Soap Usage: గడువు తీరిన సబ్బు వాడితే ఏం జరుగుతుందో తెలుసా?
Soap Usage: వస్తువుల లేబుల్స్ చదవడం తినదగిన ఉత్పత్తులకు మాత్రమే కాదు, మీరు మీ శరీరంపై ఉపయోగించే ఉత్పత్తులకు కూడా అత్యంత ముఖ్యం. మీకు ఇప్పటికే గడువు తేదీ (Expiry) గురించి తెలుసు కాబట్టి.. గడువు ముగిసిన సబ్బును ఉపయోగించినప్పుడు ఏమవుతుందో నిపుణుల నుంచి తెలుసుకుందాం.
- FB
- TW
- Linkdin
Follow Us
)
పాడైపోయే వస్తువుల (perishable goods) కంటే భిన్నంగా, సబ్బు కాలక్రమేణా “పాడవదు లేదా చెడిపోదు” అని నిపుణులు అంటున్నారు. అయితే, దాని “ప్రభావం” తగ్గిపోవచ్చు. అదనంగా, దాన్ని ఎలా నిల్వ చేశారు.. ఎలా ఉపయోగిస్తున్నాము అనే విషయం కీలకం అవుతుంది.
గడువు ముగిసిన సబ్బులను ఉపయోగించడం వల్ల చర్మ సమస్యలు ఏర్పడే అవకాశం ఉందని డాక్టర్ కరుణ మల్హోత్రా, (ఏస్తెటిక్స్ ఫిజిషియన్ కాస్మెటోలజిస్ట్, కాస్మెటిక్ స్కిన్ అండ్ హోమియో క్లినిక్) చెప్పారు.
“కాలానుగుణంగా, సబ్బుల ప్రభావం తగ్గిపోయే అవకాశం ఉంది, ముఖ్యంగా బ్యాక్టీరియాను నిరోధించే లక్షణాలు తగ్గిపోతాయి. అంతేకాకుండా, దాని మిశ్రమ పదార్థాల మార్పుల వల్ల pH స్థాయిల్లో మార్పులు రావచ్చు” అని డాక్టర్ మల్హోత్రా వివరించారు.
ఇది చర్మంలో సమస్యలు కలిగించవచ్చు. ముఖ్యంగా సున్నితమైన చర్మం కలవారికి ఎక్కువ సమస్యలుంటాయి. అదనంగా, గడువు ముగిసిన ఉత్పత్తులు బ్యాక్టీరియా లేదా ఫంగస్ పెరుగుదలకూ కారణమై, ఇన్ఫెక్షన్లు వచ్చే అవకాశాన్ని పెంచుతాయని డాక్టర్ మల్హోత్రా అన్నారు.
సబ్బు గడువు ముగిసిందని ఎలా గుర్తించాలి?
మీ సబ్బు బార్ గడువు ముగిసిందో లేదో తెలుసుకోవడానికి, రంగు ఫేడవడం, సువాసన తగ్గిపోవడం వంటి లక్షణాలను గమనించాలి. మీ సబ్బు మీద ఫంగస్ కనిపించినట్లయితే, దాన్ని వెంటనే పారేయడం మంచిది.
సబ్బును సరిగ్గా నిల్వచేస్తే, అది గడువు ముగిసినప్పటికీ ఉపయోగపడే అవకాశం ఉంటుంది. అయితే, దీని సువాసన కాలక్రమేణా తగ్గిపోవచ్చు.
ఎలా జాగ్రత్తలు తీసుకోవాలి?
రిస్క్‌ను తగ్గించుకోవడానికి, డాక్టర్ మల్హోత్రా సున్నితమైన, పరిమళ రహిత సబ్బులను ఉపయోగించాలన్నారు. గడువు ముగిసిన ఉత్పత్తులను పారేయాలని సూచించారు. చర్మ సమస్యలకు గురయ్యే వ్యక్తులు, ముఖ్యంగా ఫంగల్ ఇన్ఫెక్షన్లు లేదా పొడి చర్మం ఉన్నవారు, పాత లేదా ప్రభావం కోల్పోయిన ఉత్పత్తులను వాడకూడదు. ఇవి వారి చర్మ సంరక్షణకు మరింత కీలకం అవుతుందని డాక్టర్ మల్హోత్రా తెలిపారు.
సబ్బును సరిగ్గా నిల్వచేయడం వల్ల దీర్ఘకాలం వస్తుంది. డాక్టర్ మల్హోత్రా చెబుతున్న వివరాల ప్రకారం, తేమ తక్కువగా ఉండే ప్రదేశంలో దానిని ఉంచడం వల్ల ఫంగస్ పెరుగుదలను నివారించవచ్చు.
ఇది కూడా చదవండి రూపాయి ఖర్చు లేకుండా మోచేతులు, మోకాళ్లలో నలుపు పోయే సింపుల్ టిప్స్ ఇవిగో