MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Life
  • Soap Hacks: మిగిలిన సబ్బు ముక్కలు పడేస్తున్నారా? ఏమేం చేయొచ్చో తెలుసా?

Soap Hacks: మిగిలిన సబ్బు ముక్కలు పడేస్తున్నారా? ఏమేం చేయొచ్చో తెలుసా?

Soap Hacks: ఇంటిలో మిగిలిపోయే సబ్బు ముక్కల్ని ఇక పారేయకండి. ఈ చిట్కాలు పాటిస్తే ఇల్లంతా సువాసనలు వెదజల్లుతాయి. ఇక నుంచి రూమ్ స్ప్రే, ఎయిర్ ఫ్రెషనర్ ఖర్చు తగ్గుతుంది. ఇలా చేసి ఆశ్చర్యపరిచే ప్రయోజనాలు వస్తాయి. 

2 Min read
Rajesh K
Published : Jul 02 2025, 04:03 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
18
హ్యాండ్ వాష్ తయారీ:
Image Credit : stockPhoto

హ్యాండ్ వాష్ తయారీ:

వాడి పారేసిన సబ్బు ముక్కలతో సులభంగా హ్యాండ్ వాష్ తయారుచేసుకోవచ్చు. చిన్న సబ్బు ముక్కల్ని వేడి నీటిలో నానబెట్టి కరిగించాలి. తరువాత దాన్ని సీసాలోకి పోసి, అవసరమైతే కొంత నీరు కలిపి బాగా కుదిపితే హ్యాండ్ వాష్ సిద్ధం. ఈ హ్యాండ్ వాష్‌ను కిచెన్‌, బాత్రూంలో ఉపయోగించవచ్చు. వీటిని ఉపయోగించి, జెర్మ్ కిల్లర్ లిక్విడ్స్‌ కొనే ఖర్చును తగ్గించుకోవచ్చు.

28
 సబ్బుల తయారీ
Image Credit : stockPhoto

సబ్బుల తయారీ

వాడి పాడేసిన చిన్న సబ్బు ముక్కలతో కొత్త సబ్బులను తయారు చేయవచ్చు. అదేలాగంటే.. వివిధ రకాల సబ్బులను తురిమి లేదా ముక్కలుగా చేసి, కొద్దిగా నీటితో తక్కువ మంటపై వేడి చేసి కరిగించాలి. ఇందులో మీకు నచ్చిన ఎసెన్షియల్ ఆయిల్ వేసి బాగా కలిపి అచ్చులో పోసి చల్లారనివ్వండి. కొన్ని గంటల్లో కొత్త సబ్బు సిద్ధం అవుతుంది. ఈ రీసైకిల్ చేసిన సబ్బు మీరు స్వయంగా వాడుకోవచ్చు, లేదా బహుమతిగా ఇవ్వవచ్చు.  ఇది పర్యావరణానికీ మేలు, ఇలా సబ్బుల ఖర్చులను తగ్గించుకోవచ్చు.

Related Articles

Related image1
Soap on Face: ముఖానికి సబ్బు రాయకూడదా?
Related image2
Soap Usage: గడువు తీరిన సబ్బు వాడితే ఏం జరుగుతుందో తెలుసా?
38
 సువాసనను తరిమికొట్టండిలా..
Image Credit : stockPhoto

సువాసనను తరిమికొట్టండిలా..

దుస్తుల అలమారాలు, డ్రాయర్లు, లాక్ చేసిన పెట్టెలో ముతక వాసన తప్పించుకోవాలంటే.. చిన్న సబ్బు ముక్కల్ని ఒక పలుచని గుడ్డలో చుట్టి లేదా చిన్న జాడీలో వేసి ఉంచండి. ఇది కీటకాలను దూరంగా ఉంచడమే కాకుండా, దుస్తులకు తాజా సువాసనను ఇస్తాయి. వర్షాకాలంలో వచ్చే బూజు వాసనను నివారించడంలో ఇది చాలా ఉపయోగకరంగా ఉంటాయి. ఈ పద్ధతిని కార్లలో కూడా ప్రయత్నించవచ్చు. తక్కువ ఖర్చుతో, సహజంగా చక్కటి ఫ్రెష్‌నెస్‌ను పొందవచ్చు.

48
ఈ సమస్యల పరిష్కారం
Image Credit : stockPhoto

ఈ సమస్యల పరిష్కారం

డ్రాయర్లు, కిటికీలు తెరవడానికి కష్టంగా ఉన్నప్పుడు, వాటి అంచులు లేదా చీలికలపై చిన్న సబ్బు ముక్కను రుద్దడం ద్వారా సమస్యను తాత్కాలికంగా పరిష్కరించవచ్చు. సబ్బు మృదుత్వం వల్ల గలిసిన భాగాలు సజావుగా కదులుతాయి. ఇదే పద్ధతిని కిటికీల నెట్లకు కూడా ఉపయోగించవచ్చు. ఇలా చేయడం వల్ల అవి సులభంగా తెరుచుకుంటాయి, మూయవచ్చు. తక్కువ ఖర్చుతో ఈ సమస్యకు పరిష్కారించుకోవచ్చు. 

