MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Life
  • Hair Care Tips: దువ్వెన వల్ల జుట్టు రాలుతుందా? చాలామంది చేసే 5 తప్పులు ఇవే!

Hair Care Tips: దువ్వెన వల్ల జుట్టు రాలుతుందా? చాలామంది చేసే 5 తప్పులు ఇవే!

Hair Care Tips: అందమైన, ఒత్తైన జుట్టు ఉండాలని అందరూ కోరుకుంటారు. కానీ ఈ రోజుల్లో వయసుతో సంబంధం లేకుండా చాలామంది జుట్టు రాలే సమస్యతో బాధపడుతున్నారు. జుట్టుకు వాడే దువ్వెన వల్ల జుట్టు రాలుతుందా అనే డౌట్ చాలామందిలో ఉంటుంది. ఇక్కడ క్లియర్ చేసుకుందాం.

2 Min read
Author : Kavitha G
Published : Jun 22 2026, 02:52 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
17
దువ్వెన వల్ల జుట్టు రాలుతుందా?
Image Credit : Getty

దువ్వెన వల్ల జుట్టు రాలుతుందా?

ప్రస్తుతం చాలామందిని వేధిస్తున్న సమస్యల్లో జుట్టు రాలడం ఒకటి. వాతావరణ కాలుష్యం, ఒత్తిడి, పోషకాహార లోపం, హార్మోన్ల మార్పులు వంటివి జుట్టు రాలడానికి కారణమవుతున్నాయి. అయితే చాలామంది పట్టించుకోని మరో కారణం రోజూ వాడే దువ్వెన. ఇది నేరుగా జట్టు రాలడానికి కారణం కాకపోయినా, దాన్ని తప్పుగా ఉపయోగించడం వల్ల జుట్టు తెగిపోవడం, బలహీనపడటం, హెయిర్ ఫాల్ మరింత పెరగడం వంటి సమస్యలు తలెత్తవచ్చు. ముఖ్యంగా చాలామంది తెలియక చేసే కొన్ని పొరపాట్లు జుట్టు ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావం చూపుతాయి. అవేంటో ఇక్కడ చూద్దాం.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
27
తడి జుట్టును బలంగా దువ్వడం
Image Credit : Getty

తడి జుట్టును బలంగా దువ్వడం

జుట్టు తడిగా ఉన్నప్పుడు దాని కుదుళ్లు చాలా సున్నితంగా ఉంటాయి. ఈ సమయంలో చిక్కులు తొలగించడానికి బలంగా దువ్వితే వెంట్రుకలు తెగిపోయే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అందుకే జుట్టు పూర్తిగా ఆరిన తర్వాత వెడల్పాటి పళ్లున్న దువ్వెనతో మెల్లగా దువ్వడం మంచిది. ముఖ్యంగా పొడవాటి జుట్టు ఉన్నవారు చివర్ల నుంచి ప్రారంభించి క్రమంగా పై భాగం వరకు దువ్వుకోవాలి.

Related Articles

Related image1
Parenting: పిల్లల మెదడును నాశనం చేసే టాప్ 5 తప్పులు ఇవే! పేరెంట్స్ కచ్చితంగా తెలుసుకోవాలి
Related image2
Tamarind Leaves: చింత చిగురు తింటే ఎన్ని లాభాలో తెలుసా? ఒక్కసారైనా తినాల్సిందే!
37
జుట్టు రకానికి సరిపోని దువ్వెన
Image Credit : Getty

జుట్టు రకానికి సరిపోని దువ్వెన

ప్రతి ఒక్కరి జుట్టు ఒకే విధంగా ఉండదు. కొందరికి మందంగా, మరికొందరికి పలుచగా, ఇంకొందరికి కర్లీ లేదా వేవీ హెయిర్ ఉంటుంది. కానీ చాలా మంది ఏదో ఒక దువ్వెనను ఏళ్ల తరబడి వాడేస్తుంటారు. కర్లీ హెయిర్ ఉన్నవారు సన్నని పళ్లున్న దువ్వెన వాడితే జుట్టు ఎక్కువగా రాలుతుంది. అలాగే చిక్కులు ఎక్కువగా ఉండే జుట్టుకు వెడల్పాటి పళ్లున్న దువ్వెన అనుకూలంగా ఉంటుంది. సరైన దువ్వెన ఎంపిక జుట్టు రాలిపోవడాన్ని తగ్గించడంలో కీలక పాత్ర పోషిస్తుంది.

