MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Life
  • Instant Mango Pickle: ఈ సింపుల్ టిప్స్ తో మామిడికాయ పచ్చడిని అప్పటికప్పుడు తయారు చేసుకోవచ్చు!

Instant Mango Pickle: ఈ సింపుల్ టిప్స్ తో మామిడికాయ పచ్చడిని అప్పటికప్పుడు తయారు చేసుకోవచ్చు!

Instant Mango Pickle: వేసవి కాలం వచ్చిందంటే చాలు.. ఇంట్లో మామిడికాయ పచ్చడి వాసన రావాల్సిందే. అయితే చాలామంది మామిడికాయ పచ్చడి పెట్టడం చాలా కష్టం అనుకుంటారు. కానీ కొన్ని సింపుల్ టిప్స్ తో తక్కువ సమయంలో, రుచికరమైన పచ్చడి తయారుచేసుకోవచ్చు. ఎలాగో చూద్దాం.

2 Min read
Author : Kavitha G
Published : Apr 30 2026, 02:50 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16
మామిడి కాయ పచ్చడి తయారు చేసుకునే విధానం
Image Credit : Asianet News

మామిడి కాయ పచ్చడి తయారు చేసుకునే విధానం

ఇంట్లో అప్పటికప్పుడు తయారు చేసుకునే స్పైసీ, టేస్టీ మామిడి కాయ పచ్చడి అంటే ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి. చాలా సింపుల్ గా, తక్కువ మామిడికాయలతో రుచికరమైన పచ్చడి ఎలా చేసుకోవచ్చో తెలుసుకుంటే, రోజువారీ భోజనానికి ఒక బెస్ట్ సైడ్ డిష్‌ రెడీ అయినట్లే. మరి ఆలస్యమెందుకు అప్పటికప్పుడు పచ్చడి ఎలా తయారుచేయాలో ఇక్కడ తెలుసుకుందాం. 

26
కావాల్సిన పదార్థాలు
Image Credit : Istock

కావాల్సిన పదార్థాలు

ముందుగా 3 మీడియం సైజ్ పచ్చి మామిడి కాయలను తీసుకోవాలి. వాటిని బాగా కడిగి తడి లేకుండా పూర్తిగా ఆరబెట్టాలి. తడి ఉంటే పచ్చడి త్వరగా పాడవుతుంది. ఆ తర్వాత మామిడి కాయలను చిన్న చిన్న ముక్కలుగా కట్ చేయాలి. లోపలి టెంక భాగాన్ని తీసేయడం మంచిది. ఇప్పుడు ఈ ముక్కలను ఒక బౌల్‌లో తీసుకుని కొద్దిగా ఉప్పు వేసి పది నుంచి పదిహేను నిమిషాలు పక్కన పెట్టాలి. దీనివల్ల మామిడి కాయల్లోని నీరు బయటకు వచ్చి పచ్చడి కాస్త జ్యూసీగా మారుతుంది.

Related Articles

Related image1
Weight Loss: ఈ 5 టిప్స్ ఫాలో అయితే నెలకు 4 కేజీల వరకు బరువు తగ్గడం పక్కా!
Related image2
Pumpkin Seeds: ఎండాకాలంలో గుమ్మడి గింజలు తినొచ్చా? తింటే జరిగేది ఇదే..!
36
తయారు చేసే విధానం
Image Credit : pinterest

తయారు చేసే విధానం

ఒక పాన్‌లో కొద్దిగా ఆవాలు, మిరపకాయలు, మెంతులు వేసి మంచి వాసన వచ్చేవరకు వేయించాలి. ఆ తర్వాత వాటిని చల్లార్చి పొడి చేసుకోవాలి. ఈ పొడే పచ్చడికి ప్రధాన రుచి ఇస్తుంది. కొంతమంది ఇందులో కొద్దిగా వెల్లుల్లి కూడా వేస్తారు. వెల్లుల్లి కూడా పచ్చడికి మంచి టేస్ట్ ఇస్తుంది.

46
ముక్కలకు మసాలా పట్టించడం
Image Credit : pinterest

ముక్కలకు మసాలా పట్టించడం

తర్వాత ఒక కడాయిలో సరిపడా నూనె వేసి వేడి చేయాలి. నూనె వేడయ్యాక ఆవాలు వేసి చిటపటలాడిన తర్వాత ఎండుమిర్చి, కరివేపాకు వేసుకోవాలి. కరివేపాకు వేయడం వల్ల పచ్చడి మంచి వాసన వస్తుంది. ఇప్పుడు ముందుగా కట్ చేసి ఉప్పుతో కలిపి పెట్టిన మామిడి ముక్కలను ఇందులో వేసి బాగా కలపాలి. లో ఫ్లేమ్ పై 2–3 నిమిషాలు కలపడం వల్ల మామిడి ముక్కలు కొంచెం సాఫ్ట్‌గా మారి మసాలా బాగా పట్టుకుంటుంది.

56
పచ్చడి రెడీ
Image Credit : pinterest

పచ్చడి రెడీ

ఇప్పుడు ముందుగా తయారు చేసిన మసాలా పొడిని ఇందులో వేసి బాగా కలుపుకోవాలి. రుచి కోసం అవసరమైతే మరికొద్దిగా ఉప్పు లేదా కారం పొడి కూడా వేసుకోవచ్చు. చివరగా కాస్త నువ్వుల నూనె వేస్తే పచ్చడి రుచి ఇంకా పెరుగుతుంది. అంతేకాదు నువ్వుల నూనె వల్ల పచ్చడి ఎక్కువ రోజులు నిల్వ కూడా ఉంటుంది. పచ్చడి తయారు చేసి ఒక రెండు, మూడు గంటలు అలా పక్కన పెట్టేయాలి.

66
వేడి వేడి అన్నంతో..
Image Credit : stockphoto

వేడి వేడి అన్నంతో..

ఈ పచ్చడిని అన్నం, పెరుగు అన్నం లేదా ఇడ్లీతో కూడా తినవచ్చు. వేడివేడి అన్నంతో తింటే చాలా రుచిగా ఉంటుంది. అయితే నూనె, ఉప్పు కాస్త ఎక్కువగా ఉంటాయి కాబట్టి.. మితంగా తినడం మంచిది.

About the Author

KG
Kavitha G
8 సంవత్సరాలుగా జర్నలిజంలో ఉన్నారు. 2016లో ఈటీవీతో కెరీర్ ప్రారంభించారు. ప్రస్తుతం ఏసియానెట్‌లో ఫ్రీలాన్స్ జర్నలిస్ట్‌గా పని చేస్తున్నారు.
ఆహారం
జీవనశైలి
ఏషియానెట్ న్యూస్

Latest Videos
Recommended Stories
Recommended image1
Acrylic Bangles: కొత్తగా మరింత ట్రెండీగా యాక్రిలిక్ గాజుల డిజైన్లు
Recommended image2
Gold Chain: మెడ నిండుగా కనిపించే గోల్డ్ చైన్స్.. వెయిట్ కూడా తక్కువే
Recommended image3
Gold Studs: వర్కింగ్ ఉమెన్స్ కోసం అదిరిపోయే స్క్వేర్ షేప్ స్టడ్స్
Related Stories
Recommended image1
Weight Loss: ఈ 5 టిప్స్ ఫాలో అయితే నెలకు 4 కేజీల వరకు బరువు తగ్గడం పక్కా!
Recommended image2
Pumpkin Seeds: ఎండాకాలంలో గుమ్మడి గింజలు తినొచ్చా? తింటే జరిగేది ఇదే..!
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved