MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today's Rasi Phalalu
Dakshina Kailasam Temple
Bigg Boss Agnipariksha
Ameer Log Movie Review
WTC Qualification Scenario
Sowcar Janaki
Agnipariksha Season 2
Telangana Air Pollution
Indian Diaspora in USA
Telangana Cinema Ticket Prices
Kavya Maran-Anirudh Wedding
Hyderabad TSRTC Bus Routes
  • Home
  • Life
  • Parenting: ప్రతి తల్లి తన కూతురికి పొరపాటున కూడా చెప్పకూడని 5 మాటలు ఇవే!

Parenting: ప్రతి తల్లి తన కూతురికి పొరపాటున కూడా చెప్పకూడని 5 మాటలు ఇవే!

Parenting: ప్రతి తల్లి తన కూతురి భవిష్యత్ కోసం ఎంతో కష్టపడుతుంది. మంచి సలహాలిస్తుంది. అయితే తల్లి కూతురికి ప్రేమతో చెప్పే మాటలు ఎంత ముఖ్యమో, ఆలోచించకుండా చెప్పే మాటలు అంతే ప్రమాదకరం. అవి కూతురి భవిష్యత్తుపై చెడు ప్రభావం చూపుతాయి. అవేంటో చూద్దాం.

2 Min read
Author : Kavitha G
Published : Aug 03 2026, 02:54 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16
కూతురికి తల్లి చెప్పకూడని 5 మాటలు
Image Credit : stockPhoto

కూతురికి తల్లి చెప్పకూడని 5 మాటలు

ప్రతి కూతురికి మొదటి గురువు, స్నేహితురాలు తల్లే. కూతురు తన గురించి తాను ఎలా ఆలోచించాలో, సమాజాన్ని ఎలా ఎదుర్కోవాలో చాలా వరకు తల్లి మాటల ద్వారా నేర్చుకుంటుంది. అందుకే తల్లి చెప్పే ప్రతి మాటకు ఎంతో విలువ ఉంటుంది. ప్రేమతో చెప్పిన మాట జీవితాంతం ధైర్యాన్ని ఇస్తే, ఆలోచించకుండా చెప్పిన మాటకూతురి మనసులో లోతైన గాయాన్ని మిగిల్చే అవకాశం ఉంటుంది. అందుకే ప్రతి తల్లి తన కూతురికి ఎప్పుడూ చెప్పకూడని 5 ముఖ్యమైన మాటలు ఏంటో తెలుసుకుందాం.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
26
అందంగా లేవని చెప్పడం
Image Credit : Getty

అందంగా లేవని చెప్పడం

ఒక అమ్మాయి తన రూపం గురించి మొదటిసారి అభిప్రాయం ఏర్పరుచుకునేది కుటుంబ సభ్యుల మాటల ద్వారానే. వేరే అమ్మాయిలతో పోల్చడం, అందంపై విమర్శించడం వల్ల ఆమె తనను తాను తక్కువగా భావించడం మొదలుపెడుతుంది. అందం కంటే వ్యక్తిత్వం, మంచితనం, ఆత్మవిశ్వాసం గొప్పవని చిన్నప్పటి నుంచే నేర్పాలి. నువ్వు ప్రత్యేకమైన వ్యక్తివి.. అనే భావనను కూతురి మనసులో తల్లి కల్పిస్తే, ఆమె జీవితంలో ఎన్నో సవాళ్లను ధైర్యంగా ఎదుర్కోగలదు.

Related Articles

Related image1
Parenting: పిల్లలకు చదువుపై ఇంట్రెస్ట్ రావాలంటే ఈ 5 పనులు చేసి చూడండి!
Related image2
Parenting: మగపిల్లల గురించి చాలామంది పేరెంట్స్‌కు తెలియని 5 నిజాలు ఇవే!
36
నీ వల్ల ఏం కాదనే మాట
Image Credit : Getty

నీ వల్ల ఏం కాదనే మాట

పరీక్షల్లో తక్కువ మార్కులు వచ్చినా, ఏదైనా పనిలో ఫెయిల్ అయినా, ఆమెను నిరుత్సాహపరిచే మాటలు కాకుండా ప్రోత్సహించే మాటలు చెప్పాలి. ప్రతి విజయం వెనుక ఎన్నో అపజయాలు ఉంటాయి. మళ్లీ ట్రై చెయ్, నేను నీతోనే ఉన్నాను అనే మాటలు ఆమె జీవితాన్ని పూర్తిగా మార్చగలవు. తల్లి నమ్మకం కూతురికి అతిపెద్ద బలం.

46
సమాజం ఏమంటుందో ఆలోచించమని చెప్పడం
Image Credit : unsplash

సమాజం ఏమంటుందో ఆలోచించమని చెప్పడం

సమాజం గురించి అవగాహన ఉండటం మంచిదే. కానీ ప్రతి నిర్ణయాన్ని ఇతరుల అభిప్రాయాల ఆధారంగా తీసుకోవాలని నేర్పడం సరైన పద్ధతి కాదు. ఇలా పెరిగిన అమ్మాయిలు తమ ఇష్టాలను, కలలను పక్కన పెట్టి ఇతరులను సంతోషపెట్టడానికి మాత్రమే ప్రయత్నిస్తారు. కూతురికి బాధ్యతతో నిర్ణయాలు తీసుకోవడం, తన విలువలను గౌరవించడం నేర్పాలి. సమాజం మారుతూనే ఉంటుంది, కానీ సెల్ఫ్ రెస్పెక్ట్ జీవితాంతం తోడుగా ఉంటుంది.

56
ఆడపిల్లలకు ఇంత చాలని చెప్పడం
Image Credit : unsplash

ఆడపిల్లలకు ఇంత చాలని చెప్పడం

చదువు, ఉద్యోగం, ఆర్థిక స్వేచ్ఛ లేదా కెరీర్ విషయంలో పరిమితులు పెట్టడం వల్ల కూతురి ఎదుగుదల ఆగిపోతుంది. నేటి ప్రపంచంలో అమ్మాయిలు ప్రతి రంగంలో అద్భుత విజయాలు సాధిస్తున్నారు. కూతురి కలలకు అడ్డుకట్ట వేయకుండా, వాటిని చేరుకునేందుకు అండగా నిలవడం తల్లిదండ్రుల బాధ్యత. నువ్వు అనుకున్నది సాధించగలవు అనే నమ్మకాన్ని తల్లి ఇవ్వడం ఎంతో అవసరం.

66
పెళ్లయితే అంతా సర్దుకుంటుందని చెప్పడం
Image Credit : Freepik

పెళ్లయితే అంతా సర్దుకుంటుందని చెప్పడం

ప్రతి సమస్యకు పెళ్లే పరిష్కారం అన్న భావనను కూతురిలో నింపకూడదు. పెళ్లి అనేది జీవితంలో ఒక భాగం మాత్రమే, మొత్తం జీవితం కాదు. ముందుగా ఆమె తన కాళ్లపై తాను నిలబడేలా, ఆర్థికంగా, మానసికంగా బలంగా ఉండేలా ప్రోత్సహించాలి. తన నిర్ణయాలను తానే తీసుకునే స్థాయికి చేరినప్పుడు మాత్రమే ఏ సంబంధమైనా హెల్తీగా ఉంటుంది. స్వతంత్రంగా జీవించడం నేర్చుకున్న అమ్మాయి ఎక్కడ ఉన్నా సంతోషంగా ఉంటుంది.

About the Author

KG
Kavitha G
8 సంవత్సరాలుగా జర్నలిజంలో ఉన్నారు. 2016లో ఈటీవీతో కెరీర్ ప్రారంభించారు. ప్రస్తుతం ఏసియానెట్‌లో ఫ్రీలాన్స్ జర్నలిస్ట్‌గా పని చేస్తున్నారు.
చిన్నారుల సంరక్షణ
జీవనశైలి
ఏషియానెట్ న్యూస్

Latest Videos
Recommended Stories
Recommended image1
Magic Drink: రోజూ ఈ మ్యాజిక్ డ్రింక్ ప్రతిరోజూ తాగారంటే చర్మం కళకళలాడిపోతుంది
Recommended image2
ఉదయాన్నే 30 రోజుల పాటూ తులసి నీళ్లు తాగి చూడండి.. మీరు ఊహించని మార్పులు
Recommended image3
Toxic Wife: మీ భార్యలో ఇలాంటి లక్షణాలు ఉంటే ఆమె వెరీ టాక్సిక్ వ్యక్తి అని అర్థం
Related Stories
Recommended image1
Parenting: పిల్లలకు చదువుపై ఇంట్రెస్ట్ రావాలంటే ఈ 5 పనులు చేసి చూడండి!
Recommended image2
Parenting: మగపిల్లల గురించి చాలామంది పేరెంట్స్‌కు తెలియని 5 నిజాలు ఇవే!
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved