ఇలాగైతే ఓజాంపిక్ పిల్లలు పుడతారు... తస్మాత్ జాగ్రత్త.. !
ఇన్నాళ్లు బరువు తగ్గేందుకు హెర్బల్ పేరుతొ మందులు అమ్ముడుపోయాయి... దాన్ని తిని కిడ్నీలు నాశనం చేసుకున్నవారు ఎందరో… ఇప్పుడు కొత్తగా ఓజాంపిక్ ఇంజెక్షన్స్…

బరువు తగ్గాలని ఇలా చేశారో..
వినాశ కాలే విపరీత బుద్ధి అని సామెత!
బరువు తగ్గాలంటే తక్కువ కెలొరీ ఆహారం తీసుకోవాలి.
ఇది వరకే శరీరంలో పేరుకున్న కొవ్వును కరిగించడానికి వ్యాయామం చేయాలి.
ఇంతకన్నా మరో దారిలేదు .
హై కెలొరీ జంక్ ఫుడ్ కు అలవాటుపడి శరీరంలో కిలోల కొద్దీ కొవ్వు పెంచుకొన్నవారికి ఇంత ఓపిక ఉండదు.
షార్ట్ కట్స్ కావాలి.
ఓజాంపిక్ ఇంజెక్షన్స్...
ఏదో ఒక మందు తింటే టక్కున కొవ్వు కరిగిపోయి స్లిమ్ అయిపోవాలి అని వీరు ఆశిస్తుంటారు.
ఇన్నాళ్లు హెర్బల్ పేరుతొ మందులు అమ్ముడుపోయాయి. దాన్ని తిని కిడ్నీలు నాశనం చేసుకున్నవారు ఎందరో.
శతకోటి దరిద్రాలకు అనంతకోటి ఉపాయాలు.
ఇప్పుడు కొత్తగా ఓజాంపిక్ ఇంజెక్షన్స్.
సేమగలూటిడ్ అనే ఈ మందును తీసుకొంటే పాంక్రియాస్ , కిడ్నీ, గాల్ బబ్లాడర్ కు సంభందించి తీవ్ర సమస్యలు వచ్చే ప్రమాదం అని నేను అనేక పోస్ట్లు పెట్టాను .
ఇప్పుడు అదిరిపోయే వార్త .
ఓజాంపిక్ పిల్లలు పుడతారు..
ఇది వరకే అధిక బరువు , పీసీఓఎస్ లాంటి సమస్యలతో బాధపడుతున్న మహిళల్లో ఓజాంపిక్ తీసుకొన్న కొన్ని నెలల్లో గర్భ ధారణ జరుగుతోందట .
ఎన్నో ఏళ్లుగా సంతానం కోసం ఎదురు చూస్తూ విసిగిపోయిన దంపతులకు ఇది శుభవార్త కదా అని ఎవరైనా అనుకోవచ్చు .
కానీ విషయం ఏమిటంటే ఇలా పుట్టే పిల్లల్ని ఓజాంపిక్ బేబీస్ అంటారు.
వీరికి తీవ్ర ఆరోగ్య సమస్యలుండే ప్రమాదం.
ఇప్పటికే ఆటిజం, ఏడీహెచ్ది పిల్లల సంఖ్య విపరీతంగా పెరుగుతోంది .
ఇప్పుడు ఓజాంపిక్ పిల్లలు .
థెరపీల పేరుతొ ఇప్పటికే ఆస్తులు దోచేస్తున్నారు.
ఇకపై రోజుల్లో !!