58
షేవింగ్ క్రీమ్ గా
Image Credit : stockPhoto

షేవింగ్ క్రీమ్ గా

అత్యవసర సమయంలో షేవింగ్ క్రీం అందుబాటులో లేకపోతే, ఒక చిన్న సబ్బు ముక్కను నీటిలో తడిపి ముఖానికి రుద్దడం ద్వారా తేలికైన నురగను పొందవచ్చు. ఇది షేవింగ్‌కు తగిన మృదుత్వాన్ని ఇస్తుంది. ఈ విధానాన్ని ఉపయోగించడంతో షేవింగ్ సబ్బు లేదా క్రీం కొనుగోలు ఖర్చు తగ్గించుకోవచ్చు.  

68
టైల్స్ క్లీనర్ గా
Image Credit : stockPhoto

టైల్స్ క్లీనర్ గా

టాయిలెట్, వాష్‌బేసిన్, టైల్స్ శుభ్రపరచడానికి చిన్న సబ్బు ముక్కలు చక్కగా ఉపయోగపడతాయి. వీటిని నీటిలో నానబెట్టి, ఆ నీటితో శుభ్రం చేస్తే మరకలు పోతాయి. అలాగే, దుమ్ము, బాక్టీరియా, జెర్మ్స్‌ను తొలగించడంలో సహాయపడతాయి. బాత్రూం శుభ్రం చేసిన తరువాత ఒక చిన్న సబ్బు ముక్కను మూలలో ఉంచితే, అది ి తాజాగా ఉంచి, దుర్వాసన నివారిస్తుంది. 

78
టైలరింగ్ పనులకు:
Image Credit : stockPhoto

టైలరింగ్ పనులకు:

టైలరింగ్ చేసేటప్పుడు బట్టలపై గుర్తులు పెట్టుకోవడానికి పెన్సిల్ కి బదులుగా ఎండిన సబ్బు ముక్కల్ని వాడొచ్చు. సబ్బు గుర్తు సులభంగా చెరిగిపోతుంది, అలాగే బట్టపై మరకలు ఉండవు. ఇది టైలర్లకు చక్కని చిట్కా.

88
గోళ్ళ శుభ్రతకు:
Image Credit : stockPhoto

గోళ్ళ శుభ్రతకు:

తోటలో పనిచేసిన తర్వాత లేదా మురికి పనులు చేసిన తర్వాత, గోళ్ళ చీలికల్లో చేరే మురికిని తొలగించడానికి, ఒక చిన్న సబ్బు ముక్కను నీటిలో తడిపి, బ్రష్ సాయంతో గోళ్ళను శుభ్రం చేసుకోవచ్చు. ఆ సబ్బు నీరు సులభంగా మురికిని తొలగిస్తుంది, ఇది చిన్న మార్పు అయినా, దీర్ఘకాలంలో పెద్ద లాభం చేకూరుస్తుంది. ఈ చర్య పర్యావరణ రక్షణలో భాగమని చెప్పవచ్చు. 

About the Author

RK
Rajesh K
రాజేశ్ కారంపూరి: ఆరు సంవత్సరాలుగా ప్రముఖ ప్రింట్, డిజిటల్, వెబ్ మీడియా సంస్థల్లో సబ్ ఎడిటర్ గా రాణించారు. ప్రధానంగా పొలిటికల్ తో పాటు ఎడ్యుకేషన్, సినిమా, స్పోర్ట్స్ విభాగాల్లో పని చేసిన అనుభవం ఉంది. ప్రస్తుతం ఏసియానెట్‌ తెలుగులో ఫ్రీలాన్సర్ గా పని చేస్తున్నారు.
జీవనశైలి
ఏషియానెట్ న్యూస్
మహిళలు
ఆరోగ్యం
పురుషులు

Latest Videos
Recommended Stories
Recommended image1
Silver Chain: వెయ్యి రూపాయల్లో వెండి చైన్.. లేటెస్ట్ డిజైన్స్ ఇవిగో
Recommended image2
ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు నిర్లక్ష్యం చేయొద్దు.. చాలా ప్రమాదం
Recommended image3
Colon Cancer: 30 ఏళ్ల త‌ర్వాత ఈ ల‌క్ష‌ణాలు కనిపిస్తున్నాయా.? క్యాన్స‌ర్ కావొచ్చు
Related Stories
Recommended image1
Soap on Face: ముఖానికి సబ్బు రాయకూడదా?
Recommended image2
Soap Usage: గడువు తీరిన సబ్బు వాడితే ఏం జరుగుతుందో తెలుసా?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2025 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved