సెక్స్ లో భావప్రాప్తిని ఎంతకీ పొందడం లేదా?
ఒకరితో ఒకరు మనసు విప్పి మాట్లాడుకోవడం, సెక్స్ గురించి మరింత అవగాహన పొందడం చాలా అవసరం. అప్పుడే శృంగారంలో ఆనందాన్ని పొందుతారు.
సుఖం లేని శృంగారం అసంపూర్ణం. సుఖం లేకపోవడం వల్ల దంపతుల మధ్య గ్యాప్ ఏర్పడుతుంది. సంబంధాలలో దూరాన్ని పెంచుతుంది. ముఖ్యంగా ఇది మహిళల లైంగిక జీవితాన్ని చాలా వరకు ప్రభావితం చేస్తుంది. నిజానికి జంటలు తమ లైంగిక జీవితాన్ని మరింత ఆనందంగా ఉంచడానికి ఎన్నో మార్గాలను వెతుక్కుంటారు. అయితే రిలేషన్ షిప్ లో చాలా మంది భావప్రాప్తిని పొందలేకపోతుంటారు. మరి భావప్రాప్తిని పొందేందుకు ఎలాంటి చిట్కాలను పాటించాలో ఇప్పుడు తెలుసుకుందాం..
![article_image2](https://static-ai.asianetnews.com/images/01gxcq0gyx3tx7rcc7pahq19ex/sex-image-710x400_300x169xt.jpg)
మహిళలు పురుషుల కంటే తక్కువ లైంగిక ఆనందాన్ని అనుభవిస్తున్నారని కనుగొన్నారు. మహిళలకు లైంగిక ఆనందం ఇవ్వడంపై దృష్టి పెట్టకపోవడం వల్లే మన సమాజంలో భావప్రాప్తి అంతరం కూడా పెరుగుతోందని నిపుణులు అంటున్నారు. స్త్రీలు కూడా తమ ఆనందం గురించి మాట్లాడటానికి అస్సలు ఇష్టపడరు. దీనికి కారణం సెక్స్ గురించి మాట్లాడటం తప్పుగా భావిస్తారు. అసలు భావప్రాప్తిని పొందేందుకు ఏం చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం..
మీ అనుభవాలను పంచుకోండి
నిపుణుల ప్రకారం.. ఒకరితో ఒకరు మాట్లాడుకోవడం మంచిది. ఇది మీ మధ్యనున్న సమస్యను పరిష్కరిస్తుంది. మొదటి సారి శృంగారంలో పాల్గొన్నా లేదా వందో సారి శృంగారంలో పాల్గొన్నా ఆనందాన్ని పొందలేకపోతే మీ భాగస్వామితో ఓపెన్ గా మాట్లాడండి. మీరు ఈ సమస్యను ఎలా పరిష్కరించవచ్చో ఆలోచించండి. సెక్స్ లో భంగిమలను మార్చడానికి ట్రై చేయండి.
మీ ఇష్టాయిష్టాలను చెప్పండి
మీరు ఎక్కడ తాకడానికి ఇష్టపడతారో, ఎక్కడ తాకకూడదో ఓపెన్ గా మీ భాగస్వామితో చెప్పండి. ఇది మీ సంబంధాలను బలోపేతం చేస్తుంది. అలాగే సంబంధంలో ఆనందం కూడా రెట్టింపు అవుతుంది. మీ ఇష్టాయిష్టాలను తెలుసుకున్న తర్వాత సంబంధాలలో ఆనందం పెరగడం ప్రారంభమవుతుంది. ఇది లైంగిక సంతృప్తికి కారణమవుతుంది.
ఉద్వేగం గురించి మాట్లాడండి
పరిశోధనల ప్రకారం.. ఉద్వేగం మహిళల ఆనందం, లైంగిక సంతృప్తి సాధారణ శ్రేయస్సుపై ప్రభావం చూపుతుంది. అయితే మహిళలు ఉద్వేగం గురించి అస్సలు పట్టించుకోరు. టేలర్ అండ్ ఫ్రాన్సిస్ పరిశోధన ప్రకారం.. చాలా మంది మహిళలు తమ భాగస్వాములతో సెక్స్ కంటే హస్త ప్రయోగం ద్వారా భావప్రాప్తిని అనుభవిస్తారు. అలాగే మహిళలు కూడా ఈ సమయాన్ని ఆస్వాదించేలా తమ కోరికలను తీర్చుకోవాలి.
స్వీయ సంతృప్తి
ఇద్దరు వ్యక్తులు శృంగారంలో పాల్గొన్నప్పుడు.. వారిద్దరికీ ఆనందించే హక్కు ఉంటుంది. కానీ గణాంకాలు ఇందుకు పూర్తి విరుద్ధంగా ఉన్నాయి. ఫోర్బ్స్ ప్రకారం.. సెక్స్ సమయంలో 39 శాతం మంది మహిళలు మాత్రమే భావప్రాప్తిని పొందితే.. పురుషుల సంఖ్య 91 శాతం అని పరిశోధనలో తేలింది. లైంగిక చర్య సమయంలో మహిళలకు తక్కువ సంతృప్తి ఉన్నట్టు కనుగొనబడింది.
ఒకరికొకరు మద్దతు ఇవ్వండి
దంపతులు ఒకరి సమస్యలను మరొకరు అర్థం చేసుకోవాలని, వారికి మద్దతు ఇవ్వాలని నిపుణులు చెబుతున్నారు. ఇద్దరి కోరికలను తీర్చుకునేందుకు ప్రయత్నించాలి. ఒకవేళ మీకు వ్యక్తిగత సమస్య ఉంటే, సెక్స్ సమయంలో అది మీ మధ్యకు రానివ్వకండి. విడివిడిగా కూర్చొని పరిష్కరించుకోండి. అప్పుడే మీ లైంగిక జీవితం, మీ బంధం బాగుంటుంది.