47
దువ్వెనను క్లీన్ చేయకపోవడం
Image Credit : instagram

దువ్వెనను క్లీన్ చేయకపోవడం

చాలామంది రోజూ దువ్వెన వాడుతారు కానీ.. దాన్ని శుభ్రం చేయడం మాత్రం మరిచిపోతారు. దువ్వెనలో పేరుకుపోయే దుమ్ము, నూనె, మృత కణాలు, జుట్టు అవశేషాలు తల చర్మంపై మళ్లీ చేరే అవకాశం ఉంటుంది. దీనివల్ల స్కాల్ప్ దెబ్బతిని చుండ్రు, దురద వంటి సమస్యలు వచ్చే ప్రమాదం ఉంది. నిపుణుల ప్రకారం వారానికి కనీసం ఒకసారి దువ్వెనను గోరువెచ్చని నీటితో, మృదువైన షాంపూతో శుభ్రం చేయడం మంచిది.

57
చిక్కుల జుట్టును బలంగా దువ్వడం.
Image Credit : our own

చిక్కుల జుట్టును బలంగా దువ్వడం.

ఉదయం లేచిన వెంటనే లేదా బయట నుంచి వచ్చిన తర్వాత జుట్టులో చిక్కులు ఏర్పడటం సహజం. అయితే వాటిని ఓపిక లేకుండా ఒక్కసారిగా లాగి దువ్వడం వల్ల వెంట్రుకలపై అధిక ఒత్తిడి పడుతుంది. ఇది హెయిర్ బ్రేకేజ్‌కు ప్రధాన కారణంగా మారుతుంది. చిక్కులు ఉన్నప్పుడు ముందుగా చేతులతో లేదా డిటాంగ్లింగ్ స్ప్రే సహాయంతో వాటిని కొద్దికొద్దిగా విడదీసి, ఆ తర్వాత మెల్లగా దువ్వాలి.

67
ఇతరుల దువ్వెన వాడటం
Image Credit : Getty

ఇతరుల దువ్వెన వాడటం

కుటుంబ సభ్యులు అందరూ ఒకే దువ్వెన వాడటం చాలా ఇళ్లలో సాధారణంగా కనిపిస్తుంది. అయితే నిపుణుల ప్రకారం ఇది మంచి అలవాటు కాదు. దువ్వెనల ద్వారా చుండ్రు, ఫంగల్ ఇన్ఫెక్షన్లు, పేలు వంటి సమస్యలు ఒకరి నుంచి మరొకరికి వ్యాపించే అవకాశం ఉంటుంది. అందుకే ప్రతి ఒక్కరూ సపరేట్ దువ్వెన వాడటం మంచిది.

77
ఇవి మర్చిపోవద్దు
Image Credit : Getty

ఇవి మర్చిపోవద్దు

నిపుణుల ప్రకారం రోజుకు 50 నుంచి 100 వెంట్రుకలు రాలడం సాధారణమే. దువ్వేటప్పుడు కొన్ని వెంట్రుకలు రాలడం చూసి భయపడాల్సిన అవసరం లేదు. కానీ జుట్టు అసాధారణంగా రాలితే వైద్యులను సంప్రదించడం మంచిది. అలాగే జుట్టు ఆరోగ్యంగా ఉండాలంటే సరైన షాంపూ, సమతుల్య ఆహారం, తగినంత నీరు, మంచి నిద్రతో పాటు దువ్వెనను సరిగ్గా ఉపయోగించడం కూడా ముఖ్యం.

About the Author

KG
Kavitha G
8 సంవత్సరాలుగా జర్నలిజంలో ఉన్నారు. 2016లో ఈటీవీతో కెరీర్ ప్రారంభించారు. ప్రస్తుతం ఏసియానెట్‌లో ఫ్రీలాన్స్ జర్నలిస్ట్‌గా పని చేస్తున్నారు.
సౌందర్యం
జీవనశైలి
ఏషియానెట్ న్యూస్

Latest Videos
Recommended Stories
Recommended image1
Handbag Designs: మినీ హ్యాండ్‌ బ్యాగ్స్.. అదిరిపోయే లుక్ మీ సొంతం!
Recommended image2
Silver Nose Pin: ఈ వెండి ముక్కుపుడకలతో మీ అందం రెట్టింపు కావడం పక్కా!
Recommended image3
Kitchen Cabinets: ఈ కలర్ కాంబినేషన్ తో మీ కిచెన్ లుక్కే మారిపోతుంది
Related Stories
Recommended image1
Parenting: పిల్లల మెదడును నాశనం చేసే టాప్ 5 తప్పులు ఇవే! పేరెంట్స్ కచ్చితంగా తెలుసుకోవాలి
Recommended image2
Tamarind Leaves: చింత చిగురు తింటే ఎన్ని లాభాలో తెలుసా? ఒక్కసారైనా తినాల్సిందే!
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved