MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Life
  • Leftover Chapati: మిగిలిపోయిన చపాతీలతో అదిరిపోయే రెసిపీలు.. ట్రై చేయండి!

Leftover Chapati: మిగిలిపోయిన చపాతీలతో అదిరిపోయే రెసిపీలు.. ట్రై చేయండి!

Leftover Chapati: నైట్ చేసిన చపాతీలు మిగిలిపోయాయా? మళ్లీ తినలేక పడేస్తున్నారా? అయితే నెక్స్ట్ టైం అలా చేయకండి. మిగిలిపోయిన చపాతీలతో కూడా నోరూరించే టేస్టీ వంటకాలను తయారు చేసుకోవచ్చు. పిల్లల నుంచి పెద్దల వరకు అందరూ ఇష్టపడతారు. మరి అవేంటో చూసేయండి.

2 Min read
Author : Kavitha G
Published : Oct 27 2026, 02:00 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
17
మిగిలిపోయిన చపాతీలతో చేసే వంటకాలు
Image Credit : Asianet News

మిగిలిపోయిన చపాతీలతో చేసే వంటకాలు

రాత్రి పూట చేసిన చపాతీలు మిగిలిపోయాయా? మరుసటి రోజు వాటిని అలాగే తినే బదులు, టేస్టీ స్నాక్స్‌గా మార్చుకోవచ్చు. ఇంట్లో ఉండే ఉల్లిపాయలు, టమాటాలు, కూరగాయలు, మసాలాలతోనే మీరు చపాతీ నూడుల్స్, పిజ్జా, రోల్స్, చిప్స్, ఉప్మా లాంటి వెరైటీలను ఈజీగా చేసుకోవచ్చు. మరి వాటిని ఎలా చేయాలో తెలుసుకుందామా..

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
27
చపాతీ నూడుల్స్
Image Credit : Asianet News

చపాతీ నూడుల్స్

నూడుల్స్ ఇష్టపడే వారికి ఇది బెస్ట్ ఆప్షన్. ఫస్ట్ చపాతీలను సన్నగా, పొడవుగా కట్ చేసుకోవాలి. కడాయిలో నూనె వేసి ఉల్లిపాయ, క్యారెట్, క్యాప్సికమ్, క్యాబేజీ ముక్కలను వేయించాలి. ఆ తర్వాత మిరియాల పొడి, కొద్దిగా సోయా సాస్, ఉప్పు వేసి.. కట్ చేసిన చపాతీ ముక్కలను కూడా వేసి బాగా కలపాలి. అంతే టేస్టీ చపాతీ నూడుల్స్ రెడీ!

37
చపాతీ పిజ్జా
Image Credit : Asianet News

చపాతీ పిజ్జా

పిజ్జా తినాలనిపిస్తోందా? అయితే మిగిలిపోయిన చపాతీనే పిజ్జా బేస్‌గా వాడుకోవచ్చు. చపాతీ మీద టమాటా సాస్ లేదా పిజ్జా సాస్ రాయాలి. దానిపై ఉల్లిపాయ, క్యాప్సికమ్, టమాటా ముక్కలు, చీజ్ వేయాలి. మూతపెట్టిన కడాయిలో తక్కువ మంట మీద చీజ్ కరిగే వరకు వేడి చేయాలి. అంతే కింద క్రిస్పీగా, పైన జ్యూసీగా ఉండే చపాతీ పిజ్జా రెడీ!

47
చపాతీ రోల్
Image Credit : Asianet News

చపాతీ రోల్

మిగిలిపోయిన చపాతీ, కూరగాయలు, పనీర్ లేదా గుడ్డుతో చపాతీ రోల్ చేయవచ్చు. ముందుగా ఉల్లిపాయ, టమాటా, కూరగాయలు, మీకు ఇష్టమైన మసాలాలతో స్టఫింగ్ రెడీ చేసుకోవాలి. చపాతీని పెనం మీద కొద్దిగా వేడి చేసి, మధ్యలో ఈ మసాలాను పెట్టాలి. ఆ తర్వాత రెండు వైపులా మడిచి రోల్ లాగా చుట్టాలి. పిల్లల స్నాక్స్ బాక్స్‌కి, ప్రయాణాలకు ఇది పర్ఫెక్ట్.

57
చపాతీ చిప్స్
Image Credit : Asianet News

చపాతీ చిప్స్

క్రిస్పీ స్నాక్స్ ఇష్టపడే వారికి చపాతీ చిప్స్ మంచి ఎంపిక. చపాతీలను త్రిభుజాకారంలో చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. వాటికి కొద్దిగా నూనె రాసి, కారం, మిరియాల పొడి, ఉప్పు చల్లాలి. ఆ తర్వాత పెనం మీద లో ఫ్లేమ్ లో క్రిస్పీగా మారే వరకు వేయించాలి. ఓవెన్ ఉంటే అందులో కూడా చేసుకోవచ్చు. తక్కువ నూనెతోనే ఈ టేస్టీ స్నాక్ రెడీ అవుతుంది.

67
కొత్తు చపాతీ
Image Credit : Asianet News

కొత్తు చపాతీ

కొత్తు చపాతీ కోసం మిగిలిన చపాతీలను చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. కడాయిలో కొద్దిగా నూనె వేసి ఆవాలు, కరివేపాకు, ఉల్లిపాయ, టమాటా, పచ్చిమిర్చి వేసి వేయించాలి. ఆ తర్వాత కారం, పసుపు, తగినంత ఉప్పు కలపాలి. చివరగా చపాతీ ముక్కలు వేసి బాగా కలపాలి. మీకు ఇష్టమైతే గుడ్డు కూడా వేసుకోవచ్చు. అంతే, వేడివేడి కొత్తు చపాతీ రెడీ.

77
చపాతీ ఉప్మా
Image Credit : Asianet News

చపాతీ ఉప్మా

ఉదయం బ్రేక్‌ఫాస్ట్‌కి ఈజీ రెసిపీ కావాలంటే చపాతీ ఉప్మా బెస్ట్. మిగిలిన చపాతీలను చిన్న ముక్కలుగా చేసుకోవాలి. కడాయిలో నూనె వేసి ఆవాలు, మినప్పప్పు, ఉల్లిపాయ, పచ్చిమిర్చి, కరివేపాకు వేసి తాలింపు పెట్టుకోవాలి. ఉల్లిపాయలు వేగాక చపాతీ ముక్కలు వేసి బాగా కలపాలి. తగినంత ఉప్పు వేసి కాసేపు వేడి చేస్తే చపాతీ ఉప్మా రెడీ!

About the Author

KG
Kavitha G
8 సంవత్సరాలుగా జర్నలిజంలో ఉన్నారు. 2016లో ఈటీవీతో కెరీర్ ప్రారంభించారు. ప్రస్తుతం ఏసియానెట్‌లో ఫ్రీలాన్స్ జర్నలిస్ట్‌గా పని చేస్తున్నారు.
ఆహారం
జీవనశైలి
ఏషియానెట్ న్యూస్
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Chef Hat: రెస్టారెంట్స్ లో పనిచేసే చెఫ్స్... తలకు తెల్లటి టోపీనే ఎందుకు పెట్టుకుంటారు..?
Recommended image2
Hair Growth: ఈ మిశ్రమాన్ని రాస్తే చాలు..జుట్టు చాలా వేగంగా పెరుగుతుంది
Recommended image3
Jhumka With Chain: చీరలు, లెహంగాల మీదకు రాయల్ లుక్ ఇచ్చే జుంకా చైన్స్
Related Stories
Recommended image1
Glowing Skin: ఖరీదైన క్రీములతో పనిలేదు.. పెరుగులో ఈ ఒక్కటి కలిపి రాస్తే ముఖం మెరిసిపోతుంది!
Recommended image2
Interesting Facts: కారు, బస్సు నడిపితే డ్రైవర్, ట్రైన్ నడిపితే లోకో పైలట్ అని ఎందుకు అంటారు?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved