MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Life
  • నాన్ వెజిటేరియన్స్ కోసం ఒట్టి తునకల కూర.. రాయలసీమ వారి స్పెషల్ వంట రెసిపీ ఇదిగో

నాన్ వెజిటేరియన్స్ కోసం ఒట్టి తునకల కూర.. రాయలసీమ వారి స్పెషల్ వంట రెసిపీ ఇదిగో

రాయలసీమలో తరచూ వండే వంటకాల్లో ఒట్టి తునకల కూర ఒకటి. ఎండిన చికెన్, మటన్ ముక్కలతో దీన్ని వండుతారు. చికెన్, మటన్ ముక్కలను వడియాల్లా ఎండబెట్టుకుని నచ్చినట్టు వండుకోవడమే దీని స్పెషాలిటీ. ఈ ఒట్టి తునకల కూర రెసిపీ ఎలాగో తెలుసుకోండి.

2 Min read
Author : Haritha Chappa
Published : Oct 15 2026, 01:10 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
13
ఒట్టి తునకలు ఎలా చేయాలి?
Image Credit : Gemini AI

ఒట్టి తునకలు ఎలా చేయాలి?

రాయలసీమ ఒట్టి తునకల కూర లేదా ఎండు మాంసం కూరకు ఎంతో స్పెషల్. చేపలను ఎలాగైతే ఎండబెట్టి ఎండుచేపలుగా మార్చి ఏడాదంతా వాడుకుంటారో అలాగే చికెన్, మటన్ ను కూడా ఎండబెట్టి తునకల కూర చేసుకుంటారు. ఇందుకోసం చికెన్, మటన్ కు పసుపు, కాస్త ఉప్పు రాసి ముక్కలుగా చేసుకుని ఎర్రటి ఎండలో పెడతారు. అవి బాగా ఎండాక ఒక డబ్బాలో దాచుకుంటారు. వండేముందు తీసి నీటిలో కాసేపు నానబెట్టి కూర వండుకుంటారు. ఈ కూర రుచి అదిరిపోతుంది.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
23
ఒట్టి తునకల కూరకు కావాల్సిన వస్తువులు
Image Credit : thehappyfoodie.co.uk

ఒట్టి తునకల కూరకు కావాల్సిన వస్తువులు

ఒట్టి తునకలు: 1 కప్పు

ఉల్లిపాయ: ఒకటి

టమోటా: ఒకటి

పచ్చిమిరపకాయలు: మూడు

అల్లం-వెల్లుల్లి ముద్ద (పేస్ట్): రెండు చెంచాలు

కారం: ఒక చెంచా

పసుపు: పావు చెంచా

ఉప్పు: రుచికి తగినంత

గరం మసాలా: ఒక స్పూను

లవంగాలు: రెండు

దాల్చిన చెక్క: చిన్న ముక్క

కొత్తిమీర: కొద్దిగా (సన్నగా తరగాలి)

నూనె: 2 నుంచి 3 చెంచాలు

నీళ్లు: సరిపడా

33
ఒట్టి తునకల కూర రెసిపీ
Image Credit : myfoodstory.com

ఒట్టి తునకల కూర రెసిపీ

1. ముందుగా ఒక గిన్నెలో కొన్ని నీళ్లు పోసి బాగా మరిగించండి. ఆ వేడి నీళ్లలో ఒట్టి తునకలను వేసి కాసేపు నాననివ్వండి.

2. ఇప్పుడు స్టవ్ మీద కళాయి పెట్టి బాణలిలో నూనె వేసి వేడి చేయండి.

3. నూనె కాగాక లవంగాలు, దాల్చిన చెక్క వేసి చిటపటలాడనివ్వండి. ఆ తర్వాత ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి వేసి ఎర్రగా వేయించండి.

4. ఉల్లిపాయలు వేగాక అల్లం-వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన పోయే వరకు వేయించండి.

5. ఇప్పుడు టమోటా ముక్కలు వేసి మెత్తగా అయ్యేలా మగ్గనివ్వండి.

6. టమోటాలు మగ్గిన తర్వాత పసుపు, కారం, ఉప్పు వేసి బాగా కలపండి.

7. ఇప్పుడు వేడి నీళ్లలో నానిన తునకలను తీసి ఈ మసాలాలో వేసి 2 నిమిషాలు కలపండి.

8. తర్వాత ముక్కలు ఉడకడానికి సరిపడా నీళ్లు పోసి, మూత పెట్టి సన్నని మంటపై ఉడికించండి.

9. కూర బాగా దగ్గరపడి నూనె పైకి తేలుతున్నప్పుడు గరం మసాలా పొడి చల్లండి.

10. స్టవ్ కట్టేసే ముందు కొత్తిమీర తరుగు చల్లి దింపేయండి. అంతే టేస్టీ ఒట్టి తునకల కూర రెడీ అయినట్టే.

About the Author

HC
Haritha Chappa
హరిత ఏసియా నెట్‌లో చీఫ్ సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. జర్నలిజంలో పీజీ పూర్తి చేశారు. ఈనాడు, సమయం, ఆంధ్రజ్యోతి, ఏబీపీ నెట్ వర్క్, హిందూస్థాన్ టైమ్స్ లో పనిచేశారు. ప్రింట్, డిజిటర్ మీడియాలో 18 ఏళ్ల అనుభవం ఉంది. ఏసియా నెట్ లైఫ్ స్టైల్, బిజినెస్, ఓటీటీ మూవీ కంటెంట్, ఆస్ట్రాలజీ కంటెంట్ రాస్తారు.
జీవనశైలి
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Whisky: విస్కీ అసలైన రుచి తెలియాలంటే ఎలా తాగాలి..? నీళ్లతోనా, ఐస్ తోనా..?
Recommended image2
Railway Travel Insurance: రైల్వే ప్రయాణికులకు రూ.10 లక్షల బీమా..అక్టోబర్ 27 నుంచి కొత్త రూల్
Recommended image3
Dosa: ఇదొక్కటి కలిపితే...పులిసిపోయిన దోశ పిండిని మళ్లీ రుచిగా మార్చేయచ్చు.. హోటల్ స్టైల్ దోశ పక్కా
Related Stories
Recommended image1
Honey: తేనే తయారుచేసే వింతైన చీమలు ఇవిగో.. వీటి తేనే ఖరీదు తెలిస్తే షాకవుతారు
Recommended image2
ప్రతి వారం అక్కడ ‘తెల్లని అబ్బాయిల మార్కెట్’... వారిని కొనేది ఎవరో, ఎందుకు కొంటారో తెలుసా?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved