ఇద్దరూ సెక్స్ ను ఎంజాయ్ చేసేవారు ఇలా ఉంటారు..
భార్యా భర్తలు ఆనందంగా ఉండాలంటే ముందుగా వారి సెక్స్ లైఫ్ బాగుండాలి. అప్పుడే వారు కలిసి జీవిస్తారు. ప్రతి మూమెంట్ ను ఎంజాయ్ చేస్తారు. అంతేకాదు సెక్స్ ను మరింత ఎంజాయ్ చేసేందుకు కొత్త కొత్త మార్గాలను వెతుక్కుంటారు.
లైంగికంగా అనుకూలంగా ఉండే జంటలు వారి సెక్స్ లైఫ్ కు మరింత మసాలా జోడించేందుకు కొత్త కొత్త సెక్స్ పొజీషన్స్ ను ట్రై చేస్తుంటారు. అలాగే దాని గురించి నిర్మొహమాటంగా ఇద్దరూ మాట్లాడుకుంటారు. లైంగికంగా అనుకూలంగా ఉండే జంటలు సంతృప్తికరమైన, ఆనందకరమైన లైంగిక జీవితాన్ని పొందేందుకు ఎంతో కృషి చేస్తారు. అసలు మీరు ఈ జంటల కిందికే వస్తారా? రారా? తెలుసుకునేందుకు అలాంటి జంటలు చేసే కొన్ని పనుల గురించి ఇప్పుడు తెలుసుకుందాం..
![article_image2](https://static-ai.asianetnews.com/images/01gpzgdgjm1pz4q2g3zrd11r5k/8-benefits-of-doing-sex-in-the-morning_300x169xt.jpg)
నిర్మొహమాంటంగా, నిజాయితీగా కమ్యూనికేట్ చేయడం
లైంగిక జీవితం సాఫీగా సాగే జంటలు చేసే అతిముఖ్యమైన పనుల్లో ఓపెన్ గా కమ్యూనికేట్ కావడం ఒకటి. లైంగికంగా అనుకూలంగా ఉండే జంటలు వారి కోరికలను, ఫాంటసీలను, సెక్స్ పొజీషన్స్ గురించి భాగస్వామితో మాట్లాడటానికి అస్సలు భయపడరు. తమ లైంగిక కోరికలను చర్చించడానికి కొంత సమయాన్ని కేటాయిస్తారు. ముఖ్యమైన విషయాల్లో దీన్ని కూడా ఒకటిగా భావిస్తారు. ఒకరి మాటలను ఇంకొకరు శ్రద్ధగా వింటారు. వారి అవసరాలను మరొకరు అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తారు.
ప్రయోగాలు చేస్తారు.. కొత్త విషయాలను ప్రయత్నిస్తారు
ఈ జంటలు కొత్త వాటిని ప్రయత్నించడానికి, లైంగిక ఆనందాన్ని పొందేందుకు ఇద్దరూ ప్రయత్నిస్తారు. ఇలాంటి వారు తమ లైంగిక జీవితాన్ని ఉత్తేజకరంగా ఉంచడానికి కొత్త భంగిమలను, సెక్స్ టాయ్స్ ను, లేదా ఫాంటసీలతో ప్రయోగాలు చేయడానికి ప్రయత్నిస్తారు. అంతేకాదు ఇద్ధరికీ కంఫర్ట్ గా అనిపించిన వాటినే ట్రై చేస్తారు. ఇవి వీరిని మరింత ఆనందంగా ఉంచేందుకు సహాయపడతాయి.
లైంగిక ఆనందానికి ప్రాధాన్యతనిస్తారు
ఈ జంటలు ఎప్పుడూ కూడా ఒకరికొకరు మంచి అనుభూతిని, ఆనందాన్ని కలిగించడానికే ఎక్కువ ప్రాధాన్యతనిస్తారు. వీరు ఒకరి అవసరాలు, కోరికల పట్ల శ్రద్ధ వహిస్తారు. లైంగిక ఆనందాన్ని ఇద్దరూ పొందేందుకు కలిసి పనిచేస్తారు. సెక్స్ లో ఒకరినొకరు ఆనందంగా ఉంచడానికి వివిధ మార్గాలను ట్రై చేస్తుంటారు.
ఒకే రకమైన లైంగిక విలువలను కలిగుంటారు
లైంగికంగా అనుకూలంగా ఉండే జంటలు ఒకే రకమైన లైంగిక విలువలను, నమ్మకాలను కలిగి ఉంటారు. అంతేకాదు ఒకేరకమైన లైంగిక కోరికలను కలిగి ఉంటారు. అలాగే వారి సెక్స్ కోరికలను పంచుకుంటారు. ఇతరుల పట్ల ఆకర్షితులు కారు. ముఖ్యంగా వేరేవాళ్లతో సెక్స్ లో పాల్గొనాలనుకోరు. ఒకరి సరిహద్దులను మరొకరు గౌరవించుకుంటారు. ఎక్కడైనా సమస్య వస్తే ముందుగా దాన్ని పరిష్కరించుకుంటారు.
sex
బలమైన భావోద్వేగ సంబంధాన్ని కలిగి ఉంటారు
ఈ రకమైన జంటలు బలమైన భావోద్వేగ సంబంధాన్ని కలిగి ఉంటారు. ఇది ఒకరినొకరు బలంగా, సన్నిహితంగా ఉండటానికి సహాయపడుతుంది. ఇలాంటి వారు ఒకరినొకరు బాగా నమ్ముతారు. ఇరువురి మధ్య భావోద్వేగ బంధాన్ని బలోపేతం చేయడానికి కౌగిలింత, ముద్దులకు ఎక్కువ ప్రాధాన్యతనిస్తారు.