసిన్ గ్రేడ్ వేళ్లు అయితే కిలో ₹8,000 - ₹9,000 లేదా అంతకంటే ఎక్కువ ధర పలుకుతాయి.

పౌడర్ / చిన్న ప్యాకెట్లు: రిటైల్‌గా పొడి (Powder) రూపంలో కొనుగోలు చేస్తే 100 గ్రాములకు రూ. 300 నుండి రూ. 500 వరకు ఉంటుంది. .

About the Author

RS
ramya Sridhar
పది సంవత్సరాలుగా జర్నలిజంలో ఉన్నారు. 2017 నుండి ఆసియానెట్‌లో జర్నలిస్ట్‌గా పని చేస్తున్నారు. ప్రస్తుతం, లైఫ్‌స్టైల్ విభాగాన్ని లీడ్ చేస్తున్నారు. ఇంతకు ముందు ఈనాడులో పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్లో జర్నలిజం శిక్షణ పొందారు.
జీవనశైలి
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Ear Chain Designs: మీ చెవులకు అందాన్ని తెచ్చే మాటీల డిజైన్లు..చూసేయండి
Recommended image2
Top Load Vs Front Load: ఈ రెండు వాషింగ్ మెషీన్లలో ఏది వాడితే కరెంట్ బిల్లు తక్కువ వస్తుంది?
Recommended image3
Salt vs Pink Salt: ఏ రంగు ఉప్పు ఆరోగ్యానికి మంచిది? ఎవరు ఏ ఉప్పు తినాలో తెలుసా?
Related Stories
Recommended image1
Skeleton Lake : ఈ నదిలో కుప్పలు తెప్పలుగా మానవ అస్థిపంజరాలు.. ఎవరివి ఇవన్నీ..?
Recommended image2
Blood River: నీళ్లు కాదు.. రక్తం ఏరులైపారే నది మన దేశంలో ఎక్కడ ఉందో తెలుసా?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved